Home » news
Vande Bharat Express: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వేగవంతమైన కనెక్టివిటీని పెంచేందుకు కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ ఆదివారం అనగా ఈనెల 15 నుంచి ప్రారంభం అవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ రిమోట్ వీడియో లింక్ ద్వారా జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ రైలు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి విశాఖపట్నం వరకూ నడిస్తుంది. సంక్రాంతి పండుగ కానుకగా అందిస్తున్న ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ కు శనివారం నుంచే టికెట్ బుకింగ్ లను […]
CM KCR: దేశ, రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. పంటపొలాల నుంచి ధాన్యం ఇంటికి చేరిన సమయంలో జరుపుకునే పండుగే సంక్రాంతి అని, నమ్ముకున్న భూతల్లికి రైతు కృతజ్ఞతలు తెలుపుకునే రోజే సంక్రాంతి పండుగ అని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ పల్లెలు పచ్చని పంటపొలాలతో సంక్రాంతి శోభను సంతరించుకున్నాయని వెల్లడించారు. రాష్ట్ర వ్యవసాయరంగం సాధించిన ప్రగతి యావత్ దేశానికి మార్గదర్శనంగా నిలిచిందని చెప్పారు. ఇవాళ […]
YSRCP: భోగి పండగ సంబరాలు ఊరు వాడన అంబరాన్ని అంటుతున్నాయి. పిల్లా పాపలతో పల్లెలు సందడిగా మారగా.. యువతలో పండగా జోష్ మొదలయింది. ఇక.. ఎప్పుడూ రాజకీయాలతో బిజీగా ఉండే నేతలు కూడా రాజకీయాలను పక్కనపెట్టేసి పండగ సంబరాల్లో మునిగితేలుతున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ నివాసంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన సంక్రాంతి వేడుకల్లో సీఎం జగన్ తన సతీమణి భారతీరెడ్డితో కలిసి పాల్గొన్నారు. సంస్కృతి, సంప్రదాయాల […]
TDP: నారా – నందమూరి కుటుంబాలు సంక్రాంతి సంబరాల్లో మునిగిపోయారు. నారావారిపల్లెలో భోగి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి వచ్చిన ఆయన బావమరిది, నటుడు, ఎమ్మెల్యే బాలయ్య కుటుంబసభ్యులతో కలిసి భోగిమంటలు వేశారు. రెండు కుటుంబాలతో పాటుగా బంధువులు, గ్రామస్థులు వారితో కలిసి సంబరాలు చేసుకున్నారు. ఇక్కడ మాట్లాడిన బాలయ్య రాష్ట్రానికి మళ్లీ మంచి రోజులు వస్తున్నాయని చెప్పారు. బాలయ్య ప్రతీ ఒక్కరినీ పలకరించి భోగి శుభాకాంక్షలు చెప్పడం విశేషం. తన సినిమా […]
Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రలో విషాద ఛాయలు నెలకొన్నాయి. కాంగ్రెస్ ఎంపీ, మాజీ మంత్రి సంతోక్ సింగ్ చౌదరి కన్నుమూశారు. పంజాబ్‌లోని ఫిల్లౌర్ వద్ద భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి నడుస్తుండగా అకస్మాత్తుగా అస్వస్థతకు గురై రోడ్డుపై కుప్పకూలి పడిపోగా వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగానే ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన జలంధర్‌కు ఎంపీగా ఉన్నారు. ఎంపీ మృతితో రాహుల్ గాంధీ వెంటనే జోడో […]
Telangana News: పల్లెల్లో ఇప్పటికే పోస్ట్ మార్టంపై అనేక అనుమానాలున్నాయి. మృతిపై అనుమానులుంటే తప్ప మిగతా సందర్భాలలో పోస్టుమార్టం చేసేందుకు మృతుడి కుటుంబ సభ్యులు సుముఖంగా ఉండరు. చనిపోయాక కూడా మృతదేహాన్ని కోసి, కుట్లు వేయడం.. అవయవాలను కత్తిరిస్తారని ఎన్నో అపోహలు ఉండడంతో పోస్టుమార్టం చేసేందుకు కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదు. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఓ వ్యక్తి మృతి చెందాడన్న సమాచారంతో పోలీసులు గ్రామానికి చేరుకుని మృతదేహానికి […]
China COVID: డ్రాగన్ కంట్రీలో కరోనా వైరస్ అడ్డూ అదుపు లేకుండా చెలరేగిపోతోంది. ప్రతి రోజు లక్షలాదిమంది వైరస్ బారినపడుతున్నారు. మరణాలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నట్టు పలు నివేదికలు చెబుతున్నాయి. నిన్న మొన్నటి వరకు జీరో కొవిడ్ విధానాన్ని పాటించిన చైనా ఆ తర్వాత కరోనా ఆంక్షలు సడలించి, లాక్‌డౌన్లు ఎత్తివేసింది. దీంతో వైరస్ మరింతగా చెలరేగిపోయింది. రోజూ లక్షలాదిమందిని వైరస్ చుట్టుముడుతూ చైనా దేశాన్ని మహమ్మారి వణికిస్తుంది. తాజాగా, చైనాకు సంబంధించి మరో ఆందోళనకర […]
YSRCP: ఒకవైపు ఏపీలో రాజకీయం రసకందాయంగా సాగుతుంది. వచ్చే ఎన్నికలలో ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకుంటారు? అధికార పార్టీ వైసీపీ మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకోగలదా? అనే రాజకీయ చర్చలు జరుగుతుండగానే.. అధికార పార్టీలో కొందరు అసమ్మతి నేతలు ఇప్పుడిప్పుడే మీడియాకి ఎక్కుతున్నారు. వీళ్ళు చాలదన్నట్లు పార్టీలో అంతర్గత కుమ్ములాటలు అధికార పార్టీకి తలపోటుగా మారింది. అది కూడా చాలదనుకున్నారో ఏమో కౌన్సిలర్లే ప్రజల ముందే నడివీధిలో కొట్లాటకు దిగారు. సత్యసాయి జిల్లా హిందూపురంలో వైసీపీ కౌన్సిలర్లు నడిరోడ్డుపైనే […]
Hyderabad: రోజంతా బైకు మీద డెలివరీలు చేస్తే కానీ.. పూట గడవదు. సిటీలో డెలివరీ అంటే రోడ్ల మీద ట్రాఫిక్ సమస్యలు.. అడ్రస్ సరిగా అర్ధం కాని గందరగోళం.. దీనికి తోడు సరైన సమయానికి డెలివరీ ఇవ్వలేకపోతే అటు సంస్థ నుండి ఇటు యజమాని నుండి ఇబ్బందులు తప్పవు. అందుకే ఉరుకుల పరుగుల మీద డెలివరీ బాయ్స్ పరుగులు పెడుతుంటారు. ఇలా పరుగులు పెట్టే సమయంలో కొందరు ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. హైదరాబాద్ లో అలాంటి విషాద […]
AP Capital: ఏపీలో మూడు రాజధానుల అంశం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. ప్రస్తుతానికి దీనికి సంబంధించిన కేసు సుప్రీం కోర్టు పరిధిలో ఉండగా ఈ నెలాఖరున దీనిపై విచారణ జరగనుంది. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు మూడు సంవత్సరాలుగా ఉద్యమం చేస్తున్నారు. ఈలోగా జగన్ మోహన్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చిన మూడు రాజధానుల బిల్లును కూడా ప్రభుత్వం వెనక్కు తీసుకోగా.. అప్పటికే రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు […]