Home » news
BJP-BRS: తెలంగాణలో హైదరాబాద్ సమీపంలోని మెయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌజ్‌లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు జరిగిన భేరసారాల వ్యవహారం బట్టబయలై రాజకీయ ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. పార్టీ మారితే డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామంటూ టిఆర్ఎస్ కు చెందిన అచ్చంపేట, పినపాక, కొల్లాపూర్, తాండూరు ఎమ్మెల్యేలను కొందరు ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారు. ఈ బేరసారాలలో కీలకవ్యక్తిగా నందకుమార్ ను తేల్చారు. పూజల కోసం మాత్రమే తాము ఫామ్ హౌస్ కు వెళ్లామని నందకుమార్ వాదించిన ఇవేమీ నిలవలేదు. […]
TDP-BJP: ఏపీలో ఇప్పటికే జనసేన పార్టీతో దాదాపుగా పొత్తు ఖరారు చేసుకున్న టీడీపీ బీజేపీ విషయంలో మాత్రం ఇంకా కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ.. టీడీపీకి మాత్రం దూరంగానే ఉన్నామని చెప్తుంది. అయితే.. టీడీపీ మాత్రం బీజేపీతో కలిసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఏపీతో పాటు తెలంగాణలో కూడా బీజేపీతో కలిసి వెళ్లేందుకు టీడీపీ సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆ మధ్య ఖమ్మంలో భారీ సభ నిర్వహించిన టీడీపీ.. ఈ సభ […]
Kesineni Nani: తానే సామంతరాజునని బిల్డప్ ఇస్తే కృష్ణానదిలో ఈడ్చికొడతారంటూ టీడీపీ ఎంపీ కేశినేని నానీ సీరియస్ కామెంట్ చేశారు. అయితే.. ఇది ప్రత్యర్థి పార్టీ మీద చేసి ఉంటే దాదాపుగా అందరు రాజకీయ నాయకులూ చేసేదే కదా అని సైలెంట్ అయ్యే వారు. కానీ.. నానీ అన్నది సొంత పార్టీలోని సభ్యులనే కావడం ఆసక్తిగా మారింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఎన్టీఆర్ మెమోరియల్ కబడ్డీ టోర్నమెంట్ బహుమతుల ప్రధానోత్సవంలో కేశినేని పాల్గొన్నారు. అక్కడ మాట్లాడిన కేశినేని […]
AP Ministers: ఏపీలో ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉన్నా.. ఇక్కడ పొలిటికల్ హీట్ మాత్రం ఓ రేంజ్ లో ఉంది. రానున్న ఎన్నికలకు పొత్తులపై చర్చలు, సంప్రదింపులు జరుగుతుండగా ఈ హీట్ తారాస్థాయికి చేరింది. టీడీపీతో జనసేన పొత్తు దాదాపు ఖరారు కావడంతో వైసీపీ తీవ్ర విమర్శలకి దిగుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిసిన దగ్గర నుండి ఘాటు విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలు మరోసారి పవన్ పై విమర్శలు గుప్పించారు. […]
Ambati Rambabu: అదేంటో పాపం గతంలో ఏ ప్రభుత్వం మీద రాని ఆరోపణలు కూడా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వస్తున్నాయి. ఆ మధ్గ్య గుడివాడ క్యాసినోవా అందించారని పెద్ద ఎత్తున దుమారం చెలరేగగా.. అందుకు అప్పటి మంత్రే బాధ్యుడని కూడా ఆరోపణలు వచ్చాయి. అప్పటి మంత్రి కొడాలి నానీ అనుచరులే ఈ క్యాసినోవా ఆడించారని ప్రచారం జరిగింది. చివరికి కొడాలి ఏమో జరిగి ఉండొచ్చు కానీ తనకేం సంబంధం లేదని చెప్పుకున్నారు. కాగా, ఇప్పుడు […]
Chiranjeevi: సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వాల్తేరు వీరయ్యగా రాబోతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. బాబీ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. చిరంజీవి కూడా గతంలో ఎన్నడూ లేనంతగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పలు టీవీ షోలకు, ఇంటర్వ్యూలకు కూడా హాజరవుతూ.. వాల్తేరు వీరయ్యకు మరింత హైప్ తెచ్చే పనిలో ఉన్నాడు. కాగా, అలా ప్రమోషన్లలో ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. […]
హాలీవుడ్ లో ఆస్కార్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మిక అవార్డు అయిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో RRR నామినేట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా నేడు ఉదయం గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుక గ్రాండ్ గా జరిగింది. ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో RRR సినిమా నుంచి..............
Seediri Appalaraju: పవన్ కళ్యాణ్ ఒక వెర్రిబాగులోడు.. నాదెండ్ల మనోహర్ ఒక పనికిమాలినోడు అంటూ మంత్రి సీదిరి అప్పలరాజు తిట్టిపోశారు. మత్స్యకారుల సమస్యల గురించి పవన్ కళ్యాణ్ కు, నాదెండ్ల మనోహర్ కు ఏమి తెలుసు అంటూ మంత్రి సీదిరి అప్పలరాజు మత్స్యకారులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో పర్యటిస్తూ పవన్ కళ్యాణ్ ను నమ్మొద్దంటూ ప్రచారం మొదలుపెట్టారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం ఎన్నో చేశామని ప్రచారం చేస్తున్నారు. అయితే.. ఒక్కసారిగా […]
Pakistan food crisis: దాయాది దేశం పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంతో విలవిలలాడుతుంది. నిత్యావసర సరుకులు కూడా కొనలేని స్థితికి అక్కడి ప్రజలు చేరుకోగా.. రాయితీపై అందించే నిత్యావసర వస్తువులపై కూడా పాక్ ప్రభుత్వం కోత పెడుతోంది. ఒకవైపు ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. మరోవైపు ప్రభుత్వం నుండి అందాల్సిన సరుకులు కూడా ప్రజలకు అందడం లేదు. ఇప్పటికే పాక్ లో ఒక్కో సిలిండరు 3 వేల నుండి 4 వేల రూపాయలు పలుకుతుండగా.. దేశంలోనే ఎక్కువగా […]
AP High Court: ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కొత్త న్యాయమూర్తులు రానున్నారు. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఆమోదముద్ర మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఏపీ హైకోర్టుకు కొత్తగా ఇద్దరు న్యాయమూర్తులు రానున్నారు. ఇప్పటికే జ్యుడీషియల్ అధికారుల కోటా నుంచి ఎంపిక పూర్తి కాగా.. ప్రతిపాదనలు కూడా కేంద్ర ప్రభుత్వానికి వెళ్లాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని కొలీజియం ఈ మేరకు పేర్లను సిఫారసు చేయగా.. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. జ్యుడీషియల్ […]