Home » news
BRS Party: తెలంగాణ సీఎం కేసీఆర్ తమ బీఆర్ఎస్ పార్టీని దేశమంతా విస్తరించే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే మరో తెలుగు రాష్ట్రమైన ఏపీలో కూడా తన పార్టీ కార్యకలాపాలు మొదలు పెట్టారు. ఇప్పటికే ఏపీ పార్టీకి అధ్యక్షుడిని కూడా ఎన్నుకున్న బీఆర్ఎస్ పార్టీ మరికొంతమందిని కూడా పార్టీలో చేర్చుకుంది. ఇక, ఏపీలో పార్టీ విస్తరణకు వచ్చిన ఏ అవకాశాన్ని కూడా ఇక్కడ నాయకులు వదులుకోవడం లేదు. ఏపీలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్న […]
Nepal Plane Crash: నేపాల్ లో ఘోర ప్రమాదం సంభవించింది. నేపాల్‌లోని పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఖట్మాండూ నుంచి కాస్కీ జిల్లాలోని పొఖారాకు బయల్దేరిన విమానం కుప్పకూలింది. ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 72 మంది ఉన్నారు. త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన విమానం కుప్పకూలిపోయింది. వెంటనే మంటలు వ్యాపించడంతో చూస్తుండగానే విమానం కాలిపోయింది. విమానంలోని 72 మంది మృతదేహాలను బయటకు తీశామని విమానయాన అధికారులు తెలిపారు. విమానంలో 53 మంది […]
AP Politics: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీనియర్ రాజకీయ నేత, మాజీ సీఎం ఎన్టీఆర్ పెద్ద అల్లుడు, కేంద్రమంత్రి పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. ఈ మేరకు ఆయన తన అభిప్రాయాన్ని అభిమానులు, అనుచరుల మధ్య వ్యక్తపరిచారు. వెంకటేశ్వరరావు ఒక్కరే కాదు.. తనతో పాటుగా తన కుమారుడు హితేష్ కూడా రాజకీయాలకు స్వస్తి చెబుతున్నట్లు అభిమానుల మధ్య వెల్లడించారు. అయితే, ఆయన భార్య పురందేశ్వరి మాత్రం బీజేపీలోనే కొనసాగనున్నారు. నిజానికి 2014లోనే దగ్గుబాటి […]
BRS Party: తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ గా రూపాంతరం చెంది జాతీయ స్థాయిలో జెండా పాతాలని చూస్తున్నారు. ఇప్పటికే ఆ దిశగా అడుగులు మొదలు పెట్టిన గులాబీ బాస్ ప్రతి అడుగు ఆచితూచి పగడ్బంధీగా వేస్తున్నారు. అయితే.. కేసీఆర్ ఒకవైపు జాతీయ స్థాయి రాజకీయాలపై ఫోకస్ చేస్తుంటే.. ఇక్కడ రాష్ట్రంలో తమ్ముళ్లు మాత్రం ఇంటి పోరులో కత్తులు దూస్తున్నారు. బహిరంగంగానే మాటల దాడికి దిగుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో గ్రూపు […]
Sankranti 2023: అతిధి మర్యాదలకు పెట్టింది పేరు గోదావరి జిల్లాలు. మర్యాద అంటే.. గోదావరోళ్లు.. గోదావరోళ్లంటే మర్యాద అనేంతగా ఉంటుంది. వారు మాట్లాడే విధానం.. అతిథి మర్యాదల వరకు అన్నింటిలో కూడా వారి మర్యాద ఉట్టిపడుతుంది. ముఖ్యంగా మాటకు ముందు గారు, మాట తరువాత గారు అంటూ మర్యాదకు మారుపేరుగా నిలుస్తుంటారు. ఇక అల్లుళ్లకు గోదావరోళ్లు ఇచ్చే రెస్పెక్ట్ ఓ రేంజ్‌లో ఉంటుంది. సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఇక ఈ మర్యాద పీక్స్ లెవల్‌కు వెళ్తుంది. ఇంటికొచ్చిన […]
Sankranti 2023: సంక్రాంతి పండుగంటేనే ప్రతి ఇంటా ఘుమఘుమలాడే పిండి వంటలు.. ఆకాశంలో ఎగిరే పతంగులు, వాకిళ్లలో పరుచుకునే రంగురంగుల ముగ్గులు, హరిదాసుల కీర్తనలు, పిల్లలు,పెద్దలు ఆటపాటలతో సందడి చేసే పల్లెలు, పట్టణాలు, నగరాలు. వాడవాడలా సంక్రాంతి సంబురాలు అంబరాన్ని అంటుతున్నాయి. పిండివంటల రుచులు, ముగ్గుల పోటీలు, కళా-సాంస్కృతిక కార్యక్రమాలతో రాష్ట్రం నలుమూలలా సంక్రాంతి శోభ సంతరించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. వారాంతంలోనే పెద్ద పండుగ కూడా కలిసి రావడంతో చదువు, ఉద్యోగరీత్యా […]
Minister KTR: తెలంగాణకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధానాలు నిలబెట్టుకునే సమయం ఆసన్నమైందని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి సహకరించాలని కోరిన కేటీఆర్.. తెలంగాణ వంటి రాష్ట్రాలకు సహకరిస్తే దేశానికి సహకరించినట్లేనని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర పారిశ్రామిక ప్రాజెక్ట్‌లకు జాతీయ ప్రాధాన్యత వుందని.. హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-నాగపూర్, హైదరాబాద్-విజయవాడ పారిశ్రామిక కారిడార్‌లకు ఆర్ధిక సాయం చేయాలని కేటీఆర్ కోరారు. అంతేకాదు, బ్రౌన్ ఫీల్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ […]
President Security: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాదాలు తాకేందుకు ప్రయత్నించిన అధికారినిపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రోటోకాల్ ఉల్లంఘించి అధికారిని చేసిన పనికి కేంద్ర హోంశాఖ కఠినంగా వ్యవహరించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారిని పనిని తప్పుబట్టడంతో హోంశాఖ అధికారినిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రాజస్థాన్‌కు చెందిన ఓ మహిళా ఇంజినీర్ రాష్ట్రపతి ముర్ము పాదాలను తాకేందుకు ప్రయత్నించడాన్ని రాజస్థాన్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాజస్థాన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో అధ్యక్షురాలు ద్రౌపది […]
Dharmana Prasada Rao: ఒకవైపు ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని బల్లగుద్ది చెప్తుండగా.. ఈనెల 31న సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉండబోతుందన్న ఆసక్తి ఏపీ రాజకీయ వర్గాలలో కనిపిస్తుంది. ఇప్పటికీ అమరావతి రైతులు నిరసన గళం వినిపిస్తుండగా.. ఉగాది తర్వాత పరిపాలన విశాఖ నుండే కొనసాగనుందని.. ఈ మేరకు ప్రభుత్వంలో ముహూర్తం కూడా ఖరారైందని ప్రచారం జరిగిపోతుంది. మరోవైపు ఉత్తరాంధ్ర నుండి కొత్త డిమాండ్ ఒకటి తెరపైకి వచ్చి క్రమేపీ ఇది బలపడుతూ వస్తుంది. […]
సుస్మిత కొణిదెల మాట్లాడుతూ.. ఈ సారి సంక్రాంతి మరింత గ్రాండ్ గా, సంతోషంగా జరుపుకుంటున్నాం. ఉపాసన ప్రెగ్నెంట్ కావడం, చరణ్ తండ్రి కాబోతుండటం అందరికి ఎంతో సంతోషంగా ఉంది. ఉపాసనది డాక్టర్స్ ఫ్యామిలీ కాబట్టి.....................