Home » news
Earthquake: భారీ భూకంపం ఇండోనేషియాను వణికించింది. తూర్పు ఇండోనేసియాలోని తనింబర్ దీవులలో 7.6 తీవ్రతతో భూకంపం సంభవించగా.. ఫలితంగా 5 సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. దీని వల్ల అక్కడి ఇళ్లు ధ్వంసమవగా.. తనింబర్, మలుకు జిల్లాల్లో రెండు పాఠశాల భవనాలు, 124 ఇళ్లు దెబ్బ తిన్నాయని నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఏజెన్సీ తెలిపింది. భూకంప ప్రభావంతో పపువా, తూర్పు నుసా టెంగ్గారా ప్రావిన్స్ లతో పాటు జకార్తా, ఉత్తర ఆస్ట్రేలియాలోని అనేక ప్రాంతాలలో […]
Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతిపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి ఒక్కటే రాజధాని కాకుండా మూడు రాజధానులను ప్రతిపాదించింది. విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని, అమరావతిలో శాసన రాజధాని ఉంటాయని ప్రకటించింది. దీనిపై అమరావతి ప్రాంత రైతులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయగా అప్పటి నుండి ఇప్పటికీ నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని […]
TDP vs YSRCP: ఏపీలో ఎక్కడ చూసినా అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు, దాడులే కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేల స్థాయి నేతలేమో ప్రత్యర్థులపై మాటల దాడికి దిగుతుంటే.. కింది స్థాయి కార్యకర్తలు ఏకంగా భౌతిక దాడులకు దిగుతున్నారు. ప్రతిపక్షాలు ఎక్కడ ఎలాంటి కార్యక్రమం చేపట్టినా పోలీసుల అడ్డంకులతో రణరంగంగా మారడం.. ఇటు అధికార పార్టీ కార్యక్రమాలకు ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు ఆటంకాలు కలిగించడంతో ఇక్కడ ఎప్పటికప్పుడు హీట్ పెరుగుతూనే ఉంది. వైసీపీ నేతలు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని […]
Cold Wave: ఉత్తర భారతాన్ని చలి గజగజ లాడిస్తుంది. గత వారం రోజుల నుంచి ఉత్తర భారతం చలికి వణికిపోతుండగా.. ఢిల్లీ, యూపీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో రోజు రోజుకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఇక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఒక వైపు చలి, మరో వైపు పొగ మంచుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కన్ను పొడుచుకున్నా కంటికి కనిపించనంతగా పొగమంచు కురుస్తుండడంతో రవాణా ఎక్కడిక్కడే ఆగిపోతుంది. మరికొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి […]
T.G.Venkatesh: తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని ఆయన నివాసానికి వెళ్లి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిశారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో జగన్ మోహన్ రెడ్డి సర్కారు నిర్ణయాలపై ఐక్య పోరాటానికి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ రెండు పార్టీల నుండి మీడియాకి చెప్పింది ఐక్య పోరాటమే అయినా.. వచ్చే ఎన్నికలలో రెండు పార్టీల పొత్తుకు మార్గం సుగుమమైందన్నది రాజకీయమెరిగిన సత్యం. కాగా.. అలా పవన్ చంద్రబాబు నివాసానికి వెళ్లారో […]
YSRCP MLA: ఇప్పటి రాజకీయాలకు పది మంది పోరంబోకులను వెంటేసుకుని తిరిగే వాళ్ళే కావలి.. అలా ఉంటేనే నాయకుడిగా ముందుకు సాగే పరిస్థితి ఉందని వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పటి రాజకీయాలకు.. ఇప్పటి రాజకీయాలకు చాలా తేడా ఉందన్న ఆయన ఇప్పటి రాజకీయాల్లో పోరంబోకులు ఉండాలన్నారు. అలా రాజకీయం చేతకాకనే తాను పాత తరం నాయకుడిగానే మిగిలిపోయానని వసంత కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి వసంత నాగేశ్వరరావు […]
TS Congress: కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన 12 మంది ఎమ్మెల్యేలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డీజీపీకి ఫిర్యాదు చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీ కొనుగోలు చేసిందని.. ఈ మేరకు కేసు నమోదు చేసి సీబీఐతో విచారణ జరిపించాలని రేవంత్ కోరారు. రేవంత్ వెంట మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డితో ఇతర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. అంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు.. ఈమేరకు విచారణ […]
BRS Party: జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారాలనుకుంటున్న భారత రాష్ట్ర సమితి ఆ దిశగా పని మొదలు పెట్టింది. ఆ మధ్య ఏపీలో పార్టీ విస్తరణ మొదలు పెట్టిన కేసీఆర్.. అక్కడ కొందరు నాయకులకు పార్టీలో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా సంక్రాంతి తర్వాత మనపై ఒత్తిడి పెరుగుతుందని చెప్పారు. అందుకు అనుగుణంగానే ముందుగా తెలంగాణలో రైతు, రాజకీయ చైతన్య గడ్డగా పేరున్న ఖమ్మంలో ఈ నెల 18న భారీ బహిరంగ సభ ద్వారా బీఆర్‌ఎస్ శంఖారావం పూరించేందుకు […]
Cold Wave: తెలంగాణలో చలి పులి వణికిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత ఊహించని స్థాయిలో పెరిగింది. ఉష్ణోగ్రతలు అంతకంతకూ తగ్గుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సింగిల్ డిజిట్‌కు పడిపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. రాత్రిపూట, తెల్లవారుఝామున మాత్రమే కాదు.. మధ్యాహ్నం సమయంలోనూ శీతల వాతావరణమే ఉంటోంది. ఒకవైపు పంజాబ్, హర్యానా, చండీగఢ్, దేశ రాజధాని దిల్లీ సహా ఉత్తర భారతదేశం చలితో వణుకుతుండగా.. తెలంగాణలో కూడా అదే స్థాయిలో చలి […]
MLA Mekapati: నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తనను కొడుకుగా ఒప్పుకోవాలంటూ చంద్రశేఖర్ రెడ్డికి మేకపాటి శివచరణ్ రెడ్డి అనే యువకుడు బహిరంగ లేఖ రాయడం.. లేఖతో పాటు పాత ఫొటోలు కూడా శివచరణ్ రెడ్డి సోషల్ మీడియాలో విడుదల చేయడంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి. లేఖపై స్పందించిన చంద్రశేఖర్ రెడ్డి అసలు తనకు కుమారుడే లేడని తనకు ఇద్దరు కూతుళ్లు మాత్రమే […]