Home » news
Khammam Meeting: భాగ్యనగరంలో జాతీయస్థాయి నేతలతో హడావుడిగా మారింది. జాతీయ పార్టీగా మారిన బీఆర్ఎస్ తొలిసారిగా భారీ బహిరంగసభను తలపెట్టింది. ఖమ్మంలో కనీవినీ ఎరుగని స్థాయిలో ఈ సభకు ఏర్పాట్లు జరగగా.. ఈ సభ కోసం నలుగురు ముఖ్యమంత్రులు.. మరికొందరు జాతీయ స్థాయి నేతలు హాజరయ్యారు. సభకు అత్యాధునిక టెక్నాలజీతో భారీ ఏర్పాట్లు చేయగా సభ కోసం వచ్చిన నేతలకు ప్రగతి భవన్ లో ఘనస్వాగతం లభించింది. బహిరంగసభలో పాల్గొనేందుకు ఢిల్లీ, పంజాబ్, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు […]
Kesineni Chinni: ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే ఏపీలో రాజకీయాలు అగ్గి రేజేస్తున్నాయి. ఒకవైపు రానున్న ఎన్నికలలో ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో.. ఎవరు ఎవరితో జత కలుస్తారో ఆసక్తి పుట్టిస్తుండగా.. ఏ పార్టీకి ఆ పార్టీ అంతర్గతంగా రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలకు మరింత ఆసక్తిగా మార్చేస్తున్నాయి. బెజవాడ రాజకీయాలంటేనే సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అన్న సంగతి తెలిసిందే. కాగా.. టీడీపీలో ఈ అంతర్గత రాజకీయాలు కాకరేపుతున్నాయి. టీడీపీ సీనియర్ నేత.. ప్రస్తుత విజయవాడ […]
Sr NTR: రాముడు.. కృష్ణుడు. ఏడుకొండల వెంకన్నా.. పోతులూరి వీరబ్రహ్మన్న.. ఇలా ఏ పాత్ర ఆయన చేస్తే ఆ పాత్రకు నిండుదనం. అంతేకాదు రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన ముఖ్యమంత్రిగా అనితర సాధ్యుడు అనిపించుకున్న మహానటుడు ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 27వ వర్ధంతి నేడు. ఈ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. తెల్లవారుజామునే ఘాట్ వద్దకు చేరుకున్న ఎన్టీఆర్ […]
BRS Party: ఖమ్మంలో భారత రాష్ట్ర సమితి బహిరంగ సభకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ గా మారిన తర్వాత నిర్వహించే తొలిసభ కావడంతో పార్టీ అధిష్టానం ఈ సభ కోసం ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. మంత్రి హరీష్ రావు కొన్ని రోజులుగా ఖమ్మంలోనే మకాం వేసి మరీ సభ ఏర్పాట్లను దగ్గరుండి నిర్వహించారు. సీఎం కేసీఆర్ తో పాటు మరో ఇద్దరు సీఎంలు, జాతీయ పార్టీ అధ్యక్షులు కూడా హాజరయ్యే సభ కావడంతో సభ […]
Pawan-Ali: జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి పరిశ్రమలో ఉన్న అత్యంత సన్నిహితుల్లో అలీ ఒకరు. దశాబ్దాలుగా వీరి ప్రయాణం సాగుతుంది. ఆఫ్ స్క్రీన్ అండ్ ఆన్ స్క్రీన్ లో వీరి స్నేహం కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ ప్రతి సినిమాలో అలీ ఉండాల్సిందే. దర్శకులు కూడా ఆయన సినిమాల్లో అలీకి ప్రత్యేకంగా పాత్రలు రాస్తారు. తొలిప్రేమ, బద్రి, ఖుషి, గబ్బర్ సింగ్ వంటి చిత్రాల్లో పవన్-అలీ కాంబినేషన్ సీన్స్ అదుర్స్ అంతే. సినిమాలతో పాటు నిజజీవితంలో […]
Mukarram Jah: హైదరాబాద్ సంస్థానం ఎనిమిదో నిజాం నవాబ్ మీర్ బర్కత్ ఆలీఖాన్ ముకర్రం ఝా శనివారం అర్ధరాత్రి ఇస్తాంబుల్‌లోని ఆయన నివాసంలో మరణించిన సంగతి తెలిసిందే. పార్థీవ దేహం మంగళవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకుంది. ఇస్తాంబుల్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన భౌతిక కాయాన్ని శంషాబాద్‌కు తీసుకొచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ పాతబస్తీ చౌమహల్లా ప్యాలెస్కు భారీ పోలీసు బలగాల మధ్య రోడ్డు మార్గం ద్వారా నిజాం భౌతిక ఖాయాన్ని తీసుకొచ్చారు. అక్కడ్నుంచి చౌమహల్లా […]
Kesineni Nani: టీడీపీ సీనియర్ నేత.. ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని నానీ ఈ మధ్య కాలంలో హీట్ పుట్టించే కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు సొంత పార్టీపైనే నిప్పులు చెరుగుతున్న కేశినేని.. కొందరి నేతలపై బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. సొంత సోదరుడితో మొదలైన విబేధాలు పార్టీ అధిష్టానాన్ని కూడా లెక్కచేయని విధంగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో సొంత పార్టీ అధిష్టానంపై బహిరంగంగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్న నానీ.. పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు […]
Malakpet Hospital: నగరంలోని మలక్ పేట ప్రభుత్వాసుపత్రిలో దారుణం జరిగింది. నవమాసాలు మోసి తీరా ఆసుపత్రిలో ప్రసవానికి వచ్చేసరికి నిర్లక్ష్యం వారిని కాటేసింది. మలక్ పేట ప్రభుత్వాసుపత్రిలో సిజేరియన్ ఆపరేషన్ జరిగిన తర్వాత ఇద్దరు బాలింతలు మృతి చెందారు. మలక్‌పేట ప్రభుత్వ ఆస్పత్రిలో సిజేరియన్ చేయించుకున్న తర్వాత ఆరోగ్యం విషమించడంతో నాగర్‌కర్నూల్ జిల్లా వెల్లండ మండలం చెదుమపల్లికి చెందిన సిరివెన్నెల(23), హైదరాబాద్ పూసలబస్తీకి చెందిన శివాని(24) గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు 12వ తేదీన, మరొకరు […]
Bandi Sai Bageerath: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమారుడిపై కేసు నమోదయింది. బండి సాయి భగీరథ్ ఓ విద్యార్థిని చితకబాదినట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటనలో విద్యార్థికి తీవ్ర గాయాలవగా దుండిగల్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. నగరంలోని మహీంద్రా యూనివర్సిటీలో చదువుతున్న బండి సంజయ్ కొడుకు సాయి భగీరథ్ ర్యాగింగ్ పేరుతో విద్యార్థిని తీవ్రంగా కొట్టి గాయపడిచాడని వార్తలొస్తున్నాయి. ఈ మేరకు ఓ […]
AP Govt: ఏపీలో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1 మంటలు కొనసాగుతున్నాయి. నెల్లూరు జిల్లా కందుకూరు.. గుంటూరులో టీడీపీ తలపెట్టిన కార్యక్రమాలలో 11 మంది కార్యకర్తలు మృతి చెందడంతో ఏపీ ప్రభుత్వం సభలు, ర్యాలీలపై ఆంక్షలు విధిస్తూ జీవో 1 తీసుకొచ్చింది. 1861 పోలీస్ యాక్ట్‌లోని సెక్షన్ 30 ప్రకారం.. రోడ్లపై ప్రదర్శనలు, కార్యక్రమాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. టీడీపీతో పాటు జనసేన, కమ్యూనిస్టులు జీవోను తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసనలు తెలిపారు. ఆ తర్వాత టీడీపీ […]