Home » news
Lulonga River: మొత్తం 200 మంది ప్రయాణీకులతో కూడిన పడవ పొరుగున ఉన్న రిపబ్లిక్ ఆఫ్ కాంగోకు వెళుతుండగా లులోంగా నదిలో మునిగిపోయింది. 145 మంది ఆచూకీ తెలియకపోగా ఇప్పుడు చనిపోయినట్లు భావిస్తున్నారు. అందులో 55 మంది విపత్తు నుండి బయటపడ్డారని అధికారులు తెలిపగా మిగతా వాళ్ళు చనిపోయినట్లు చెప్తున్నారు. వాయువ్య డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో [DRC]లోని ఒక నదిపై రాత్రిపూట సరుకులు, జంతువులతో ఓవర్‌లోడ్ చేయబడిన మోటరైజ్డ్ పడవ మునిగిపోవడంతో కనీసం 145 మంది […]
AP Govt: ఏపీలో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1 రగడ కొనసాగుతూనే ఉంది. నెల్లూరు జిల్లా కందుకూరు.. గుంటూరులో టీడీపీ తలపెట్టిన కార్యక్రమాలలో 11 మంది కార్యకర్తలు మృతి చెందడంతో ఏపీ ప్రభుత్వం సభలు, ర్యాలీలపై ఆంక్షలు విధిస్తూ జీవో 1 తీసుకొచ్చింది. 1861 పోలీస్ యాక్ట్‌లోని సెక్షన్ 30 ప్రకారం.. రోడ్లపై ప్రదర్శనలు, కార్యక్రమాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. టీడీపీతో పాటు జనసేన, కమ్యూనిస్టులు జీవోను తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసనలు తెలిపారు. ఆ తర్వాత […]
Raja Singh: హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పోలీసులు మరోసారి నోటీసులు జారీచేశారు. తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు, వివాద అంశాలలో జోక్యం చేసుకొనే రాజాసింగ్ కు 41ఏ సీఆర్పీసీ కింద మంగళ్‌హాట్ పోలీసులు నోటీసులు అందించారు. ఎమ్మెల్యే అజ్మీర్ దర్గాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని.. గతేడాది ఆగస్టులో కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌లో రాజాసింగ్‌పై కేసు నమోదు అయింది. ఈ కేసు కంచన్‌బాగ్ నుంచి మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్‌కు పోలీసులు బదిలీ అయింది. ఈ నేపథ్యంలోనే మంగళ్‌హాట్ పోలీసులు ఆయనకు తాజాగా […]
Minister Puvvada: ఖమ్మం సభతో గులాబీ బాస్ జాతీయ రాజకీయాలకి సమర శంఖారావం ఊదేశారు. ఆయనతో పాటు మరో ముగ్గురు ముఖ్యమంత్రులను, జాతీయ స్థాయి నేతలను సభకి రప్పించి ఇదీ మా స్థాయి అంటూ ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. ఖమ్మం సభ నుండే ప్రధాన ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను మాటల దాడి చేసి ఏకిపారేశారు. ఉచిత కరెంట్ ఇచ్చాం.. వ్యవసాయానికి పెద్దపీట వేశాం.. మా సంక్షేమం దేశంలోనే మరెక్కడా లేదని నొక్కి వక్కాణించారు. కనీవినీ ఎరుగని […]
Cheddi Gang: తెలంగాణ రాష్ట్రంలో చెడ్డీ గ్యాంగ్ మళ్లీ హల్‌చల్ చేసింది. మహబూబ్ నగర్ జిల్లాలో భారీ చోరీకి పాల్పడ్డారు దుండగులు. జిల్లా కేంద్రంలో వరస చోరీలతో చెడ్డి గ్యాంగ్ భయాందోళనకు గురిచేశారు. స్థానిక బృందావన్ కాలనీలో వరుస దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలను హడలెత్తిస్తున్నారు. గతంలో అదే కాలనీలో చెడీ గ్యాంగ్ చోరీకి ప్రయత్నించి విఫలమై వెనుతిరిగగా.. నాలుగు రోజుల క్రితం ఓ ఇంట్లో భారీగా నగదు, బంగారం దోపిడీ చేశారు. చెడ్డీ గ్యాంగ్ అంటేనే చోరీలతో […]
Kadapa Accident: కడప జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలోని చాపాడు మండలం వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని టెంపో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. భారీ శబ్దంతో జరిగిన ఈ ప్రమాదంతో హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చిన స్థానికులు క్షతగాత్రులను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ప్రొద్దుటూరు వైఎమ్మార్ కాలనికి చెందిన 15 మంది కుటుంబ సభ్యులు […]
Deccan Complex: డెక్కన్ మాల్‌లో మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. భవనం కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. భవనం దగ్గరికి అధికారులు ఎవరినీ అనుమతించడం లేదు. నేడు కాలిన భవనాన్ని జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు పరిశీలించనున్నారు. భవనంలోని గోడౌన్‌కు పర్మిషన్ లేదని జీహెచ్ఎంసీ చెబుతోంది. సెల్లార్‌లో చిక్కుకున్న వారిపై ఇంకా స్పష్టత రాలేదు. పరిసర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సికింద్రాబాద్ పరిధిలోని రాంగోపాల్‌పేట డెక్కన్ స్టోర్‌లో చెలరేగిన మంటలు […]
Vijayawada Politics: బెజవాడ రాజకీయాలలో కీలక మార్పులు జరగనున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఒకపక్క కేశినేని బ్రదర్స్ ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలకు దిగుతుంటే మైలవరం నుండి ఊహించని రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి. మైలవరం నుండి వయా జగ్గయ్యపేట మీదగా విజయవాడ వరకు తెలుగు దేశం పార్టీలో రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. మిగతా రాష్ట్రం మొత్తం ఇంకా సమయం ఉంది కదా అని వేచి చూసే ధోరణిలో కనిపిస్తున్నా.. కృష్ణాజిల్లాలో మాత్రం రాజకీయం ఓ రేంజిలో […]
Byreddy Siddharth: వైఎస్ జగన్ కు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో అభిమానులు ఉన్నారు, ఆయన కనుక మళ్ళీ తెలంగాణలో వేలు పెడితే తెలంగాణ రాజకీయాల సీన్ మారిపోతుంది. ఈ మాటలు అన్నది ఎవరో కాదు. ఏపీలో వైసీపీలో యూత్ ఫాలోయింగ్ ఉన్న నేత బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి. ఆ మాటకొస్తే ఇప్పుడే కాదు.. గత కొన్నాళ్ళుగా సిద్దార్థ్ ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. నిజానికి ఏపీ రాజకీయాల్లో అందునా రాయలసీమలో మంచి భవిష్యత్ ఉన్న యువ నేత […]
AP Govt: ఒకప్పుడు ఏపీ రాజకీయాలలో అధికార, ప్రతిపక్షాల మధ్య పాలనా యుద్ధం తలపించేది. కానీ, ఎందుకో ఈ మధ్య కాలంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యక్షంగా ప్రభుత్వ నిర్ణయాలపై యుద్ధం తగ్గించారు. మాటల దాడి చేస్తున్నారు కానీ ప్రభుత్వ నిర్ణయాలు తప్పని నిరూపించే ప్రయత్నం మాత్రం తగ్గించారు. అయితే.. ఆ లోటును మిగతా ప్రతిపక్షాలు, కమ్యూనిస్ట్ పార్టీలు.. కోర్టులు తీరుస్తున్నాయి. మొన్నటికి మొన్న ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపైన కమ్యూనిస్ట్ పార్టీలు హైకోర్టుకు వెళ్తే జీవోను […]