Home » news
Hyderabad: ముంబైతో పాటు ఉత్తరాదిన మరికొన్ని నగరాలలో డబ్బావాలా అనే ఓకే కల్చర్ ఉంటుంది. ఇందులో చిన్నా చితకా ఉద్యోగాలు చేసుకొనే వారు.. కొన్ని కొన్ని పనులకు వెళ్లిన వారు నగరంలో ఎక్కడ ఉన్నా.. వాళ్ళ ఇంటి నుండే డబ్బావాలాలు వాళ్ళు ఉన్న చోటుకి లంచ్ బాక్సులు ఇస్తారు. లోకల్ ట్రైన్, బస్సు, రిక్షా ఇలా రకరకాల వాహనాలు, బుట్టలలో డబ్బావాలాలు ఈ తరహా లంచ్ బాక్సులను అందిస్తుంటారు. వాళ్ళు వచ్చే సమయానికి ఇంట్లో లంచ్ బాక్స్ […]
Ayyanna Patrudu: కాస్త వయసు మీదపడినా టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడంటే ఇప్పటికీ ఫైర్ బ్రాండే. ఎప్పటికప్పుడు రాష్ట్ర రాజకీయాలపై సోషల్ మీడియాలో సెటైర్లతోనే ఏకిపారేసే అయ్యన్న సొంత పార్టీ నేతలపై కూడా అప్పుడప్పుడు ఘాటు విమర్శలకు దిగుతుంటారు. ఇప్పుడు కూడా అలాగే టీడీపీ ఎమ్మెల్యే, ఉత్తరాంధ్ర కీలక నేత గంటా శ్రీనివాసరావుపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏకంగా ఎవడండీ గంటా.. ఏమైనా పెద్ద నాయకుడా అంటూ అయ్యన్న రెచ్చిపోయారు. ఓ పార్టీ కార్యక్రమంలో […]
Krishna District: ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఓ అంశం ఎప్పటికప్పుడు హీట్ పుట్టిస్తుంది. అదేమిటంటే ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం ఎన్టీ రామారావు. ఎన్టీఆర్ కు వారసుడు చంద్రబాబు కానేకాదని.. తామే అసలైన వారసులమని కొడాలి నానీ లాంటి వాళ్ళు అప్పుడప్పుడు హీట్ పుట్టించే కామెంట్స్ చేసే సంగతి తెలిసిందే. ఇక.. ఎన్టీఆర్ కుటుంబం ఎంత కాదన్నా ఎన్టీఆర్ కు రెండో భార్య లక్ష్మి పార్వతి కూడా ఇప్పుడు వైసీపీలోనే ఉన్న సంగతి తెలిసిందే. […]
Minister Ambati: ప్రతిపక్షాలను మాటలతోనే దుమ్ముదులిపేసే మంత్రిగా పేరున్న ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసు కేసు నమోదైంది. అది కూడా ఏపీలో నిషేధించబడిన లాటరీలను నిర్వహించారని.. మోసం చేసి లాటరీ టికెట్లను అమ్మేశారని ఈ కేసు నమోదు కావడం గమనార్హం. మంత్రి అంబటి రాంబాబు ఫోటోతో ముద్రించిన లక్కీ లాటరీ టికెట్లను సత్తెనపల్లి నియోజకవర్గంలో కొందరు అమ్ముతున్నారని జనసేన పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, వంద రూపాయలు కట్టి లక్కీ లాటరీలో […]
Ganta Srinivasa Rao: టీడీపీ ఉత్తరాంధ్ర సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీ మారనున్నాడా? అంటే నిన్నటి వరకు రాజకీయ వర్గాలు ముక్త కంఠంతో అవుననే సమాధానాలు ఇచ్చాయి. గత ఏడాదికి పైగా గంటా మౌనం.. ఉత్తరాంద్ర వైసీపీ నేతలంతా టీడీపీ నేతలపై మాటల దాడికి దిగినా గంటా మాత్రం మౌనమే సమాధానంగా ఉంటూ వచ్చారు. ఈక్రమంలోనే గంటా వైసీపీలో చేరనున్నారని కొన్నాళ్ళు.. కాదు కాదు బీజేపీలో చేరనున్నారని మరికొన్నాళ్లు ప్రచారం జరిగింది. ఈ మధ్యనే […]
Khammam: 2024 ఎన్నికల తర్వాత మోడీ ఇంటికి.. మేము ఢిల్లీకి అని.. సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలో మాట్లాడిన సీఎం.. కాంగ్రెస్, బీజేపీలపై ఫైర్ అయ్యారు. ‘దేశంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఒకటే ఒక మాట నా మనసును కలచివేస్తోంది. రాజకీయాల్లో ఎందరో గెలుస్తారు ఒడతారు. ఇవాళ మన దేశం లక్ష్యం ఏంటీ.. భారత్ తన లక్ష్యాన్ని కోల్పోయింది. బిత్తరపోయి గత్తర పడుతోంది. ఇది నా […]
Khammam: జాతీయ పార్టీగా అవతరించిన బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కేరళ సీఎం విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజాతో పాటు పలువురు జాతీయ నేతలు ఈ సభకు హాజరయ్యారు. ఈ సభలో మాట్లాడిన కేరళ సీఎం పినరయి విజయన్.. ప్రజాస్వామ్యానికి బీజేపీ […]
SDSC: పూర్వపు నెల్లూరు జిల్లాలోని ప్రస్తుత తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది. మొన్న ఇద్దరు సీఐఎస్ఎఫ్ సిబ్బంది 24 గంటలలోనే ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపగా.. మొన్న చనిపోయిన ఎస్సై భార్య.. భర్త మృతదేహాన్ని చూసేందుకు వచ్చి ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. అంతకు ముందే ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోగా.. ఆ తర్వాత రోజే ఎస్సై.. ఇప్పుడు ఎస్సై భార్య బలవన్మరణంతో స్పేస్ సెంటర్ లో విషాద […]
Assembly Elections 2023: ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (CEC) బుధవారం ప్రకటించింది. త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 16న జరుగుతాయని, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 27న జరుగుతాయని సీఈసీ ప్రకటించింది. మూడు రాష్ట్రాలలో ఓట్ల లెక్కింంపు మార్చి 2న జరుగుతుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఈ మూడు రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉందని సీఈసీ […]
AP High Court: ఏపీలో ఇద్దరు ప్రభుత్వ అధికారులకు జైలు శిక్ష విధిస్తూ హైకర్టు సంచలన తీర్పు వెలువరించింది. గతంలో కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయనందుకు హైకోర్టు ఈ శిక్ష విధిస్తున్నట్టుగా తెలిపింది. ఐఏఎస్ అధికారి, ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న బుడితి రాజశేఖర్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీగా బాధ్యతలు నిర్వహిస్తున్న రామకృష్ణలకు కోర్టు నెల రోజుల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు రూ.2 వేల చొప్పున జరిమానా కట్టాలని ఆదేశించింది. […]