Home » news
Srisailam: గత ఆరు నెలలుగా శ్రీశైలం మల్లన్న దేవస్థానంపై విమర్శల జడివాన కురుస్తుంది. ట్రస్ట్ బోర్డు సభ్యులు రెండు వర్గాలు విడిపోయి.. ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడంతో అవినీతి, అక్రమాలు బయటపడుతున్నాయి. ఈ మధ్య కాలంలో ట్రస్ట్ బోర్డు లెటర్ ప్యాడ్ లు, బోర్డు సభ్యుల రెకమెండేషన్లతో కొందరు టికెట్లు లేకుండానే మల్లన్న దర్శనాలకు వెళుతున్నట్లు భారీ విమర్శలు వినిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న లడ్డూల తయారీ ముడి సరుకుల కొనుగోలులో అక్రమాలు జరిగాయని సాక్షాత్తు చైర్మన్ రెడ్డివారి […]
AP Budget Sessions: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు కసరత్తు చేస్తోంది జగన్ సర్కార్. ఫిబ్రవరి నెలలో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలలో విస్తృత ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు ఫిబ్రవరి చివరి వారం నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. మొత్తం సుమారు 22 పని దినాలు ఉండేలా సమావేశాల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఫిబ్రవరిలో అసెంబ్లీలో సమావేశాలు కుదరకపోతే కనుక మార్చి 3, 4న […]
Telangana Budget 2023: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి తొలివారంలో 3 లేదా 5 తేదీలలో బడ్జెట్ ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఫిబ్రవరి తొలి వారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభించనున్నట్టు రాష్ట్ర రాజకీయ వర్గాలలో విస్తృత ప్రచారం జరుగుతుంది. ఆర్థిక మంత్రి హరీష్ రావు 2023-24 రాష్ట్ర తాత్కాలిక బడ్జెట్‌ను ఫిబ్రవరి 3 లేదా 5వ తేదీల్లో సమర్పించనున్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్‌పై శనివారం ప్రగతి భవన్‌లో జరగనున్న అత్యున్నత స్థాయి […]
Chaganti Koteswara Rao: ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలకపదవిని అప్పగించింది. టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావును నియమిస్తూ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో శుక్రవారం హెచ్‌డీపీపీ, ఎస్వీబీసీ కార్యనిర్వాహక కమిటీ సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ మాట్లాడుతూ… టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా ప్రముఖ […]
TS Congress: గాంధీభవన్లో శుక్రవారం సాయంత్రం ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్ ఠాక్రే ‘హాథ్ సే హాథ్’ కార్యక్రమంపై పార్టీ నేతలతో చర్చించేందుకు శుక్రవారం గాంధీ భవన్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఠాక్రేను కలిసేందుకు వచ్చిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి .. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. కాసేపు వీరిద్దరూ చర్చించుకోవడం కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి రేపింది. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత ఆయన […]
Khammam Accident: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. పెళ్ళికి ముందు నిర్వహించే ఫ్రీ వెడ్డింగ్ షూట్ కోసం అని ఇంటి నుండి వెళ్లిన నలుగురు అనంతలోకాలకు వెళ్లిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపుతుంది. కారు-లారీ ఢీకొన్న ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇల్లెందు- మహబూబాబాద్ మధ్య కోటిలింగాల సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. గాయపడిన మరో ఇద్దరిని ఇల్లెందు ప్రభుత్వ వైద్యశాలకు […]
Mutyala Naidu: 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టి గ్రామ గ్రామాన.. ఊరూ వాడా తిరిగి మరీ చెప్పారు.. తాము అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేస్తామని. అందుకు అనుగుణంగా అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే అడుగు ముందుకు పడింది. మొత్తం మద్యం షాపులను అండర్ టేక్ చేసుకున్న ప్రభుత్వం పొరుగున ఏ రాష్ట్రంలో లేనంతగా ఏపీలో మద్యం రేట్లు పెంచారు. దీంతో పొరుగు రాష్ట్రాల నుండి విపరీతంగా అక్రమ మద్యం […]
Raghunandan Rao: తెలంగాణ బీజేపీ మరో కొత్త అంశంతో ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. మొన్నటి వరకు తెలంగాణ సీఎస్ గా పనిచేసిన సోమేశ్ కుమార్ ను కొన్నిరోజుల కిందట ఏపీ క్యాడర్ కు పంపించేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇదే తరహాలో కొందరు ఉన్నతాధికారులు సొంత క్యాడర్ లో కాకుండా, తెలంగాణలో కొనసాగుతున్నారని.. వారందరినీ తిరిగి ఏపీకి పంపించాలని బీజేపీ అటాక్ మొదలు పెట్టింది. ఈ అంశంపై రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన ఎమ్మెల్యే రఘునందన్ రావు.. […]
Punjab: లక్ అనే పదం అప్పుడప్పుడూ మనం వింటూ ఉంటాం. అయితే.. ఆ పదానికే డెఫినిషన్ అనిపించాడు ఓ వృద్ధుడు. 35 ఏళ్లకు పైగా లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేసిన 88 ఏళ్ల వృద్ధుడి అదృష్టం తిరిగి పంజాబ్‌లో లాటరీలో రూ.5 కోట్లు గెలుచుకున్నాడు. పంజాబ్‌కు చెందిన దేరాబస్సీకి చెందిన మహంత్ ద్వారకా దాస్ గత 35-40 సంవత్సరాలుగా లాటరీలు కొనుగోలు చేస్తూ చివరకు లాటరీలో గెలిచాడు. లోహ్రీ మకర సంక్రాంతి బంపర్ లాటరీ 2023లో మహంత్ […]
Nellore Politics: వైసీపీ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా కీలక నేత ఆనం రాంనారాయణ రెడ్డి కొద్ది రోజులుగా వైసీపీ అధిష్టానంపై కీలక వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. బహిరంగ సభలపైనే సీఎం జగన్ మోహన్ రెడ్డితో పాటు వైసీపీ పార్టీపై విమర్శలు చేస్తూ కౌంటర్లు వేస్తున్నారు. ఆనం ఎక్కడకి వెళ్లినా ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. కొన్నాళ్ల పాటు వేచి చూసిన పార్టీ పెద్దలు ఇక లాభం లేదని చర్యలకు కూడా […]