Home » news
District YSR: గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న అభం శుభం తెలియని ఓ 14 ఏళ్ల బాలిక మగ బిడ్డకి జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ, బిడ్డ ఆరోగ్యం నిలకడగానే ఉండగా.. మెరుగైన చికిత్స కోసం ఇద్దరినీ జిల్లా ఆసుపత్రికి తరలించారు. గురుకుల ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న బాలిక ప్రసవించడం స్థానికంగా కలకలం రేపింది. వైఎస్ఆర్ జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. వైఎస్ఆర్ జిల్లా వాల్మీకిపురంలో ఉన్న గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఒక […]
AP Govt: ఏపీలో ఉద్యోగుల జీతాల చెల్లింపు ఆలస్యంపై రగడ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షన్‌దారులకు ప్రభుత్వం జీతాలు సకాలంలో ఇవ్వాలని, ఈ మేరకు చట్టం తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ ఉద్యోగ సంఘం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి విన్నవించుకున్నారు. ఎన్ని సార్లు అడిగినా ప్రభుత్వం ఇవ్వడం లేదని ఉద్యోగ నేతలు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే పేరుకుపోయిన కోట్లాది రూపాయల బకాయిలు, పెన్షన్ల చెల్లింపుకు గవర్నర్ జోక్యం చేసుకోవాలని, లేకపోతే […]
Murder Case: వివాహేతర సంబంధాలు పచ్చని కుటుంబాల్లో చిచ్చురేపుతున్నాయి. క్షణిక సుఖం మోజులో పడి కట్టుకున్న వారిని మట్టుబెట్టే వారు కొందరైతే.. తమ కాపురంలో చిచ్చుపెట్టిన వారిని కిరాతకం హతమార్చి జైలు పాలయ్యే వారు మరికొందరు. ఎవరు ఎలాంటి దారుణానికి పాల్పడినా శిక్ష మాత్రం పిల్లలకే. తల్లి దండ్రులు ఇలా చనిపోవడం.. జైలు పాలు కావడంతో ఆ పిల్లలు అనాధలవుతున్నారు. అలా వివాహేతర సంబంధం కారణంగా మరో ప్రాణం బలవగా.. మరో భర్త నేరస్తుడయ్యాడు. భార్య ప్రియుడిని […]
Hit by Train: ఏపీలోని నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రైల్వే బ్రిడ్జిపై రైలు ఢీకొని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాద ఘటన శనివారం రాత్రి జరిగింది. నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద నున్న రైల్వే బ్రిడ్జిపై ఇద్దరు పురుషులు, ఒక మహిళ వస్తుండగా- గూడూరు వైపు నుంచి విజయవాడ వెళుతున్న నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పురుషులు, ఓ మహిళ మృతి చెందింది. సమాచారం అందుకున్న రైల్వే […]
TDP: తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు సర్వం సిద్ధమైంది.. ‘యువగళం’ పేరుతో ఈ యాత్ర నిర్వహించనున్నారు. ఈ యాత్రని టీడీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసులోగా.. దీనికి సంబంధించి భారీ యాక్షన్ ప్లాన్.. రూట్ మ్యాప్ కూడా రెడీ చేశారు. అయితే ఈ పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ టీడీపీ జనవరి 12న డీజీపీతో పాటు మిగతా ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. డీజీపీ, హోంసెక్రటరీ, చిత్తూరు ఎస్పీ, పలమనేరు, పూతలపట్టు డీఎస్పీలకు […]
TCongress: తెలంగాణలో ఫిబ్రవరి 6 నుంచి హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభమవుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఫిబ్రవరి 6 నుంచి మొదలయ్యే పాదయాత్ర 60 రోజులపాటు సాగుతుంది. భద్రాచలం లేదా మహబూబ్ నగర్ లేదా ఆదిలాబాద్ ప్రాంతాల నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమయ్యే అవకాశం ఉంది. భారత్ జోడో యాత్ర సందేశాన్ని ప్రతీ గుండెకు చేరవేయడానికే హాత్ సే హాత్ జోడో యాత్ర మొదలు పెట్టనున్నట్లు రేవంత్ చెప్పారు. వాస్తవానికి జనవరి […]
India vs New zealand ODI Series: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ శనివారం రాయ్‌పుర్‌లో జరిగింది. ఈ వన్డేలో టీమిండియా కివీస్‌ను చిత్తుచేసింది. ఫలితంగా ఎనిమిది వికెట్ల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. భారత్ బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో కివీస్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. కివీస్ బ్యాటర్ ఏ ఒక్కరూ క్రిజ్‌లో కుదురుకోకుండా వరుస వికెట్లు తీయడంతో 108 పరుగులకే కివీస్ […]
Vundavalli Aruna Kumar: ఉండవల్లి అరుణ్ కుమార్.. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా.. ఇప్పటి రాజకీయాలపై విశ్లేషణలు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసే నేత. ఉండవల్లి మీడియా ముందుకొస్తే ఇప్పటి రాజకీయాలపై ఆయన విశ్లేషణ ఎలా ఉంటుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. వాళ్ళ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఆయన కూడా ఓ రేంజిలో మీడియాకి, ప్రజలకు మాట్లాడుకునేందుకు స్టఫ్ ఇచ్చేసి వెళ్తుంటారు. ఎప్పటిలాగానే మరోసారి ఉండవల్లి ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలలో […]
Vande Bharat Express: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రానే వచ్చింది.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చక్కర్లు కొడుతోంది. విమానాన్ని తలపించేలా సౌకర్యాలున్న రైలు కావడంతో కాస్త ధర ఎక్కువే అయినా ప్రయాణికులు కూడా ఈ రైల్లో ప్రయాణానికి ఆసక్తి చూపిస్తున్నారు. సికింద్రాబాద్- విశాఖపట్నం.. విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య నడిచే ఈ సెమీ హైస్పీడ్ రైలుకు ఇప్పుడు ఫుల్ డిమాండ్ కూడా వచ్చింది. వందే భారత్ […]
Gudivada Amarnath: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయి ఎనిమిదేళ్ళయినా ఇప్పటికీ ఏపీకి రాజధాని అంశం పెద్ద రగడగానే ఉన్న సంగతి తెలిసిందే. గత ఐదేళ్లు టీడీపీ ప్రభుత్వంలో అమరావతి రాజధానిగా నిర్ణయించి తాత్కాలిక భవనాలను నిర్మించి పరిపాలన మొదలుపెట్టగా.. ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం అమరావతి ఒక్కటే కాదు.. మూడు రాజధానులు కావాలని అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చారు. అయితే.. దీనిపై నేటికీ న్యాయ స్పష్టత లేదు. అప్పటి ప్రభుత్వం అమరావతి రైతులతో చేసుకున్న ఒప్పందాలు.. అప్పటి ప్రభుత్వం ఇచ్చిన […]