Home » news
Naba Kisore Das: ఒడిశాలోని బ్రిజరాజ్ నగర్ లో ఆదివారం ఉదయం ఏఎస్సై జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి నవకిశోర్ దాస్ కన్నుమూశారు. కాల్పుల్లో ఆయన ఛాతి భాగంలోకి తూటా దూసుకెళ్లడంతో చికిత్సపొందుతూ మంత్రి ప్రాణాలు విడిచినట్టు అపోలో ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.నిజానికి ఆస్పత్రికి తీసుకురాగానే డాక్టర్ దేబాశిస్ నాయక్ నేతృత్వంలోని వైద్యుల బృందం హుటాహుటిన ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించింది. అయితే, ఆయన శరీరంలోకి దూసుకెళ్లిన ఓ బుల్లెట్ గుండె, ఎడమ […]
IND vs NZ 2nd T20 Match : ఉత్కంఠభరితంగా సాగిన పోరులో టీమిండియా విజయం సాధించింది. న్యూజిలాండ్ జట్టు నిర్దేశించిన 100 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు చివరి ఓవర్ వరకు టీమిండియా బ్యాట్స్‌మెన్ శ్రమించారు. చివరి ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ ఫోర్ కొట్టడంతో భారత్ జట్టు కివీస్‌పై 6 వికెట్లు తేడాతో విజయం సాధించింది. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండో టీ20 మ్యాచ్ ఆదివారం లక్నోలో […]
AP CM Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హస్తిన బాట పట్టనున్నారు. రేపు ఎల్లుండి అనగా సోమ, మంగళ వారాలు రెండు రోజులపాటు సీఎం జగన్ ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈనెల 30, 31 తేదీల్లో ఆయన ఢిల్లీలో పర్యటించనుండగా.. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు సీఎం జగన్ ఢిల్లీ బయలుదేరనున్నారు. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకి తాడేపల్లి నివాసం నుంచి ఆయన బయలుదేరి 6.45 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. వన్ జన్పథ్ నివాసంలో రాత్రికి […]
Ambati Rambabu: ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఒకవైపు టీడీపీ నుండి నారా లోకేష్ పాదయాత్ర మొదలు పెట్టి అధికార పార్టీని ఎండగడుతుంటే.. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం నుండి మంత్రుల వరకు అందరినీ తూర్పారా పట్టేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల ఆరోపణలను మంత్రులు, ఎమ్మెల్యేలు తిప్పికొట్టే పనిలో ఉన్నారు. మొత్తంగా మాటకి మాట అన్నట్లు రాజకీయం రసకందాయంగా సాగుతుంది. నారా లోకేశ్ పాదయాత్రలో చేసిన వ్యమర్శలపై […]
Naba Kisore Das: ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి నవ కిషోర్ దాస్ పై ఓ పోలీస్ అధికారి కాల్పులు జరపడం సంచలనంగా మారింది. ఆదివారం ఉదయం ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో మంత్రి ఛాతీకి బుల్లెట్ గాయాలు కాగా.. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఒడిశాలోని ఝార్సుగూడా జిల్లా బజరంగ్ టౌన్ లో ఓ మీటింగ్ కి హాజరయ్యేందుకు కిశోర్ దాస్ వెళ్తుండగా ఈ కాల్పులు జరిపారు. గోపాల్ దాస్ అనే అసిస్టెంట్ […]
BRS-BJP: తెలంగాణలో ఎన్నికల వేడి ఎప్పుడో మొదలైంది. ఒకపక్క సీఎం కేసీఆర్ తన టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా జాతీయ స్థాయిలో రాజకీయాలు మొదలు పెట్టి పార్టీ విస్తరణలో పనిలో ఉండగా.. బీజేపీ ఎలాగైనా తెలంగాణలో అధికార పీఠాన్ని దక్కించుకోవాలని పావులు కదుపుతుంది. షాడో సీఎంగా పేరున్న మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు బీజేపీకి కౌంటర్లు ఇస్తూ రాజకీయ వేడి పెంచేస్తున్నారు. దమ్ముంటే పార్లమెంట్ రద్దు చేసి రండి.. మేం అసెంబ్లీ రద్దు చేస్తాం.. ముందస్తు ఎన్నికలకు అందరం […]
Jr NTR-Tarakaratna: నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితులపై అందరిలోనూ ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. ఆయన హెల్త్ కండీషన్ సీరియస్ గా ఉందని తెలియడంతో నందమూరి కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా బెంగళూరు నారాయణ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఇప్పటికే ఇటు నారా-నందమూరి కుటుంబ సభ్యులు బెంగళూరు చేరుకోగా.. తాజాగా కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్, ఆయన భార్య లక్ష్మీప్రణతి కూడా బెంగళూరు వచ్చారు. వీరితో పాటు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ కూడా ఆస్పత్రికి చేరుకుని తారకరత్న […]
Kotamreddy Sridhar Reddy: ఏపీలో ఇంకా ఎన్నికలకు ఒకటిన్నర ఏడాది ఉండగానే ఇప్పటికే ఇక్కడ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ఏ పార్టీకి ఆ పార్టీలో అంతర్గత పోరు కూడా తారాస్థాయికి చేరుకుంటుంది. ముఖ్యంగా అధికార వైసీపీ వర్గ పోరులో నేతల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. కొందరు ఏకంగా అధిష్టానంపైనే తీవ్ర వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో అయితే పరిస్థితి మరింత దారుణంగా మారింది. గత ఎన్నికల్లో […]
Bachula Arjundu: టీడీపీకి మరో కష్టం ఎదురైంది. ఇప్పటికే నందమూరి కుటుంబసభ్యుడు, టీడీపీ యువనేత తారకరత్న గుండెపోటుతో బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న సంగతి తెలిసిందే. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న ఉన్నట్లుండి కుప్పగూలిపోవడంతో మొదట కుప్పం ఆసుపత్రికి అక్కడ నుండి బెంగళూరు హృదయాలయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అదలా ఉండాగానే టీడీపీ మరో సీనియర్ నేత బచ్చుల అర్జునిడి గుండెపోటుకు గురయ్యారు. ఆదివారం తెల్లవారుజామున ఆయనకు హార్ట్ ఎటాక్ వచ్చినట్లు […]
BRS Party: బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన నేడు ప్రగతిభవన్‌లో బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం జరగనుంది. ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు ప్రగతిభవన్‌లో ఈ పార్లమెంటరీ సమావేశం జరుగనున్నది. ఈ నెల 31 నుంచి ప్రారంభమయ్యే కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో పార్టీ అనుసరించే వ్యూహంపై సీఎం కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రానికి సంబంధించి పార్లమెంట్‌లో చర్చింబోయే అంశాలు, బడ్జెట్‌లో కేటాయింపులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేంద్రం నెరవేర్చని విభజన హామీలు […]