Home » news
CM Jagan: సీఎం జగన్ నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ మంగళవారం ఢిల్లీలో ఏపీ గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్స్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనాల్సి ఉంది. ఈ సమావేశానికి పలువురు దౌత్యవేత్తలు హాజరవుతుండగా.. ఏపీ ప్రభుత్వం తరఫున సీఎం జగన్ తో పాటు ఉన్నతాధికారులు కూడా ఆ సమావేశంలో పాల్గొంటున్నారు. ఇందుకోసం ఆయన ఈ సాయంత్రం గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అయితే ఆయన ఎక్కిన ప్రత్యేక విమానం […]
CM Jagan: రాష్ట్రంలో తోడేళ్ళన్నీ ఒక్కటి అవుతున్నాయని.. మీ బిడ్డకి ఎలాంటి పొత్తులు ఉండవని.. సింహం సింగిల్ గానే పోరాడుతుందని సీఎం జగన్ సినిమా స్టైల్ లో డైలాగ్స్ చెప్పారు. పల్నాడు జిల్లా వినుకొండలో పర్యటించిన సీఎం.. జగనన్న చేదోడు కార్యక్రమంలో భాగంగా బటన్ నొక్కి లబ్ధిదారులకు నిధులను పంపిణీ చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 3,30,145 మందికి రూ 330.15 కోట్ల ఆర్దిక సాయం అందనుంది. దీని ద్వారా ఒక్కో లబ్ది దారుడుకు రూ.10 […]
Suicide Attempt: ప్రగతిభవన్ ముందు ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం కలకలం సృష్టించింది. కుటుంబం అంతా ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా.. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. తన భూమిని తీసుకున్న ప్రభుత్వం పరిహారం చెల్లించలేదని.. ఉన్న భూమి పోయి బతుకుదెరువు లేక ఇబ్బందులు పడుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్యాయత్నం చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీం పట్నానికి చెందిన ఐలేష్ అనే వ్యక్తి భార్యతో సహా ప్రగతి భవన్ […]
Weather Update: ఒకవైపు చలి తీవ్రత ఎక్కువవుతుండగా మరోవైపు వాయుగుండం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం.. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ సోమవారం వాయుగుండంగా బలపడనుంది. శ్రీలంకకు సమీపంలో హిందూ మహాసముద్రానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి ఆదివారం నాటికి తీవ్ర అల్పపీడనంగా మారింది. సోమవారం నాటికి ఇది వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత […]
Visakha Ukku Praja Garjana: విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో భాగంగా సోమవారం ఉక్కు నగరంలో ప్రజా గర్జన సభ నిర్వహిస్తున్నారు. కేంద్రం నవరత్నాల లాంటి ప్రభుత్వరంగ సంస్థలను కారు చౌకగా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు, దేశవ్యాప్తంగా ఉన్న అనేక ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకంలో భాగంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తుందని ఆరోపిస్తూ ఈ విశాఖ ఉక్కు గర్జన సాగనుంది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని […]
Telangana: తెలంగాణ రాజకీయాలలో రెండు రాజ్యాంగపరమైన అంశాలలో ఒకరకంగా యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై మధ్య అగాధం కాస్త ఇప్పుడు రాజ్యాంగపరమైన వివాదంగా మారింది. చిన్న చిన్న అసంతృప్తులతో మొదలైన ఈ వివాదం కాస్త ఇప్పుడు కోర్టులలో పంచాయతీల వరకు వెళ్లేలా కనిపిస్తుంది. కేంద్రంపై ఉన్న అసంతృప్తిని కేసీఆర్ సర్కార్ ఇలా గవర్నర్ పై చూపిస్తుందనే ఆరోపణలు ఉండగా.. రాజ్యాంగపరంగా తన హక్కులను సర్కార్ పట్టించుకోవడం లేదని గవర్నర్ పంతాలకు పోతున్నారని విమర్శలు […]
iTDP: టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు, ఐటీడీపీ ఇంచార్జ్ చింతకాయల విజయ్ ఏపీ సీఐడీ విచారణకు హాజరయ్యారు. పార్టీ నేతలు, లాయర్లతో కలిసి విజయ్ మంగళగిరిలోని సీఐడీ కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరయ్యారు. విజయ్ సీఐడీ విచారణకు హాజరవుతున్నారనే సమాచారంతో కార్యాలయం వద్దకు టీడీపీ శ్రేణులు భారీగా వచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా బలగాలను మోహరించారు. విజయ్ పై కేసు ఏంటి? సీఎం జగన్ భార్య వైఎస్ భారతి లక్ష్యంగా గత […]
Ramireddy Pratap Kumar Reddy: మేమేమీ సత్యవంతులం కాదు.. అవినీతి కూడా కొత్తేమీ కాదు.. అవినీతి జరగలేదని మేమేమీ మీకు చెప్పడం లేదు. ఈ ప్రభుత్వంలో కూడా అవినీతి జరిగింది కానీ.. గత ప్రభుత్వంలో ఇంతకి మించి ఎక్కువగానే జరిగింది. ఇదీ నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు. కావలి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఓ సమావేశంలో, విలేకర్ల ముందే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో […]
Ojuelegba bridge accident: రెండు బస్సులపైకి దూసుకెళ్లిన రెండు భారీ వాహనాల వేర్వేరు ప్రమాదాలలో ఇద్దరు చిన్నారుల సహా ఇరవై మంది మృతి చెందగా మరికొంతమంది గాయపడ్డారు. అందులో ఒక ప్రమాదంలో భారీ కంటైనర్ బస్సుపై పడగా.. ఇద్దరు చిన్నారులు సహా తొమ్మిది మంది మరణించారు. మరో ప్రమాదంలో ఓ భారీ ట్రక్కు బస్సును ఢీ కొట్టడంతో మరో 11 మంది మరణించారు. నైజీరియా లాగోస్ లో ఈ రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఓజులెగ్బా […]
AP Govt: జీతాలు సకాలంలో వచ్చేలా చూడండి మహాప్రభో అంటూ ఏపీ ఉద్యోగ సంఘం ఒకటి గవర్నర్ బీబీ హరిచందన్ ను కలిసి విన్నవించుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఇలా వేతనాలు, ఆర్ధిక ప్రయోజనాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయటం రోసాకు విరుద్ధమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, ఆర్థిక అంశాలపై ప్రభుత్వాన్ని సంప్రదించే ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. అయితే వాటిని వినియోగించకుండా గవర్న ర్ ను ఎందుకు కలిశారని ఆ సంఘాన్ని ప్రభుత్వం ప్రశ్నించింది. […]