Home » news
YSRCP MLA Anam: నమ్ము అంతం చేయాలనే కుట్ర జరుగుతుందని వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రాణ హాని ఉందని.. నన్ను ఈ భూమి మీద లేకుండా చేయాలని కొందరు ప్లాన్ చేస్తున్నారని ఆనం చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. వైసీపీ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, నెల్లూరు జిల్లాలో కీలక నేతగా ఉన్న ఆనం రాంనారాయణ రెడ్డి కొద్ది రోజులుగా వైసీపీ అధిష్టానంపై కీలక వ్యాఖ్యలు […]
KTR Karimnagar Tour: తెలంగాణలో ఎన్నికల హడావుడి ఎప్పుడో మొదలుపెట్టేశారు. ఇలాంటి తరుణంలో మంత్రి కేటీఆర్ జిల్లాల పర్యటన చేస్తున్నారు. ఆమధ్య నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన కేటీఆర్.. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జిల్లా నేతలతో సమావేశమై వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. మంగళవారం కరీంనగర్ జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీకారం చుట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అయితే, మంత్రి కేటీఆర్ కరీంనగర్ పర్యటనలో ఉద్రిక్తత చోటచేసుకుంది. కేటీఆర్ […]
Hyderabad: సరదా కోసం చేసే కొన్ని పనులు చివరికి ఊహించని ప్రమాదాలకు కారణమవుతుంటాయి. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కొంతమంది యువతి యువకులు సెల్ఫీల కోసం, రీల్స్ కోసమని ఎంతకైనా తెగిస్తూ చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇప్పటికీ ఇలాంటి ఘటనలు ఎన్నో జరగగా.. తాజాగా హైదరాబాద్ లో ఓ యువకుడు సరదా కోసం వెళ్లి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. బ్రతుకుదెరువు కోసమని మహారాష్ట్ర నుండి హైదరాబాద్ వచ్చిన యువకుడు.. హైదరాబాద్‌లోని తిరుమలగిరి పోలీస్ స్టేషన్ […]
NIA Court: అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ఇప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై శ్రీనివాస్ అనే యువకుడు కోడికత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనాన్ని రేకెత్తించిన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష హోదాలో ఉన్న నేతపై విమానాశ్రయంలో ఈ దాడి జరగడం.. అది రాజకీయంగా రగులుకోవడం.. అక్కడి నుండి ఆసక్తికర మలుపులు తీసుకుంది. సరిగ్గా ఎన్నికలకు ముందు విశాఖ విమానాశ్రయంలో జరిగిన ఈ కోడికత్తి దాడి వైసీపీకి సానుభూతిపరంగా కూడా […]
Raja Singh: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు మంగళహాట్ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. జనవరి 29న ముంబైలోని దాదర్లో జరిగిన ఓ ర్యాలీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. హైకోర్టు విధించిన షరతులను రాజాసింగ్ ఉల్లంఘించారని.. రెండు రోజుల్లో వీటిపై సమాధానం చెప్పాలని నోటీసులో స్పష్టం చేశారు. ఈ నోటీసులపై రాజాసింగ్ మంగళవారం స్పందిస్తూ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని ఎనిమిదో నిజాం పాలిస్తున్నారని విమర్శించిన రాజాసింగ్.. నిజాం పాలనకు […]
YS Jagan: ఒకపక్క కోర్టు వివాదాలు, ప్రతిపక్షాల పోరాటాలు, రాజధాని తరలింపు వ్యతిరేక ఉద్యమాలు, నిరసనలు సంగతెలా ఉన్నా ఈ సారి రాజధాని విశాఖ వెళ్లిపోవడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. గత మూడేళ్లుగా ఇదిగో, అదిగో అంటూ సాగుతున్న ప్రచారాన్ని నిజం చేసేందుకు సీఎం రెడీ అవుతున్నారు. ఇప్పటి వరకు అధికార పార్టీ నేతలు, మంత్రులే ఈ విషయంపై ప్రకటనలు చేస్తే.. ఈసారి ఏకంగా సీఎం జగన్మోహన్ రెడ్డే సంచలన కామెంట్స్ చేశారు. ఏపీ రాజధాని విశాఖనే.. […]
BRS Party: బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే కేంద్రంపై సమర శంఖం పూరించిన సంగతి తెలిసిందే. తెలంగాణపై కేంద్రం చిన్న చూపు అనే ఆలోచన.. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందనే ఆరోపణ, అన్నిటికి మించి రాష్ట్రాల హక్కులను కూడా కేంద్రం కాలరాస్తుందనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ తన టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి బీజేపీని ఢీ కొట్టేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలో గవర్నర్, సీఎం మధ్య కాన్స్టిట్యూషనల్ వార్ జరుగుతుంది. అసెంబ్లీ […]
AP Capital: ఇప్పటికే ఏపీకి మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మూడు రాజధానులపై నేడు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సీఆర్డీఏ ఒప్పందం ప్రకారం ఆరు నెల్లలో అమరావతిని అభివృద్ది చేయాలన్న హైకోర్టు ఆదేశాలు అమలు సాధ్యం కాదని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో 2022 సెప్టెంబర్ 17వ తేదీన ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. […]
Atchannaidu: తల్లిని, చెల్లిని ఇంటి నుండి గెంటేసి.. తనకు తాను సింహాన్ని, పులిని అంటూ సినిమా డైలాగులు చెప్తున్నారని సీఎం జగన్ పై టీడీపీ ఏపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో తోడేళ్లన్నీ కలిసివస్తున్నాయని.. కానీ తాను మాత్రం సింహం మాదిరిగా సింగిల్ గా పోటీ చేయనున్నట్లు తెలిపారు. భగవంతుని దయతో ప్రజలను నమ్ముకుని ఎన్నికలను ఎదుర్కోబోతున్నట్లు జగన్ ప్రసంగించారు. దీంతో సింహం అంటూ సీఎం జగన్ చేసిన కామెంట్లపై అచ్చెన్నాయుడు […]
Roja Selvamani: ఆంధ్రప్రదేశ్ పర్యాటక సాంస్కృతిక క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్‌కె. రోజా సెల్వమణికి మరో ప్రతిష్టాత్మకమైన పదవి దక్కింది. కేంద్ర స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సభ్యులుగా మంత్రి రోజా నియామకం అయ్యారు. దీనికి సంబంధించి సెక్రటరి జితిన్ నర్వల్ సమాచారాన్ని సోమవారం నాడు అందించారు. మొత్తం 5 రాష్ట్రాల క్రీడా శాఖా మంత్రులకు ఈ అవకాశం లభించింది. దక్షిణ భారతదేశం నుంచి మంత్రి ఆర్‌కే రోజా సెల్వమణిని స్పోర్ట్ అథారిటీ మెంబర్‌గా […]