Home » news
Taraka Ratna: టీడీపీ యువగళం పాదయాత్రలో పాల్గొని తీవ్ర గుండెపోటుకు గురై బెంగళూరులో నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు. కుప్పం నుండి బెంగళూరు తరలించి చికిత్స అందిస్తున్న తారకరత్న ఆరోగ్యంపై ఇటు నందమూరి కుటుంబంతో పాటు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తారకరత్న ఆసుపత్రిలో చేర్చిన దగ్గర నుండి బాలకృష్ణ అక్కడే ఉండి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. తారకరత్న తల్లి, భార్య […]
Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. పెరూ రాజధాని లిమాలో జరిగిన ఈ ఘటనలో 25 మంది మరణించగా.. అనేక మంది గాయపడినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నామని వెల్లడించారు. పెరూ కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున జరిగిందీ ఘటన. మొత్తం 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు పెరూలో కొండపై నుంచి లోయలో […]
Vatti Vasanth Kumar: మాజీ మంత్రి, పశ్చిమగోదావరి జిల్లా సీనియర్ నేత వట్టి వసంత కుమార్ తుదిశ్వాస విడిచారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వసంత్ కుమార్ విశాఖలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కాంగ్రెస్ పార్టీలో వట్టి సుదీర్ఘ కాలం పని చేశారు. వైఎస్ కు సన్నిహితుడుగా ఉండేవారు. వసంత్ కుమార్ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పూళ్ల గ్రామం కాగా.. పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ లో కీలక నేతగా వ్యవహరించారు. […]
BRS Party: ఒకవైపు సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి జాతీయ స్థాయిలో సత్తా చాటుకోవాలని ఆరాటపడుతున్న సంగతి తెలిసిందే. మొన్ననే ఖమ్మంలో భారీ బహిరంగ సభతో జాతీయ స్థాయిలో ఒక సంకేతాన్నిచ్చిన కేసీఆర్.. త్వరలోనే మహారాష్ట్రలోని నాందేడ్ లో మరో బహిరంగసభకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికల సమయానికి ఎలాగయినా బీఆర్ఎస్ వీలైనంత స్థాయిలో విస్తరించాలని ఆరాటపడుతున్నారు. అయితే, అదంతా నాణానికి ఒక వైపు మాత్రమే. మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు […]
Doctor Car Burnt: ప్రియురాలితో గొడవపడి ఏకంగా లక్షల విలువచేసే బెంజ్ కారును తగలబెట్టేశాడు ఓ యువ డాక్టర్. తమిళనాడులోని కాంచీపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో దాదాపు రూ.70 లక్షల విలువైన బెంజ్ కారు పూర్తిగా కాలిపోయింది. ధర్మపురికి చెందిన కవిన్ గత ఏడాది కాంచీపురంలోని ఓప్రైవేటు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి, ఓ ప్రైవేటు ఆసుప్రతిలో డాక్టర్ గా పనిచేస్తున్నాడు. కాలేజీ రోజుల నుండి అదే కాలేజీకి చెందిన కావ్యను ప్రేమించాడు. […]
Bandi Sanjay: బీజేపీ తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కు పోలీసులు నోటీసులిచ్చారు. హైదరాబాద్‌లోని మహేంద్ర యూనివర్సిటీలో చదువుతున్న బండి సాయి భగీరథ్ విద్యార్థిపై దాడి చేశాడన్న కేసులో పోలీసులు ఈ నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ దుండిగల్ పోలీసులు ఇప్పటికే బండి భగీరథపై CR. NO : 50/2023 u/s 341, 323, 504, 506 r/w 34 ఐపీసీ కింద కేసు నమోదు చేయగా.. ప్రస్తుతం […]
AP Govt: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును మరో ఏడాది పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని గత వారం రోజులుగా ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వ శాఖలతో పాటు సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాలలో ముమ్మర ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లుగా ఉండగా.. మరో ఏడాదికి పెంచే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తున్నట్లు ఉద్యోగ సంఘాలలో ప్రచారం జరుగుతుంది. వయసు పెంపుపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోకపోయినా రాష్ట్ర […]
Gadikota Srikanth Reddy: విజయమ్మే మా అందరికీ పెద్ద దిక్కు.. ఆమె దగ్గరికి వెళ్లి అవినాష్ ఆశీర్వాదం తీసుకుంటే తప్పేంటని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడిన శ్రీకాంత్ రెడ్డి.. అవినాష్ రెడ్డి విజయమ్మను కలిసినా రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. కుటుంబాల మధ్య చిచ్చు పెట్టాలని టీడీపీ ప్రయత్నిస్తోందని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. హత్య ఎవరు చేశారు.. ఎందుకు చేశారో ఇప్పటికే తేలిపోయిందని ఆయన అన్నారు. అవినాష్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయాలని కావాలనే […]
Kavitha-Sarath Kumar: తెలంగాణ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవితతో ప్రముఖ సినీ నటుడు, ఆల్ ఇండియా సమతువ మక్కల్ కచ్చి అధ్యక్షుడు శరత్ కుమార్ కలిశారు. శనివారం ఉదయం కవితతో శరత్ కుమార్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా వారు దేశ రాజకీయాల గురించి చర్చించినట్లు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ స్థాపన ఉద్దేశాలు లక్ష్యాలు , ఎజెండా వంటి అంశాల గురించి శరత్ కుమార్ అడిగి తెలుసుకున్నారు. ఆల్ ఇండియా సమతువ మక్కల్ […]
Nandamuri TarakaRatna: ప్రముఖ సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల నుంచి ప్రకటన వెలువడింది. ప్రస్తుతం తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే తాజాగా ఆస్పత్రి వైద్యులు తారకరత్న హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఇప్పటికీ తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టుగా తెలిపారు. దీంతో నందమూరి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తారకరత్నను గత రాత్రి (శుక్రవారం) 1 గంటకు కుప్పం నుంచి బెంగళూరు నారాయణ హృదయాలయ […]