Home » news
Viral News: సరిగ్గా అర్ధరాత్రి 2 గంటల 50 నిమిషాల సమయం. ఒంటి మీద నూలుపోగు లేకుండా ఓ యువతి రోడ్లపై తిరుగుతుంది. అంతేకాదు కనిపించిన ప్రతి ఇంటి ముందున్న కాలింగ్ బెల్ కొట్టడం.. డోర్లు తట్టడం చేస్తుంది. అర్ధరాత్రి గాఢ నిద్ర సమయం కావడంతో కొందరు ఆలస్యంగా నిద్రలేచి తలుపులు తీసేసరికి అక్కడ ఎవరూ ఉండరు. ఈలోగా ఆ యువతి మరో ఇంటి ముందు బెల్ కొడుతోంది. గత కొన్ని రోజులుగా ఇదే పరిస్థితి. అయితే.. […]
Tamilanadu Rains: తమిళనాడును భారీ వర్షాలు తలాకుతలం చేస్తున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తంజావూరు జిల్లాలో అయితే ఎడతెరిపి లేకుండా వానలు పడుతుండడంతో స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఇంతకు ముందు నాగపట్టణం, తిరువారూర్ జిల్లాలు సహా రాష్ట్రంలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అల్పపీడన ప్రభావంతో సముద్ర తీర జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉష్ణోగ్రతలు 27 డిగ్రీలుగా ఉన్నట్లు ఇక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది. తమిళనాడు, శ్రీలంక […]
Chicken Low Price Offer: ఆ రండి బాబూ రండి.. కిలో చికెన్ జస్ట్ రూ.99 మాత్రమే.. ఈ ఆఫర్ కూడా రెండు రోజులే ఉంటుంది బాబూ.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి బాబూ. ఇలా బంపర్ ఆఫర్ ప్రకటిస్తే ఎలా ఉంటుంది. అసలే కిలో చికెన్ రూ.200 నుండి రూ.250 ఉన్న కాలం. అలాంటిది జస్ట్ రూ.99కే కిలో చికెన్ అంటే ఎగబడి మరీ కొనేస్తారు కదా. అదే జరిగింది ఇక్కడ కూడా. నిర్మల్ జిల్లా […]
Same-Sex marriage: మనుషులంతా ఒక్కటే అని చెప్పుకొనేందుకు అందంగా ఉంటుంది కానీ.. ఆచరణలో నేటికీ ఒక యుద్ధమే నడుస్తుంది. గే, ట్రాన్స్‌జెండర్స్, లెస్బియన్స్, బై సెక్సువల్స్ పట్ల నేటికీ సమాజంలో చులకన భావం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మేము అలా పుట్టడం మా తప్పు కాదు అని.. తమకీ అన్ని హక్కులున్నాయని వాళ్ళు పోరాటం చేయాల్సి వస్తుంది. ఇప్పుడిప్పుడే సమాజంలో వీరి పట్ల కాస్త మార్పు కనిపిస్తుంది. వారు కూడా ఈ సమాజంలో భాగస్వాములే అనే ఆలోచన […]
Bhuma Akhila Priya: నంద్యాల రాజకీయం రసకందాయంగా సాగుతుంది. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ.. వైసీపీ ఎమ్మెల్యే శిల్పారవికి ఓపెన్ ఛాలెంజ్ చేయడం తెలిసిందే. ఈనెల 4న తేదీన ఎమ్మెల్యే శిల్పా రవి అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడతానని అఖిలప్రియ రెండు రోజుల క్రితం ప్రకటించారు. తాను చేసిన అక్రమాలను ఎమ్మెల్యే శిల్పా రవి కూడా బయట పెట్టాలని అఖిలప్రియ సవాల్ విసిరారు. ఈ నెల 4న నంద్యాలలోని గాంధీ చౌక్ దగ్గరికి రవిచంద్రకిషోర్ రెడ్డి అక్రమాల […]
Viveka Case: మాజీ మంత్రి, ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వివేకానందా రెడ్డి హత్య తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంగతి తెలిసిందే. గత ఎన్నికలకి ముందు జరిగిన ఈ హత్య అప్పటి ఎన్నికలను కూడా ప్రభావితం చేసింది. అయితే.. అప్పటి నుండి ఎన్నో మలుపులు తిరిగిన ఈ హత్య కేసులో ఇప్పుడు సీబీఐ దూకుడు ప్రదర్శిస్తుంది. వివేకా కూతురు సునీతా అభ్యర్ధన మేరకు ఈ కేసును తెలంగాణకు బదిలీ చేయగా.. తర్వాత దర్యాప్తులో సీబీఐ.. ఎంపీ అవినాష్ […]
Revanth Reddy: తెలంగాణలో ఇప్పుడు చావో రేవో అన్న పరిస్థితి. ఒకపక్క బీఆర్ఎస్ అధికారం నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తుంటే.. ఎలాగైనా జెండా పాతాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డెందుకు సిద్ధమైంది. మరోవైపు కాంగ్రెస్ రాష్ట్రం తెచ్చిన పార్టీగా ఏమైనా మళ్ళీ పుంజుకోవాలని చూస్తుంది. ఈ క్రమంలో ఎవరికి వారు రకరకాల యత్నాలు చేస్తున్నారు. ఈక్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాసినట్లుగా కనిపిస్తుంది. ఈ లేఖలో ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన హామీలు, […]
Taraka Ratna: సినీ నటుడు నందమూరి తారక రత్న గుండె పోటుకి గురైన సంగతి తెలిసిందే. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో గుండెపోటుకు గురైన నందమూరి తారకరత్నకు మొదట కుప్పంలో అందించారు.. ఆ తర్వాత బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. తీవ్ర గుండె పోటు నేపథ్యంలో మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపించింది. అయితే, ప్రస్తుతం గుండె సహా ఇతర ప్రధాన అవయవాలన్నీ ప్రస్తుతం సరిగ్గానే పనిచేస్తున్నట్లు నందమూరి కుటుంబ సభ్యులతో పాటు […]
Tirumala: కలియుగ దైవం శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఎంత ప్రత్యేకత ఉందో తెలిసిందే. దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉన్న ఈ లడ్డూలోనే భక్తి భావం తీణికిసలాడుతుంది. దేశంలో ఎన్నో ఆలయాలున్నా.. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని భక్తులు అత్యంత ప్రీతిపాత్రంగా భావిస్తారు. ఇంతటి విశిష్టమైన లడ్డూ తయారీకి టీటీడీ సిబ్బంది కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. తిరుమలలో లడ్డూ విక్రయ కేంద్రం ద్వారా నిత్యం లక్షలలో లడ్డూలు వితరణ అవుతుంటాయి. బ్రహ్మోత్సవాలు, వేసవి సెలవులు, ప్రత్యేకమైన, విశిష్టమైన రోజులలో […]
Assembly Sessions: తెలంగాణలో రాజకీయాలు ఏ రేంజిలో ఉన్నాయో అందరికీ తెలిసిందే. పట్టుమని పది నెలలు కూడా ఎన్నికలకు సమయం లేకపోవడంతో ఏ పార్టీకి ఆ పార్టీ అధికారమే టార్గెట్ గా రెచ్చిపోతున్నారు. ఇప్పటికే విపక్షాల మధ్య మాటల యుద్ధం ఓ స్థాయి దాటి తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో అసెంబ్లీ సమావేశాలు రావడం.. అది కూడా బడ్జెట్ సమావేశాలు కావడంతో కొంత ఆసక్తి నెలకొంది. అధికార, ప్రతిపక్షాల మధ్య వాదనలతో అసెంబ్లీ దద్దరిల్లడం ఖాయమని అంచనా […]