Home » news
Tamilisai Soundararajan: తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సొంతరాష్ట్రమైన తమిళనాడులో రెండు రోజులుగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె.. తమిళ ప్రజలు నా ప్రతిభను గుర్తించి ఉంటే.. కేంద్ర మంత్రిగా పార్లమెంట్ లో తమిళ ప్రజల కోసం పోరాడేదాన్ని అని.. తమిళులు గుర్తించకపోయినా నా ప్రతిభను కేంద్రం గురించి ఉన్నత పదవులలో కూర్చోబెట్టిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోయంబత్తూరులోని పీళమేడులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన గవర్నర్ […]
TDP-YSRCP: కృష్ణాజిల్లా గన్నవరంలో అధికార వైసీపీ-ప్రతిపక్ష టీడీపీల మధ్య మంటలు ఇంకా చల్లారలేదు. టీడీపీ నుండి గెలిచి వైసీపీకి సానుభూతిపరుడిగా మారిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. దానికి కౌంటర్ గా టీడీపీ నేతలు వంశీపై తీవ్ర విమర్శలకు దిగడంతో మొదలైన ఈ రగడ వంశీ టీడీపీ ఆఫీసుపై దాడి వరకు కొనసాగింది. సోమవారం వంశీ అనుచరులు, వైసీపీ కార్యకర్తలు టీడీపీ ఆఫీసుపై దాడి […]
Yadadri Temple: తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధి పొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. నేటి నుండి మార్చి 3వ తేదీ వరకు అంగరంగ వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. దీంతో ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. తెల్లవారుజాము నుంచే లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి క్యూ కట్టారు. యాదాద్రి ప్రధానాలయం ఉద్ఘాటన జరిగిన తర్వాత మొదటిసారిగా లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. విష్వక్సేన ఆరాధనతో ప్రారంభంకానున్న బ్రహ్మోత్సవాలు మార్చి […]
TDP-YSRCP: కృష్ణా జిల్లా గన్నవరంలో టీడీపీ శ్రేణులు, ఆ పార్టీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మధ్య ఘర్షణ నేపథ్యంలో హై టెన్షన్ పరిస్థితులు నెలకొన్నాయి. రెండు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను వంశీ వ్యక్తిగతంగా విమర్శించారు. దీనిపై స్థానిక టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు వంశీపై విమర్శలు గుప్పించారు. దీంతో ఆగ్రహించిన వంశీ అనుచరులు సోమవారం టీడీపీ కార్యాలయంపై […]
Sri Krishnadevaraya University: అనంతపురం జిల్లాలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో విద్యార్థులు, ఉద్యోగుల సంక్షేమం కోసం మృత్యుంజయ హోమానికి సన్నాహాలు చేయడం, దానికి ఖర్చుల కోసం టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ డబ్బులు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ఏకంగా ఒక సర్కులర్ జారీ చేయడం కలకలం రేపుతోంది. ఉద్యోగులు, విద్యార్థుల సంక్షేమం కోసం ఈ నెల 24న విశ్వవిద్యాలయంలో ధన్వంతరి మహా మృత్యుంజయ శాంతి హోమం చేయాలని వైస్ చాన్సలర్ నిర్ణయించారు. ఈ మేరకు హోమంలో ఉద్యోగులు స్వచ్ఛంగా […]
BJP MLA Rajasing: పాకిస్తాన్ నుండి తనను చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు పలుమార్లు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర గోరక్షా కన్వీనర్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్ అన్నారు. ఆయన ట్విట్టర్ ద్వారా ఈ విషయం వెల్లడించారు. ‘నన్ను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 3.34 గంటలకు బెదిరింపు కాల్ వచ్చింది. పాకిస్తాన్ కు చెందిన ఒక మొబైల్ వాట్సాప్ కాల్ ద్వారా చంపుతామంటున్నారని ట్వీట్ చేశారు. తమ స్లీపర్ సెల్స్ […]
Kanna Lakshmi Narayana: ఏపీలో ఎన్నికలకు ఇంకా ఒకటిన్నర ఏడాది సమయం ఉన్నా.. పొలిటికల్ హీట్ మాత్రం ఎప్పుడో మొదలైంది. ఇప్పటికే సీట్లు ఆశించే నేతలు.. అధిష్టానాలు వద్ద లాబీయింగ్ మొదలు పెట్టగా.. సీటు గ్యారంటీలేని వాళ్ళు గోడ దూకేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఏ పార్టీ ఎవరితో పొత్తుకు వెళ్తుందనే ఊహాగానాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఈక్రమంలోనే ఎప్పటి నుండో ప్రచారం జరుగుతున్నట్లుగానే ఏపీ బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు కన్నా […]
Gannavaram: కృష్ణా జిల్లా గన్నవరం రణరంగంగా మారింది. స్థానిక టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు గన్నవరంలోని టీడీపీ ఆఫీస్ పై దాడి చేశారు. కార్యాలయం ఆవరణలో ఉన్న కారుకు ఆందోళనకారులు నిప్పు పెట్టడంతోపాటు కార్యాలయంలోని సామగ్రి, కంప్యూటర్లు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. రెండు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను వంశీ వ్యక్తిగతంగా విమర్శించారు. దీనిపై స్థానిక టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం […]
Bandi Sanjay: గుంట నక్కలే గుంపులుగా వస్తాయ్.. సింహం సింగిల్ గా వస్తుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కాంగ్రెస్-బీఆర్ఎస్ పొత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జహీరాబాద్ వెళ్తున్న సంజయ్ కి పటాన్ చెరు రింగు రోడ్డు దగ్గర పటాన్ చెరు నియోజకవర్గ బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్.. సింహం సింగిల్ గా వస్తుందని గుంట నక్కలు గుంపులుగా వస్తాయంటూ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా.. మేము అభివృద్ధి ఎజెండాతో […]
Amara Raja: అమరరాజా బ్యాటరీస్ కాలుష్యం అంశంపై ఏపీ ప్రభుత్వానికి సంస్థకి మధ్య పెద్ద రగడ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ అంశంపై తాజాగా సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి జారీ చేసిన షోకాజ్ నోటీసులపై సుప్రీం ధర్మాసనం గతంలో స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు ఆ స్టేను సుప్రీంకోర్టు ఎత్తేసింది. అయితే, సంస్థ మూసివేతపై హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ కొనసాగుతుందని జస్టిస్ అజయ్ రాస్తోగి, […]