Home » news
AP Capital: : ఏపీ రాష్ట్ర రాజధాని వ్యవహారంలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఏపీ రాజధాని వ్యహారంపై కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో ఈనెల 23న ఏపీ రాజధాని అంశంపై విచారణ జరగనుంది. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలంటూ దాఖలైన పిటీషన్లు ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉన్నాయి. అమరావతిని ఆరు నెలల్లోగా అభివృద్ధి చేయాలంటూ ఏపీ హైకోర్టు దాఖలు చేసిన ఆదేశాలపై […]
Nara Lokesh: ఏపీలో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 1 ఎంత వివాదం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీవో రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్షాలు నానా యాగీ చేసి చివరికి హైకోర్టులో కూడా స్టే తీసుకొచ్చాయి. అయితే ఆ స్టే గడువు ఉందా లేదా అనేది తెలియదు కానీ ప్రభుత్వం మాత్రం జీవోను అమలు చేస్తుంది. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోతో స్వల్ప […]
Revanth Reddy: ప్రగతి భవన్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాలలో మంట పెట్టాయి. నక్సలైట్లు బాంబులు పెట్టి.. ప్రగతి భవన్ ని పేల్చేయాలంటూ ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. రేవంత్ రెడ్డి ములుగు నుండి హాత్ సే హాత్ జోడో యాత్రను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ యాత్రలో ములుగు జిల్లాలో పర్యటిస్తున్న రేవంత్ రెడ్డి.. రెండో రోజు బహిరంగ సభలో మాట్లాడారు. […]
Viral News: అక్కచెల్లెల్లు అంటే అనుబంధానికి, అప్యాయతలకు మారు రూపం అనిచెప్పుకుంటారు. కష్ట సుఖాలను పంచుకుంటూ ఒకరికొకరుగా మెలుగుతారు. కానీ, వన్స్ పెళ్ళైతే భర్తే సర్వస్వంగా.. నేనూ, నా భర్త సంతోషంగా ఉండాలని అనుకుంటారు. కష్ట సుఖాలలో అక్క చెల్లెళ్ళు తోడుగా ఉంటారు కానీ.. భర్తను పంచుకోవడం అనేది ఊహించుకున్నా ఉగ్రరూపం బయటకి వచ్చేస్తుంది. ఆ మాటకొస్తే ఏ స్త్రీకి అయినా తన భర్త తనకే సొంతం.. తనకే సర్వస్వం అనుకొనేలా ఉంటారు. అప్పుడప్పుడు అక్కాచెల్లెళ్లు అనుకోకుండా […]
TS Budget Sessions: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. తొలిరోజు గవర్నర్ ప్రసంగం.. ఆ తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టడంతో సరిపోగా.. ఆ తర్వాత అధికార, ప్రతిపక్షాల మధ్య అసలైన యుద్ధం మొదలైంది. ఒకవైపు కాంగ్రెస్ లో సీనియర్ నేతలు.. మరోవైపు బీజేపీ నేతలు, మజ్లీస్ నేతలు అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుండగా.. అధికార పార్టీ నేతలు అందుకు ధీటుగా బదులిస్తున్నారు. మొత్తంగా బడ్జెట్ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. బుధవారం చర్చలో భాగంగా బీజేపీ […]
AP Govt: సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అయింది. అసెంబ్లీ సమావేశాలు, పలు అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. మోడల్ స్కూల్, ఏపీఈఆర్ఐఎస్ ఉద్యోగుల విరమణ వయసు 62 ఏళ్లకు పెంపుపై కేబినెట్‌లో చర్చ జరిగింది. అలాగే జిందాల్ స్టీల్‌కు రామాయపట్నం పోర్టులో క్యాప్టివ్ బెర్త్ కేటాయింపు ప్రతిపాదనపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, విశాఖలో పెట్టుబడుల సదస్సుపైనా కేబినెట్‌లో చర్చ జరిగింది. విశాఖలో జరిగే ఏపీ గ్లోబల్ […]
MLA’s Purchase Case: తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు ఇచ్చిన కీలక తీర్పు తీర్పును తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును దేశ అత్యున్నత ధర్మాసనంలో తెలంగాణ ప్రభుత్వం అప్పీల్ చేసింది. ఈ రోజు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం ముందు ప్రభుత్వం తరఫు […]
Mekapati Chandrasekhar Reddy: ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. కార్యకర్తలు, అభిమానులు ఆయనను వెంటనే ముందుగా నెల్లూరులోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనను పరీక్షించి, గుండెపోటుకు గురయ్యారని వెల్లడించారు. ఇప్పటికే వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. ఆయన గుండెలో రెండు వాల్వులు బ్లాక్ అయినట్లు పరీక్షలలో బయటపడినట్లు తెలిసింది. ప్రస్తుతం మేకపాటికి వైద్యులు చికిత్స అందిస్తుండగా.. ఎమ్మెల్యే పరిస్థితి కాస్త విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. చెన్నైకి తరలించాలని కుటుంబ సభ్యులు […]
Earthquake: టర్కీ, సిరియాలో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. సోమవారం వరుసగా మూడు అత్యంత శక్తివంతమైన భూకంపాలు సంభవించగా.. ఈ భారీ భూకంపాల ధాటికి అందమైన నగరాలు మరుభూమిగా మారిపోయాయి. భవనాలు, కట్టడాలు పేక మేడల్లా కూలిపోగా.. శిధిలాల కింద బతుకులు చితికిపోయాయి. ఒకపక్క సహాయక కార్యక్రమాలు జరుగుతుండగానే.. మృతుల సంఖ్య వేలల్లో ఉంటుంది. ఈ భూప్రకంపనల కారణంగా ఇప్పటికి 7 వేలకు పైగా మృత్యువాత పడగా.. ఇది 20 వేల వరకు చేరుకోవచ్చని అంచనా […]
IT Sector: ఓ వైపు ఆర్థిక మాంద్యం, మరోవైపు విపత్కర పరిస్థితులు.. ఈ కారణంగానే ప్రపంచ దిగ్గజ సంస్థలన్నీ లేఆఫ్ బాట పడుతున్నాయి. ఇదే ఇప్పుడు ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర కలవరానికి గురిస్తోంది. గూగుల్ లాంటి దిగ్గజ సంస్థల నుంచి చిన్న చిన్న కంపెనీలు సైతం ఈ లే ఆఫ్ బాటలో వెళ్తున్నాయి. జూమ్ కంపెనీ 1300 మందిని ఇంటికి పంపేందుకు సిద్ధమైందని తాజాగా ఐటీ సెక్టార్ లో చక్కర్లు కొడుతుండడం ఐటీ ఉద్యోగులలో ఆందోళన కలిగిస్తుంది. […]