Home » news
TDP: ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ రాజకీయవేత్త, కాపు సామాజికవర్గంలో బలమైన నేత కన్నా లక్ష్మీనారాయణ ఊహించినట్లే టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కన్నాతో పాటు ఆయన కుమారుడు, గుంటూరు మాజీ మేయర్ నాగరాజు కూడా టీడీపీలో చేరారు. వీరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరులు 3 వేల మంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయం వద్ద […]
Viveka Murder: సీఎం జగన్ బాబాయ్, దివంగత వైఎస్ఆర్ సోదరుడు వైఎస్ వివేకా హత్యకేసులో సంచలన నిజాలు బయటపడుతున్నాయి. వైఎస్ వివేకానంద రెడ్డిని కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డే చంపించారు. దీనిని నిరూపించేందుకు మా వద్ద ప్రాసంగిక సాక్ష్యాలన్నీ ఉన్నాయని సీబీఐ తేల్చిచెప్పింది. వివేకా హత్యలో నేరుగా పాల్గొన్న యాదాటి సునీల్ యాదవ్ బెయిల్ దరఖాస్తును వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఈ పిటిషన్‌లో అనేక సంచలన సంగతులు బయటపెట్టింది. ఇంకా […]
YS Sharmila: వైఎస్ షర్మిల తన వ్యాఖ్యలతో ఓ వివాదంలో చిక్కుకున్నారు. దీంతో తమకి క్షమాపణలు చెప్పకపోతే షర్మిల పాదయాత్రను కూడా అడ్డుకుంటామని హిజ్రాలు హెచ్చరించారు. షర్మిల తాజాగా మహబూబాబాద్ లో పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రలో స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ ను ఉద్దేశిస్తూ.. హిజ్రాల ప్రస్తావన తెచ్చారు. దీనిపై హిజ్రాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షర్మిల వ్యాఖ్యలపై హిజ్రాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. మహబూబాబాద్ సభలో షర్మిల ట్రాన్స్ జెండర్లను […]
V. V. Lakshminarayana: వీవీ లక్ష్మి నారాయణ.. ఇలా చెప్తే ఈ పేరు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అంటే మాత్రం తెలుగు ప్రజలు ఈజీగా గుర్తు పట్టేస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో వెలుగులోకి వచ్చిన ఈ సీబీఐ అధికారి రిటైర్మెంట్ తర్వాత ప్రజా సమస్యలు.. రాజకీయాలపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయిన ఈయన ఇప్పుడు […]
Gannavaram Riots: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు టీడీపీ ఆఫీసు దహనం ఘటన రాష్ట్రంలో రాజకీయంగా ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. వైసీపీకి మద్దతిస్తున్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారన్న కారణం, చంద్రబాబుపై వంశీ చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేతల కౌంటర్ విమర్శలతో వంశీ అనుచరులు టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో చోటు చేసుకున్న హింసకు కారణమయ్యారనే ఆరోపణలతో విజయవాడ టీడీపీ నేత పట్టాభిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. […]
BRS-AIMIM: ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మార్చి నెల 13వ తేదీన హైదరాబాద్ స్థానిక సంస్థల స్థానంతో పాటు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ ఎవరిని నిలబెడుతుంది.. బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందా అనే ఆసక్తి కనిపించింది. అయితే, ఎంఐఎం పార్టీని మిత్రపక్షంగానే చూస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ […]
Loan App Harassment: పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. రిజర్వ్ బ్యాంక్ నుండి లోకల్ రుణ సంస్థల వరకు ఎంత అవగాహనా కల్పించినా.. ఆన్‍లైన్ రుణ యాప్ ల నుండి అప్పులు తీసుకోవడం ఆగడం లేదు.. వారి వేధింపులు ఆగడం లేదు. అవి తట్టుకోలేక ఆత్మహత్యలు ఆగడం లేదు. లోన్ యాప్స్ అమాయకులకు అప్పు ఇచ్చి లక్షల్లో దండుకుంటున్నాయి. అప్పు తీర్చినా కూడా వేధింపులు ఆపడం లేదు. ఇలా లోన్ యాప్ వేధింపులు తాళలేక ఇప్పటికే చాలా […]
Etela Rajender: తెలంగాణలో రైతులకు కనుక 24 గంటల మూడు ఫేజ్‌ల కరెంటు వస్తుందని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఛాలెంజ్ విసిరారు. అసలే ఎన్నికల కాలం.. పైగా రాజకీయ పార్టీలు దూకుడు పెంచాల్సిన సమయం. అందుకే ఒక్కో నేత ఒక్కోలా కామెంట్స్ చేసి రాజకీయాలలో వేడి పెంచుతున్నారు. తెలంగాణలో ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల వార్ జరుగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో ఈటల రాజేందర్ […]
Byreddy Rajasekhar Reddy: ఏపీలోని మూడు ప్రాంతాల మధ్య రాయలసీమ ఇప్పుడు సుడిగుండంలో ఇరుక్కుపోయిందని రాయలసీమ స్టీరింగ్ కమిటీ నాయకులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ ప్రాంతం పరిస్థితి ఇప్పుడు వెంటిలేటర్ మీద ఉన్న పేషంట్ మాదిరి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలులో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. సంగమేశ్వరం వద్ద బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ నిర్మిస్తే రాయలసీమకి తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు. తీగల వంతెన వద్దని ఎమ్యెల్యే, […]
Killer Wife: మనుషులలో మానవత్వం మచ్చుకైనా కనిపించడం లేదు. ఈ మధ్య కాలంలో దేశంలో దిగ్బ్రాంతికి గురి చేసే హత్యోదంతాలు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీలో నిక్కీ యాదవ్ అనే యువతిని సాహిల్ గహ్లోత్ అనే యువకుడు చంపేసి దాబాలోని ఫ్రిజ్‌లో దాచిపెట్టిన ఘటన చూసే ఉంటారు. అదే ఢిల్లీలో సహజీవన భాగస్వామి శ్రద్ధావాకర్ ప్రాణం తీసి ముక్కలు చేసి చెల్లాచెదురుగా పడేసిన ఆఫ్తాబ్ పూనవాలా ఘటన కూడా మరిచిపోనేలేదు. ఈలోగా అంతకి మించి కిరాతంగా మర్డర్ మరొకటి […]