Home » news
AP Budget 2023-24: ఏపీలో రాజకీయాలు మళ్ళీ మరింత రసవత్తరం కానున్నాయి. ఎందుకంటే మార్చి 14 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. మొత్తం పది రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశముంది. మొదటిరోజు గవర్నర్ ప్రసంగం.. అనంతరం బీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. బీఏసీలో అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలి అనే అంశంపై చర్చించి అనంతరం ఎన్నిరోజులు సమావేశాలు అనేది ప్రకటిస్తారు. ఇప్పటికే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు అనుమతిని ఇవ్వాలని కోరుతూ గవర్నర్ […]
Kondagattu Temple: కొండగట్టు ఆంజనేయస్వామి గుడి ప్రాముఖ్యత గురించి తెలిసిందే. సామాన్య ప్రజల నుండి సెలబ్రిటీలు, ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా ఈ ఆలయంలో ఆంజనేయుని దర్శనానికి క్యూలు కడతారు. ఈ మధ్యనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఎన్నికల రథమైన వారాహీని ఇక్కడే తొలిపూజ చేసిన సంగతి తెలిసిందే కాగా.. సీఎం కేసీఆర్ కొండగట్టు ఆలయ అభివృద్ధికి 100 కోట్ల రూపాయలతో యాదాద్రి తరహాలో కొండగట్టు ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఇదిలా ఉండగా తాజాగా […]
Sajjala Ramakrishna Reddy: వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. అసలు వివేకా హత్యతో అవినాష్ కు సంబంధం లేదని స్పష్టం చేశారు. అవినాష్‌రెడ్డికి సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని.. ఎన్నికల ముందు వివేకా హత్య కేసు ద్వారా జగన్‌ను నైతికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నించారని వ్యాఖ్యానించారు. వివేకా హత్య కేసులో విచారణ […]
Viral News: ఓ డీజిల్ ట్యాంకర్ టర్న్ తీసుకొనే క్రమంలో బోల్తా పడింది. అందులో డ్రైవర్ సురక్షితంగానే బయటపడి ట్యాంకర్ కి కాపలా కాస్తున్నాడు. అయితే, డీజిల్ ట్యాంకర్ బోల్తా పడిందని తెలియగానే స్థానిక ప్రజలు బక్కెట్లు, క్యాన్లు, బిందెలు ఇలా ఎవరికి దొరికింది వారు తెచ్చుకొని దొరికిన కాడికి డీజిల్ ను దోచుకెళ్లారు. ఒకపక్క డ్రైవర్ వారిస్తున్నా వినకుండా బకెట్లతో ట్యాంకర్‌లోని డీజిల్‌ను ఎత్తుకెళ్లిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం సమీపంలో ఓ డీజిల్ ట్యాంకర్ […]
EX Minister Narayana: ఏపీ మాజీ మంత్రి నారాయణకు ఏపీ సీఐడీ మరోసారి షాక్ ఇచ్చింది. హైదరాబాద్ లోని నారాయణ కుమార్తె శర్వాణి నివాసంలో సీఐడీ అధికారులు శుక్రవారం భారీస్థాయిలో సోదాలు నిర్వహించారు. కూకట్ పల్లి, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలిలోని ఇళ్లలో తనిఖీలు చేపట్టింది. రాజధాని అమరావతి భూముల కొనుగోలు అంశంలో సీఐడీ అధికారులు ఈ సోదాలు జరిపినట్లుగా సమాచారం. మనీ రూటింగ్ కు పాల్పడి అమరావతిలో భూములను కొనుగోలు చేసినట్లుగా సీఐడీ అధికారులు గుర్తించినట్లు అనుమానిస్తున్నారు. […]
Gold Smuggling: అధికారులు ఎంత పగడ్బంధీగా తనిఖీలు చేపడుతున్నా.. రోజూ అక్రమ బంగారం రవాణాకు పాల్పడే వారికి అరెస్టులు చేస్తున్నా హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి మాత్రం దొంగ బంగారం రవాణా ఆగడం లేదు. పోలీసుల ఎత్తులకు అక్రమార్కులు పై ఎత్తులు వేస్తూ అక్రమ బంగారం రవాణాకి సిద్దపడుతున్నారు. ఒకటి కాదు రెండు ఏకంగా 15 కేజీల బంగారం తాజాగా పట్టుబడింది. శంషాబాద్ విమానాశ్రయంలో గురువారం భారీగా బంగారం పట్టుబడింది. కస్టమ్స్ అధికారులను బురడి కొట్టించడానికి 23 మంది […]
Road Accident: ఛత్తీస్ ఘడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది మరణించారు. ట్రక్కు, పికప్ వ్యాన్ ని ఢీకొట్టిన ఈ ప్రమాదంలో 11 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటన చత్తీస్‌గఢ్‌లోని బలోడా బజార్-భాతపరా జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులందరూ ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే […]
Medico Preethi Case: సీనియర్ల వేధింపులు తట్టుకోలేక బలవన్మరణానికి యత్నించిన వరంగల్ కేఎంసీ పీజీ మెడికల్ స్టూడెంట్ ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమించిందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ప్రీతికి హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తుండగా.. మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అయినట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటికిప్పుడు ఏం చెప్పలేమని వైద్యులు వెల్లడించారు. మరోవైపు ప్రీతిని వేధింపులకు గురిచేసిన సీనియర్ విద్యార్థిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ర్యాగింగ్ కేసులు […]
Marriage In ICU: పెద్దలంతా కూర్చొని వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేందుకు ముందుగా ముహుర్తాలు పెట్టుకున్నారు. అయితే, ఆ సమయానికి వధువు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరింది. అయితే, ముందుగా అనుకున్నట్లే ఐసీయూలోనే పెళ్లి చేశారు. ఆసుపత్రి బెడ్ మీద ఉన్న వధువు మెడలో తాళి కట్టి వరుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ విచిత్ర ఘటన మన తెలుగు రాష్ట్రాలలో జరగడం విశేషం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ఆసుపత్రిలో ఈ విచిత్ర పెళ్లి జరిగింది. అస్వస్థతకు […]
KTR: తెలంగాణలో ఎన్నికల వేడి ఎప్పుడో మొదలైంది. ఎన్నికలకు సమయం దగ్గర పడేకొద్దీ అన్ని పార్టీలు వ్యూహాలకు పదులు పెడుతున్నాయి. విమర్శలలో పదును కూడా పెరిగింది. ఈ క్రమంలోనే అన్ని పార్టీల నేతలు ప్రజల మధ్యకి వెళ్తూ.. విపక్షాలపై మాటల దాడి చేస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ కావడంతో బీఆర్ఎస్ నేతలు వివిధ అభివృద్ధి కార్యక్రమాల పేరిట ప్రజల మధ్యకి వెళ్తూ ప్రతిపక్షాలను తూర్పార పట్టేస్తున్నారు. మంత్రి కేటీఆర్ బుధవారం భూపాలపల్లి జిల్లాలో పలు అభివృద్ధి పనుల […]