Home » news
Kotamreddy Sridhar Reddy: ఏపీలో ఇంకా ఎన్నికలకు ఒకటిన్నర ఏడాది ఉండగానే ఇప్పటికే ఇక్కడ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. నెల్లూరు జిల్లాలో అయితే పరిస్థితి మరింత కాక రేపుతోంది. ప్రతిపక్షాలపై వివాదాస్పద వ్యాఖ్యలు, వ్యంగ్యాస్త్రాలు సంధించడంలో పేరున్న కోటంరెడ్డి ఇప్పుడు.. పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా మారి అదే వ్యాఖ్యలను ప్రభుత్వంపైనా, సొంత పార్టీ నేతలపైనా చేస్తున్నారు. కోటంరెడ్డి వ్యవహారంపై దృష్టి సారించిన వైసీపీ పెద్దలు పార్టీ బాధ్యతల నుండి ఆయన్ను తప్పించి సెక్యూరిటీని కూడా తగ్గించారు. మిగిలిన […]
Khammam: మిర్చి రైతులు, మార్కెట్ లో కమిషన్ వ్యాపారం చేసే వ్యాపార దారుల మధ్య ఘర్షణ చెలరేగి ఖమ్మం వ్యవసాయ మార్కెట్ రణరంగంగా మారింది. కమిషన్ దారు ఓ రైతుపై చేయిచేసుకోవడంతో మొదలైన ఘర్షణ కొట్లాటకు దారి తీసింది. చివరికి పోలీసులు రంగప్రవేశం చేయడంతో వివాదం సద్దుమణిగింది. ఈ ఘర్షణలో పలువురు రైతులకు గాయాలవగా.. కమిషన్ దారులకు కొందరికి ఒంటి మీద బట్టలు కూడా చిరిగిపోయాయి. మార్కెట్ కు మిర్చిని అమ్ముకోవటానికి వచ్చిన రైతును ఒక కమిషన్ […]
Honor killing: సమాజం అభివృద్ధిలో ఎంత ముందుకు వెళ్తున్నా కొందరు మనుషులలో మాత్రం మార్పు రావడం లేదు. సమాజం తనను ఏమంటుందో అని పరువు కోసం బ్రతికే వారిలో మార్పు మాత్రం రావడం లేదు. నలుగురు తనను ఏమంటారోనని ఆత్మహత్యలు చేసుకొనేవారు కొందరైతే.. తన పరువు తీశారని కడుపున పుట్టిన పిల్లలను అతి కిరాతకంగా చంపేసేవారు మరికొందరు. ఇలాంటి ఘటనే ఒకటి నంద్యాల జిల్లా పాణ్యం మండలం, ఆలమూరు గ్రామంలో చోటు చేసుకుంది. తండ్రి దేవేంద్ర రెడ్డి […]
China Population: దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అని గురజాడ అప్పారావు అన్నారు. అంతేకాదు.. వట్టి మాటలు కట్టిపెట్టోయ్.. గట్టిమేల్ తలపెట్టవోయ్ అని కూడా ఆయనే చెప్పారు. ఈ మాటలు మన భారతీయులు ఎలా అర్ధం చేసుకున్నారో కానీ.. ఈ చైనా వాళ్ళు మాత్రం దేశమంటే మట్టి కాదు జనాభానే అని అర్ధం చేసుకున్నట్లున్నారు. అందుకే జనాభా మంత్రం జపిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగివున్న దేశం చైనా కాగా.. ప్రస్తుతం చైనాలో 145 కోట్ల […]
Viveka Murder Case: తెలంగాణకు బదిలీ అయిన తర్వాత వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణలో దూకుడు పెరిగిన సంగతి తెలిసిందే. ఈరోజు వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని మరోమారు విచారించిన సీబీఐ, తాజాగా అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది. రేపు శనివారమే విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ లో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. దీంతో ఈ […]
Amit Shah: తెలంగాణలో రాజకీయాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో అధికార, ప్రతిపక్షాలు మాటల తూటాలు వదులుతున్నారు. ఏదొక యాత్రల పేరున ప్రజల మధ్యకి వెళ్లి సవాళ్లు, ప్రతిసవాళ్ళతో కాకరేపుతున్నారు. జాతీయ పార్టీలైతే.. అధిష్టానం నుండి నేతలను రప్పించి కార్యకర్తలలో మరికాస్త జోష్ పెంచేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈక్రమంలోనే తెలంగాణ బీజేపీ నేతలు జాతీయ నాయకుల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. హోంమంత్రి అమిత్ షా ఒకటీ, రెండుసార్లు రాష్ట్రానికి రాగా.. ప్రధాని […]
Gujarat: అర్ధరాత్రి వేళ భార్యభర్తల మధ్య గొడవ మొదలైంది. భర్త అదే పనిగా నీలి చిత్రాలు చూస్తుండడంతో భార్య అడ్డుకుంది. దీంతో మొదలైన గొడవతో భర్త కోపం నషాళానికి అంటడంతో భార్యపై కిరోసిన్ పోసి నిప్పటించేశాడు. నీలి చిత్రాలు చూడవద్దన్న పాపానికి భార్యను బుగ్గిపాలు చేశాడు కిరాతకుడు. గుజరాత్‌లోని సూరత్‌లో నాలుగు రోజుల కిందట జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కతార్గాం ప్రాంతానికి చెందిన కిశోర్ పటేల్, కాజల్ భార్యాభర్తలు. కాజల్ మొదటి భర్త […]
Chandrababu: టైమ్ మీరు చెప్పినా సరే.. మేము చెప్పినా సరే.. ఏ సెంటరైనా.. ఏ ప్లేస్ అయినా.. ముహూర్తం పెట్టుకొని చెప్పండి కొట్టేసుకుందాం. ఈ దాగుడు మూతలు వద్దు.. పేస్ టూ పేస్ తేల్చుకుందాం. ఇదేదో సినిమా డైలాగ్ లా ఉందే అనుకుంటున్నారా?. కాదు.. టీడీపీ అధినేత అధికార పార్టీ వైసీపీ నేతలకు విసిరిన ఓపెన్ ఛాలెంజ్. మునుపెన్నడూ లేని విధంగా చంద్రబాబు గన్నవరం పర్యటనలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గన్నవరం పర్యటనకు వెళ్ళిన ఆయన.. ప్రణాళిక […]
Death of Bride: మరికొన్ని గంటల్లో పెళ్లి.. కాసేపటిలో పెళ్లి మండపం ఎక్కాల్సిన పెళ్లి కూతురు అకస్మాత్తుగా కుప్పకూలింది. ఏమైందా అని దగ్గరకి వెళ్లిన తల్లిదండ్రులు, బంధుమిత్రులు వధువుకి గుండెపోటుగా నిర్ధారించుకున్నారు. హుటాహుటిన ఆమెని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ, అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. వధువు మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. దీంతో అప్పటివరకు పెళ్లి సందడితో కలకలాడుతోన్న ఇంట ఒక్కసారిగా విషాదం అలముకుంది. అయితే వధువు కుటుంబం మాత్రం పుట్టెడు దుఃఖంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది. […]
MLA Raja Singh: తనకు బెదిరింపు కాల్స్ ఆగలేదని.. ఇంకా చేస్తూనే ఉన్నారని.. దీనిపై ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర గోరక్షా కన్వీనర్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్ ఆరోపించారు. పాకిస్తాన్ నుండి తనను చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు పలుమార్లు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని ఆమధ్య రాజాసింగ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. ‘నన్ను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.. పాకిస్తాన్ కు చెందిన ఒక మొబైల్ వాట్సాప్ కాల్ […]