Home » news
Murder: హైదరాబాద్ లో వరస హత్యలు హడలెత్తిస్తున్నాయి. అది కూడా క్రూరాతి క్రూరంగా ఈ హత్యలు ఉండడం సమాజం మీద తీవ్ర ప్రభావం పడుతుంది. మొన్నటికి మొన్న నవీన్ హత్య సంచలనం సృష్టించింది. ప్రేమ వ్యవహారంలో హరిహర కృష్ణ అనే యువకుడు స్నేహితుడు నవీన్ ను అతి కిరాతకంగా హతమార్చాడు. ఒక్కో శరీర భాగాన్ని వేరుచేసి ప్రియురాలికి ఫోటోలు పెట్టి సైకోలా ప్రవర్తించాడు. అదలా ఉండగానే ఇప్పుడు మరో హత్య కలకలం సృష్టించింది. ఈ హత్యలో కూడా […]
Sri Sathyasai District: ఏపీలో శాంతిభద్రతలు, పోలీసుల తీరుపై ప్రతిపక్ష నేతలు చాలా కాలంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ పోలీసులు వైసీపీ నేతలకు, కార్యకర్తలకు అండగా ఉండడం వలనే రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతింటున్నాయని.. పోలీసుల అండతోనే వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నాయని ప్రతిపక్ష పార్టీలు వాపోతున్నాయి. అది నిజమేనేమో అనేలా ఓ సీఐ వైసీపీ కార్యకర్తల భుజాల మీదకెక్కి టీడీపీ శ్రేణులపై మీసం మెలేసి తొడగొట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో శనివారం […]
Heart Attack: ఒకప్పుడు గుండెపోటు, గుండె జబ్బులు అంటే చాలా అరుదుగా కనిపించేది. 90ల్లో అయితే.. 60 ఏళ్ళు, 50 ఏళ్ల పైన వారికి వచ్చేది. అందులో కూడా చాలా మందికి మైల్డ్ స్ట్రోక్ కనిపించి తిరిగి కొన్నాళ్ళు పాటు బ్రతికేవారు. కానీ, ఇప్పుడు ఈ మహమ్మారికి వయసుతో పనిలేదు. వృద్ధుల నుండి పిల్లల వరకు ఎవరినైనా కబళిస్తుంది. అది కూడా కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్లే.. నిలబడిన వాళ్ళు నిలబడినట్లే ప్రాణాలను హరిస్తుంది. ఒక్క మన తెలుగు […]
Bus Fire Accident: తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలంలో రెండు ఆర్టీసీ బస్సులు దగ్ధం అయ్యాయి. మండలంలోని గంపులగ్రామ శివారులో ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో రెండు ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని దగ్ధమయ్యాయి. అయితే ప్రమాదం జరిగిన సమయంలో రెండు బస్సులలో ఎవరూలేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఏపీఎస్ఆర్టీసీకి చెందిన వెన్నెల బస్సు సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. బ్యాటరీలో తలెత్తిన సమస్యతో బస్సు లైట్లు పనిచేయలేదు. దీంతో […]
TDP-YSRCP: టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, తాజాగా ఈ పాదయాత్రలో భాగంగా ఒక చోట మీడియా సమావేశం నిర్వహించగా.. టీడీపీలోకి జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానిస్తారా అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు లోకేష్ తప్పకుండా ఆహ్వానిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరితో పాటు మంచి మనసు కలిగిన వాళ్లంతా రాజకీయాల్లోకి రావాలని లోకేష్ పిలుపునిచ్చారు. దీనిపై అప్పటి నుండే వైసీపీ మూకుమ్మడి దాడి మొదలు […]
Gannavaram: వధువు మహిళా వాలంటీర్.. ఈ నెల 22న పెళ్లి జరగాల్సి ఉండగా వధువు ఇంట పెళ్లి సందడి నెలకొంది. తెల్లారి పెళ్లి అనగా బంధుమిత్రులతో ఇల్లు కళకళలాడుతుంది. కానీ, ఇంతలోనే పిడుగులాంటి వార్త వధువు ఇంటికి చేరింది. తమకి ఈ పెళ్లి ఇష్టం లేదని.. అందుకే పెళ్లి రద్దు చేసుకుంటున్నట్టు వరుడి కుటుంబం నుంచి రాయబారం వచ్చింది. ఆశ్చర్యపోయిన వధువు సహా కుటుంబ సభ్యులు ఎందుకిలా చేశారని వరుడి కుటుంబాన్ని నిలదీశారు. వధువు పనిచేసే సచివాలయంలోని […]
Kuppam Road Accident: కారు-లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని కుప్పం సమీపంలో జరిగింది. జిల్లాలోని గుడుపల్లె మండలంలోని కుప్పం-పలమనేరు జాతీయ రహదారిపై చిన్నశెట్టిపల్లి వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఫలితంగా కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా.. ఈ ప్రమాదానికి అతి వేగమే కారణంగా అనుమానిస్తున్నారు. మృతులు కడప, నెల్లూరు వాసులుగా పోలీసులు […]
Doctors Neglect: ఈమధ్య కాలంలో కొన్ని ఆసుపత్రులలో వైద్యం, ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే ఆస్పత్రులకు వెళ్లాలంటేనే ప్రజలు భయాందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది. రకరకాల రోగాలతో ఆసుపత్రులకు వెళ్లే ప్రజలను కాపాడాల్సిన వైద్యులే నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణపాయ పరిస్థితులకు గురిచేస్తున్నారు. అలాంటి సంఘటనే తాజాగా తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో వెలుగులోకి వచ్చింది. ఆరేళ్ళ క్రితం ఆపరేషన్ చేసి డెలివరీ చేసిన మహిళా డాక్టర్ కత్తెరను కడుపులోనే మర్చిపోయింది. దీంతో అప్పటి నుండి కత్తెర ఆ మహిళ […]
AP MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఒక్క ఎమ్మెల్సీ స్థానం కోసం అధికార పార్టీ వైసీపీ నానా తిప్పలు పడుతుంది. ఒకరికి ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి ఈ ఎమ్మెల్సీ స్థానం కోసం పెద్దఎత్తున సమావేశాలు నిర్వహించాల్సి వచ్చింది. ఉమ్మడి కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం చేయడం కోసం అధికార పార్టీ తెగ ఆయాస పడుతుంది. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి […]
Telangana TDP: తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే దిశగా టీడీపీ చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో రేపటి నుంచి ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ వెల్లడించారు. ఆ మధ్య ఖమ్మంలో టీడీపీ సభ తర్వాత తెలంగాణ టీడీపీలో కాస్త జోష్ కనిపించింది. అయితే, ఖమ్మం సభ తర్వాత సైలెంట్ అయిపోవడంతో పార్టీ పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. ఈక్రమంలోనే ఇకపై ఏదొక రీతిన ప్రజలలోకి వెళ్లాలని భావిస్తున్న తెలంగాణ […]