Kaburulu Telugu News
5
  • Ind Vs Aus: కుర్రాళ్లు కుమ్మేశారు.. ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం..
  • Raasi : రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర వదులుకున్నాను
  • testing purpose
  • notification testing
  • new test
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
    • Home » news

Jagtial Collector: కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదు.. ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌కు ఫిర్యాదు!

Jagtial Collector: కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదు.. ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌కు ఫిర్యాదు!

తాజా వార్తలు - February 27, 2023 | 11:22 PM

Jagtial Collector: బీర్లు ఎన్ని ఉన్నా.. కింగ్ ఫిషర్ బీర్ కిక్కే వేరంటారు మందు బాబులు. అంతలా బీర్లలో కింగ్ ఫిషర్ బీర్ రారాజుగా పిలుచుకుంటారు. అయితే, అలాంటి కింగ్ ఫిషర్ బీర్లు వైన్ షాప్స్ లో దొరకడం లేదు. దీంతో మా దగ్గర వైన్ షాప్ లో కింగ్ ఫిషర్ బీర్ దొరకడం లేదు సార్.. ఆ బీర్ కోసం రోజు 30 కిమీ దూరం వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తుంది. కాస్త ఈ సమస్యను పరిష్కరించండి […]

KTR: మెదడు మోకాళ్ళలో ఉందా.. అరికాళ్ళలో ఉందా.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కేటీఆర్ ధ్వజం!

KTR: మెదడు మోకాళ్ళలో ఉందా.. అరికాళ్ళలో ఉందా.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కేటీఆర్ ధ్వజం!

తాజా వార్తలు - February 27, 2023 | 10:21 PM

KTR: కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మెదడు మోకాళ్ళలో ఉందా.. లేక అరికాళ్లలో ఉందా అని రాష్ట్ర మంత్రి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ ఎంతో శ్రమపడి కరోనా వ్యాక్సిన్ కనిపెట్టాడని అంటున్నారని.. మరి శాస్త్రవేత్తలంతా గడ్డి కోశారా? ఇలాంటి వ్యాఖ్యలు చేసే కిషన్ రెడ్డిని ఏమనాలి? అని కేటీఆర్ మండిపడ్డారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో రూ.125 కోట్లతో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శంకుస్థాపనలు చేసిన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగించారు. […]

MLC Elections: మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ టీచర్‌ ఎమ్మెల్సీ బరిలో 21 మంది!

MLC Elections: మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ టీచర్‌ ఎమ్మెల్సీ బరిలో 21 మంది!

తాజా వార్తలు - February 27, 2023 | 10:06 PM

MLC Elections: మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నిక హోరాహోరీగా మారింది. గురువారం నామినేషన్ల ఘట్టం ముగియగా.. మొత్తం 21 నామినేషన్లు చెల్లుబాటైనట్టు అధికారులు శుక్రవారం ప్రకటించారు. అయితే, 27 వరకు ఉపసంహరణ గడువు ఉండడంతో భారీగానే విత్ డ్రాలు ఉంటాయని అనుకున్నారు. కానీ, అదేమీ జరగలేదు. ఊహించని విధంగా 21 మంది బరిలో నిలిచారు. బీజేపీ అభ్యర్థిగా ఏ వెంకట నారాయణరెడ్డి పోటీ చేస్తుండగా.. ప్రజావాణి పార్టీ తరపున ఎల్‌ వెంకటేశ్వర్లు బరిలో ఉన్నారు. ఇక 19 […]

Somu Veerraju: వివేకా కేసులో ఎవరినీ కాపాడేది లేదు.. సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు!

Somu Veerraju: వివేకా కేసులో ఎవరినీ కాపాడేది లేదు.. సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు!

తాజా వార్తలు - February 27, 2023 | 03:45 PM

Somu Veerraju: ఏపీలో ఇప్పుడు కాకరేపుతున్న టాపిక్ ఏదైనా ఉందంటే అది వైఎస్ వివేకా హత్యకేసు మాత్రమేనని చెప్పుకోవాలి. అధికార, ప్రతిపక్షాల నుండి ప్రభుత్వ వర్గాల వరకూ ఎక్కడ విన్నా ఈ హత్యకేసు పైనే చర్చలు జరుగుతున్నాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ ఎంపీ అవినాష్ రెడ్డిని, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని విచారణకి పిలవడం.. ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలకు దిగడం.. వైసీపీ నేతలు సీబీఐపై విమర్శలు, టీడీపీ నేతలపై విమర్శలు ఇలా ఎటు చూసినా […]

Anurag Thakur: మెగాస్టార్ ఇంటికి వచ్చిన కేంద్రమంత్రి.. నాగార్జున, అల్లు అరవింద్‌తో సమావేశం!

Anurag Thakur: మెగాస్టార్ ఇంటికి వచ్చిన కేంద్రమంత్రి.. నాగార్జున, అల్లు అరవింద్‌తో సమావేశం!

తాజా వార్తలు - February 27, 2023 | 01:27 PM

Anurag Thakur: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఆయన మెగాస్టార్ చిరంజీవితో భేటీ కావడం ఆసక్తిగా మారింది. హైదరాబాద్‌లోని చిరంజీవి నివాసానికి వెళ్లి మరీ అనురాగ్ ఠాకూర్ కాసేపు ముచ్చటించారు. చిరంజీవితో పాటు నాగార్జున, అల్లు అరవింద్‌లు కూడా చిరంజీవి నివాసానికి వెళ్లి అనురాగ్ ఠాకూర్‌‌ను కలిశారు. ఈ సందర్బంగా చిత్ర పరిశ్రమకు సంబంధించిన అంశాల గురించి వారితో కేంద్ర మంత్రి చర్చించారు. ముందుగా ఇంటికి వచ్చిన కేంద్ర […]

Halari Donkey: గాడిదకు సీమంతం.. గాడిద పిల్లకు బారసాల.. వీళ్ళు సంథింగ్ స్పెషల్ గురూ!

Halari Donkey: గాడిదకు సీమంతం.. గాడిద పిల్లకు బారసాల.. వీళ్ళు సంథింగ్ స్పెషల్ గురూ!

తాజా వార్తలు - February 27, 2023 | 12:54 PM

Halari Donkey: ఈ మధ్య మన దేశంలో పశువులు, జంతువుల పట్ల వైఖరి మారుతుంది. వాటిని పూజించడం, ప్రేమించడం ఎక్కువైంది. అందుకే గోమాతలకు సీమంతాలు, లేగదూడలకు బారసాలలు అప్పుడప్పుడు వార్తలు అవుతున్నాయి. అయితే.. వీళ్ళు ఇంకా స్పెషల్ అనిపించుకుంటున్నారు. గాడిద గర్భం దాల్చితే సీమంతం చేస్తారు.. గాడిదకు బిడ్డ పుడితే బారసాల చేస్తారు. గాడిదకు సంబంధించి ఏదైనా ఇక్కడ ప్రజలు సంబరాలు చేసుకుంటారు. గుజరాత్ లోని రాజ్ కోట్ లో గాడిదలకు సామూహిక సీమంతాలు చేశారు. ఇటీవలే […]

Medico Preethi: ప్రీతి మృతిపై ఏబీవీపీ ఆందోళన.. కేఎంసీ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. సైఫ్‌ ఉరి డిమాండ్!

Medico Preethi: ప్రీతి మృతిపై ఏబీవీపీ ఆందోళన.. కేఎంసీ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. సైఫ్‌ ఉరి డిమాండ్!

తాజా వార్తలు - February 27, 2023 | 12:28 PM

Medico Preethi: వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల అనస్తీషియా పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతి కన్ను మూసిన సంగతి తెలిసిందే. సీనియర్ల వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన ప్రీతి ఐదు రోజులు మృత్యువుతో పోరాడి ప్రాణాలు కోల్పోయింది. ప్రీతిని కాపాడడం కోసం ప్రత్యేక వైద్య బృందం అన్ని విధాలుగా ప్రయత్నం చేసినప్పటికీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ తో ఫలితం లేకపోయింది. ప్రీతీ మృతితో ఆదివారం రాత్రి నిమ్స్ హాస్పటల్ వద్ద హై డ్రామా చోటు చేసుకుంది. కాగా, ప్రీతి మృతికి […]

West Bengal: టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్‌కు వెళ్తున్న బాలిక.. ట్రాఫిక్ ఫ్రీ గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసిన పోలీసులు

West Bengal: టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్‌కు వెళ్తున్న బాలిక.. ట్రాఫిక్ ఫ్రీ గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసిన పోలీసులు

తాజా వార్తలు - February 27, 2023 | 11:37 AM

West Bengal: పోలీసులంటే మన సమాజంలో ఒక రకమైన భావన ఉంటుంది. పోలీసులంటే కొడతారు.. తిడతారు.. అనవసర కేసులలో ఇరికించి హింస పెడతారని చాలామంది అనుకుంటుంటారు. అయితే, పోలీసులలో కూడా మంచి వారు, మానవత్వం ఉన్నవాళ్లు ఎందరో ఉన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకొని మేమున్నామంటూ ముందుకొచ్చిన ఎంతోమంది పోలీసులను ఇప్పటికే చూశాం. కాగా.. ఇప్పుడు మనం చెప్పుకొనే పోలీస్ కూడా ఆ కోవకి చెందిన వ్యక్తే. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా బ్రిడ్జ్ సమీపంలో ఓ బాలిక […]

Medico Preethi: పోరాడి ఓడిన మెడికో ప్రీతి.. రూ.30 లక్షల పరిహారం.. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం

Medico Preethi: పోరాడి ఓడిన మెడికో ప్రీతి.. రూ.30 లక్షల పరిహారం.. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం

తాజా వార్తలు - February 27, 2023 | 09:14 AM

Medico Preethi: వైద్య విద్యార్థిని ప్రీతి మృత్యువుతో పోరాడి ఓడింది. ఐదు రోజులుగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 9.10 గంటలకు కన్నుమూసింది. సీనియర్ విద్యార్థి వేధింపులు తట్టుకోలేక పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి వరంగల్ ఎంజిఎంలో ఆత్మహత్యకు యత్నించిన సంగతి తెలిసిందే. ముందుగా ఎంజీఎంలో చికిత్స అందించగా అక్కడ నుండి హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స అందించారు. అయితే, ప్రీతి ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుదిశ్వాస విడిచినట్లు నిమ్స్ వైద్యులు ప్రకటించారు. వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో […]

NCESS Research: 410 కోట్ల ఏండ్ల నాటి శిలలు.. హైదరాబాద్‌కు 100 కిమీ దూరంలో గుర్తింపు!

NCESS Research: 410 కోట్ల ఏండ్ల నాటి శిలలు.. హైదరాబాద్‌కు 100 కిమీ దూరంలో గుర్తింపు!

తాజా వార్తలు - February 27, 2023 | 08:49 AM

NCESS Research: మరో అరుదైన.. పురాతన కాలం నాటి శిలలు బయటపడ్డాయి. అది కూడా ఎలాంటి కఠిన వాతావరణంలోనైనా చెక్కుచెదరని ఖనిజ లవణం జిర్కోన్ శిలలు కావడం దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలోని చిత్రియాల్ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో కొన్ని అత్యంత అరుదైన శిలలను వెలికితీశారు. ఇవి 410 కోట్ల సంవత్సరాల నాటివని గుర్తించారు. ఆ శిలల వయసు రీత్యా భూమి ఏర్పడిన తొలినాళ్ల నాటివని భావిస్తున్నారు. కోల్ కతాకు చెందిన ప్రెసిడెన్సీ యూనివర్సిటీ, నేషనల్ సెంటర్ […]

← 1 … 29 30 31 32 33 … 77 →

Latest News

  • Ind Vs Aus: కుర్రాళ్లు కుమ్మేశారు.. ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం..
  • Raasi : రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర వదులుకున్నాను
  • testing purpose
  • notification testing
  • new test

© 2022. Kaburulu AboutContactPrivacy PolicyDisclaimer