Home » news
Alluri District: మారోమూల అటవీ ప్రాంతాల్లో ఎన్ని ఘటనలు జరుగుతున్నా అధికారులలో ఎలాంటి చలనం లేదు. సకాలంలో వైద్యం అందక గర్భిణీలకు తల్లిబిడ్డల ప్రాణాలు కోల్పోతున్నా.. అధికారులు మాత్రం కన్నెత్తి చూడడం లేదు. పాపం ఆ అమాయక గిరిజనుల తలరాతలు ఎన్నటికీ మారడం లేదు. మా గ్రామానికి రోడ్డు మార్గం కల్పించండి మహాప్రభో అంటూ వేడుకున్నా.. అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. గిరిజన తండాలలో ఎవరికైనా రోగమొస్తే వాళ్ళని మంచాలపై మోసుకొని ఆసుపత్రులకు వెళ్లాల్సిందే. అదే […]
Uttar Pradesh: పండగలకి పబ్బాలకి, ఇయర్ ఎండింగ్, కొత్తగా షాప్ ఓపెనింగ్ సమయంలో మొబైల్ ఫోన్లపై భారీ తగ్గింపులు, ఆఫర్లు ఇస్తుంటారు. క్లియెరెన్స్ సేల్స్ అని కూడా ఈ కామర్స్ సైట్స్ బంపర్ ఆఫర్లు ప్రకటిస్తుంటారు. అయితే, ఇవేమీ కాకుండా ఓ మొబైల్ షాప్ యజమాని బిజినెస్ పెంచుకోవడం కోసం.. పబ్లిసిటీ కోసం విచిత్రమైన అఫర్ ఒకటి పెట్టాడు. తన షాప్ లో స్మార్ట్ ఫోన్ కొంటే రెండు బీర్లు ఫ్రీ అని ఆఫర్ పెట్టాడు. బీర్లంటే […]
Telangana Women’s Day Awards: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మహిళలకు కానుకలు అందిస్తున్నది. ఇప్పటికే మార్చి 8వ తేదీన సాధారణ సెలవుగా ప్రకటించిన ప్రభుత్వం.. అదే రోజు దాదాపు రూ.750 కోట్ల రుణాలు స్వయం సహాయక సంఘాలకు అందించనుంది. ఇక మహిళలను సత్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. ఈ తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాలకు 27మందిని ఎంపిక చేసింది. ఈమేరకు సీఎస్ […]
TCongress: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నల్గొండ కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్ కొడుకు సుహాస్ ను బెదిరించిన వ్యవహారంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఈ కేసు నమోదు అయింది. తనను చంపుతానని కోమటిరెడ్డి వార్నింగ్ ఇచ్చారని సుహాస్ ఫిర్యాదు చేయడంతో ఏపీసి 506 సెక్షన్ కింద ఎంపీపై నల్గొండ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. చెరుకు సుధాకర్ రెడ్డిని చంపేస్తామంటూ ఎంపీ కోమటిరెడ్డి మాట్లాడినట్లుగా సోషల్ మీడియాలో […]
Strange Baby: వింత వింత ఆకారాలు, అవసరానికి మించి అవయవాలు, అవిభక్త కవలలు జన్మించడం చూశాం. అయితే.. రెండు గుండెలతో శిశువులు జన్మించడం మాత్రం చాలా అరుదు. రాజస్థాన్‌లోని చురూ జిల్లాలో అదే జరిగింది. రెండు గుండెలు, నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో శిశువు జన్మించింది. అయితే, శిశువు పుట్టిన ఇరవై నిమిషాలకే మరణించింది. రతన్‌గఢ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 19 ఏళ్ల గర్భిణి రెండు గుండెలు.. నాలుగు చేతులు, నాలుగు కాళ్లు ఉన్న చిన్నారికి జన్మనిచ్చింది. […]
Vangaverti Radha-Nara Lokesh: టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఓ కీలక భేటీ ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచింది. నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర ప్రస్తుతం అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. అయితే, ఈ యాత్రలో నేడు వంగవీటి రాధా పాల్గొని లోకేష్ తో కలిసి నడిచారు. అంతకుముందు లోకేష్ విడిది చేసిన ప్రాంతానికి చేరుకున్న వంగవీటి.. లోకేష్ తో ప్రత్యేకంగా భేటీ కూడా అయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై […]
Hyderabad: పెట్రోల్ బంకులో బైకుకు పెట్రోల్ నింపుకున్న ముగ్గురు కుర్రాళ్ళు కార్డు స్వైప్ చేయమని ఇచ్చారు. అయితే, పెట్రోల్ పంపులో స్వైప్ మిషన్ పనిచేయలేదు. దీంతో పెట్రోల్ పంపు బాయ్.. తమ యజమాని తమని తిడతారని.. డబ్బులు ఇవ్వాల్సిందిగా అడగడంతో ముగ్గురు కుర్రాళ్ళు ఆగ్రహించి పిడిగుద్దులు గుద్దారు. మిగతా బాయ్స్, మిగతా వాహన యజమానులు పెట్రోల్ బాయ్ ని హాస్పటిల్ కి తరలిస్తుండగానే బాయ్ మృతిచెందాడు. రంగారెడ్డిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. హెచ్పీ పెట్రోల్ బంక్ […]
Tiger Cubes: తల్లి నుంచి విడిపోయి దారితప్పిన నాలుగు పెద్ద పులి పిల్లలు గ్రామంలోకి వచ్చేశాయి. ముళ్ల పొదల నుండి శబ్దాలు రావడంతో ఓ యువకుడు వెళ్లి చూడగా పులి కూనలు కనిపించాయి. శునకాలు వాటిని చూస్తే చంపేస్తాయని భావించిన గ్రామస్థులు పులి పిల్లలను పట్టుకుని తీసుకెళ్లి ఓ గదిలో బంధించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురం గ్రామ శివారులో జరిగిందీ ఘటన. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న […]
CM KCR: వసంత రుతువుకు నాందీ ప్రస్తావనగా, పచ్చని చిగురులతో కొత్తదనం సంతరించుకుని, వినూత్నంగా పున:ప్రారంభమయ్యే ప్రకృతి కాలచక్రానికి హోళీ పండుగ స్వాగతం పలుకుతుందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. చిగురించే ఆశలతో తమ జీవితాల్లోకి నూతనత్వాన్ని హోళీ రూపంలో స్వాగతం పలికే భారతీయ సాంప్రదాయం రమణీయమైనదన్నారు. రాష్ట్ర, దేశ ప్రజలందరికీ సిఎం కేసీఆర్ హోళీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. పల్లెలన్నీ వెన్నెల నవరాత్రుల్లో సాగే చిన్నారుల జాజిరి ఆటా పాటలతో, కోలాటాల చప్పుల్లతో హోళీ ఉత్తేజం […]
Anantapur: అనంతపురం పట్టణంలోని క్లాక్ టవర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ, టీడీపీ మద్దతుదారులు విసురుకున్న సవాళ్లు, ప్రతి సవాళ్ల కారణంగా ఇక్కడ హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. గత కొన్ని రోజుల నుంచి వైసీపీ, టీడీపీ సోషల్ మీడియా ఫాలోవర్ల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ మద్దతుదారుడు హరికృష్ణారెడ్డి, కృష్ణా జిల్లాకు చెందిన అజయ్ ల మధ్య ఓ రేంజ్ లో మాటల యుద్ధం సాగింది. వీరిద్దరు సోషల్ మీడియా […]