Home » news
Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో తర్వాత అరెస్ట్ అయ్యేది ఎవరు? సీబీఐ ఏ దిశగా ఈ స్కాములో విచారణ చేస్తుంది? ఈ స్కాంలో మనీలాండరింగ్ అధరాలు ఏమైనా దొరికాయా? ఈ కేసులో సీబీఐ విచారణ ఇప్పుడు ఎవరి చుట్టూ తిరగనుంది? ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా చర్చకు దారితీస్తున్న అంశం. అయితే, ఈ కేసు గురించి అవగాహన ఉన్న వాళ్ళు, సీబీఐ విచారణ సాగుతున్న తీరును చూస్తే తెలంగాణ సీఎం కుమార్తె కవితను అరెస్ట్ […]
Ambati Rambabu: పోలవరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం తీసుకున్న తొందరపాటు నిర్ణయాల వలనే ఇప్పుడు మరమత్తులు చేస్తూ ఆలస్యమవుతుందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి అబంటి రాంబాబు.. అనంతరం మాట్లాడుతూ ఈ సీజన్ లో పోలవరానికి సంబంధించిన పనులు వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు. వచ్చే నాలుగు నెలలు ప్రాజెక్టుకు ఎంతో కీలకమని వ్యాఖ్యానించిన అంబటి గత ప్రభుత్వం తొందరపాటు వల్లనే ఇప్పుడు ఇంత […]
American Airlines: ఇటీవల న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానంలో శంకర్ మిశ్రా అనే ఓ ప్రయాణికుడు తాగినమైకంలో ఓ ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) కఠిన మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే రిపీట్ అయింది. మళ్లీ న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు పక్కన కూర్చున్న ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. శుక్రవారం రాత్రి […]
Wine Shops Close: మందుబాబులకు తెలంగాణ సర్కార్ బాడ్ న్యూస్ చెప్పింది. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది. హోలీ పండుగ నేపథ్యంలో సాధారణ ప్రజలకు ఇబ్బందులు ఏర్పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మార్చి 6న సాయంత్రం 6 గంటల నుంచి మార్చి 8వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ఈ నేపథ్యంలో జంట నగరాల పరిధిలోని మద్యం దుకాణాలు, బార్లు […]
Viveka Murder Case: వివేకా హత్య కేసులో దూకుడు పెంచిన సీబీఐ తగ్గేదేలే అన్నట్లు దూసుకెళ్తుంది. ఇప్పటికే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని రెండుసార్లు విచారించిన సీబీఐ అధికారులు మూడో సారి విచారణకి కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఈ నెల 6న హైదరాబద్ సీబీఐ కార్యాలయంలో విచారణకు హజరు కావాలని రెండు రోజుల క్రిందట సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఎంపి అవినాష్ తో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని కూడా విచారణకు […]
Congress Party: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, వర్గపోరు ఏ మాత్రం తగ్గడం లేదు. ఒకపక్క పార్టీ పరిస్థితి పూర్తిగా దిగజారిపోతున్నా.. పార్టీ నేతల మధ్య సఖ్యత మాత్రం కుదరడం లేదు. ఒకవైపు పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రతో పార్టీకి అంతోఇంతో ఊపు తేవాలని ప్రయత్నాలు జరుగుతున్నా.. పార్టీ మిగతా సీనియర్లు ఎవరూ ఆ వైపు చూడడం లేదు. పైగా ఇప్పుడు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆడియోగా ఒక ఆడియో వైరల్ అవుతుంది. […]
Varupula Raja: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు టీడీపీ ఇన్‌చార్జి వరుపుల రాజా (46) హఠాన్మరణం చెందారు. శనివారం రాత్రి 9 గంటలకు గుండెపోటు రావడంతో హుటాహుటిన కాకినాడలో సూర్య గ్లోబల్ ఆసుపత్రికి ఆయన్ని తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో స్థానిక అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించినా ప్రయోజనం లేకపోవడంతో అర్ధరాత్రి 11 గంటలకు రాజా మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కాగా, వరుపుల రాజాకు ఐదేళ్ల కిందట ఒకసారి గుండెపోటు రాగా.. అప్పట్లో […]
Summer 2023: రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. వేసవి ప్రారంభంలోనే, మార్చి నెల తొలి వారం నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. మధ్యాహ్నం వేళల్లో భగభగ మండుతున్న ఎండల్ని చూసి ప్రజలు ఇళ్లల్లోంచి బయటికి వచ్చేందుకే భయపడుతున్నారు. భానుడి ప్రతాపానికి జనం బెంబేలెత్తిపోతున్నారు. తెలుగు రాష్ట్రాలలో పలుచోట్ల సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో సామాన్య ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ ఏడాది మార్చిలోనే ఎండలు ఇలా దంచి కొడుతుంటే మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన […]
Medico Preeti Suicide Case: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ ఫస్ట్ ఇయర్ పీజీ విద్యార్థిని ప్రీతిది హత్యా? లేక ఆత్మహత్యా?. పోలీసులు ఏం నిర్ధారించుకున్నారు. మెడికో ప్రీతీ పాయిజన్ ఇంజక్షన్ తీసుకొని చనిపోయినట్లు పోలీసులు ప్రాధమిక విచారణలో నిర్ధారించగా.. వేధించిన సీనియర్ సైఫ్ ప్రీతీకి పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చి చంపేశాడని ప్రీతీ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ప్రీతి మృతి కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ప్రీతిది ఆత్మహత్యాయత్నం కాదని, సైఫ్ హత్య చేశాడంటూ తల్లిదండ్రులు […]
Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో ఓ రోడ్డుపై రూ.500 నోట్ల వర్షం కురిసింది. ప్రయాణిస్తున్న ఆటో నుండి రూ.500 నోట్ల కట్టలు కిందపడిపోగా.. ఆటోలో వెళ్తున్న వారు పట్టీపట్టనట్లు, ఏమీ ఎరగనట్లు వెళ్లిపోయారు. ఆటో వెనక అదే రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు కొందరు ఆ కింద పడిన నోట్లను ఏరుకోగా.. దగ్గరలోని టోల్ గేట్ సిబ్బంది మరి కొన్ని నోట్లను సేకరించారు. శ్రీకాకుళం జిల్లాలో ఈ ఘటన సంచలనం సృష్టించింది. పూర్తివివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం రాత్రి శ్రీకాకుళం వైపు […]