Home » news
TCongress: సీఎం కేసీఆర్ కుమార్తె.. ఎమ్మెల్సీ కవితకి ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ సమన్ల విషయం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష బీజేపీ ఇప్పటికే ఈ అంశంలో కవితను టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు చేస్తుండగా.. కాంగ్రెస్ నేతలందరూ మౌనంగానే ఉన్నారు. తాజాగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మీడియా ప్రతినిధులు కవిత అంశంపై ప్రశ్నించినా.. ఈ అంశంలో స్పందించాల్సి నేను కాదు రేవంత్ రెడ్డి అంటూ తప్పించుకున్నారు. కవితకు ఈడీ నోటీసులు […]
Annavaram Temple: హిందూ ఆలయాలకి వచ్చే భక్తులు, ముఖ్యంగా యువత ఎలా పడితే అలా వస్తున్నారు. జీన్స్ లు, టీ షర్ట్స్ ధరించి కూడా దేవుని సందర్శనకు వస్తున్నారు. వీరిలో యువతులు కూడా టీ షర్ట్స్, ప్యాంట్స్ ధరించి రావడంతో ఆలయ పవిత్రత కోల్పోతుంది. వీరందరినీ దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు దేవాలయాలలో సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఆలయాల్లో ఈ నిబంధన కొనసాగుతుండగా.. తాజాగా అన్నవరంలో కూడా పక్కాగా అమలు చేయనున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం […]
TDP-Leftists: ఏపీలో ఇంకా ఎన్నికలకు ఏడాది పైగా సమయం ఉండగా.. ఈసారి పొత్తులు ఎలా ఉంటాయని వాడీ వేడీ చర్చలు సాగుతూనే ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సార్వత్రిక ఎన్నికలలో జనసేనతో పొత్తు దాదాపుగా ఖరారైన సంగతి తెలిసిందే. అధికారికంగా ప్రకటనలు రాకపోయినా ఈ చెలిమి ఖాయమేనని ఇరువర్గాలు అనధికారికంగా ప్రకటించాయి. కాగా, ఈలోగానే ఎమ్మెల్సీ ఎన్నికలు రానే వచ్చాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం టీడీపీ వామపక్షాలతో చెలిమి చేస్తుంది. ఏపీలో ప్రస్తుతం ఐదు ఎమ్మెల్సీ […]
Paragliding Gone Wrong: మేఘాలను తాకేలా పారాగ్లైడింగ్ చేయడం అంటే కొంతమందికి అదొక సరదా. పక్షిలా గాల్లో ఎగురుతూ భూమిని చూస్తూ తమని తాము మర్చిపోతుంటారు. అయితే, ఇలాంటి అడ్వెంచర్స్ చేసేప్పుడు ఏ మాత్రం పట్టుతప్పినా ప్రాణాలు కూడా గాల్లోనే కలిసిపోతాయి. అప్పుడప్పుడు పారాగ్లైడింగ్ ఫెయిల్ అయి ఎక్కడెక్కడో బిల్డింగులు మీద స్పైడర్ మ్యాన్ లాగా ఇరుక్కుపోతుంటారు. కేరళలో కూడా తాజాగా అలాగే జరిగింది. కేరళ బీచ్ వెకేషన్‌కు వెళ్లిన ఓ జంట పారాగ్లైడింగ్ అడ్వెంచర్ చేశారు. […]
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంచలనం రేపుతోంది. ఇప్పటికే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియాతో పాటు పలువురు ప్రముఖులు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. మొత్తం 11మందిని ఈ కేసులో ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ కేసులో కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుట్ల కవితకు ఈడీ నోటీసులు జారీచేసింది. విచారణ కోసం కవిత రేపు గురువారం ఢిల్లీ రావాలని ఈడీ నోటీసులో పేర్కొంది. అయితే చట్టసభల్లో మహిళా […]
Bandi Sanjay: తెలంగాణలో వాహనాలపై ట్రాఫిక్ చలానాలు డెత్ పెనాల్టీగా మారాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటు విమర్శలు చేశారు. ట్రాఫిక్ చలాన్లు చెల్లించలేక సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కార్మికుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. చింతల్ బస్తీ ప్రాంతంలో నివాసం ఉండే 52 ఏళ్ల ఎల్లయ్య రోజువారి కూలీ […]
AP Police: హవాలా డబ్బు తరలిస్తున్న కేరళ రాష్ట్రానికి చెందిన దోపిడీ గ్యాంగ్ ను అనంతపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్ నుండి బెంగళూరు తరలిస్తుండగా అనంతపూర్ జిల్లా వద్ద హైవే పైనే సోదాలు నిర్వహించి పోలీసులు నలుగురు కేరళ వ్యక్తులను అరెస్ట్ చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు. హవాలా డబ్బు తరలింపు కోసం ఉపయోగించిన వాహనాన్ని కూడా సీజ్ చేశారు. అనంతపురం జిల్లా రాప్తాడు హైవేపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. అలాగే ఓ […]
YSRTP: రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ట్యాంక్ బండ్ రోడ్డుపై దీక్షకు దిగిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మంగళవారం మహిళా దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్‌పై రాణి రుద్రమ, చాకలి ఐలమ్మ విగ్రహాలకు నివాళి అర్పించారు. అనంతరం రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ట్యాంక్ బండ్ రోడ్డుపై దీక్షకు దిగారు. తొలుత విగ్రహానికి నివాళులర్పించిన […]
Heart Attack: ఈ మధ్య కాలంలో గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఎప్పుడు ఎవరిని మట్టుబెడుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు వయస్సు పైబడిన వారికి, అతిగా లావుగా ఉన్నవారికి మాత్రమే వస్తుందని అనుకునేవారు. కానీ, ఇప్పుడు ఈ మహమ్మారి అంచనాలను తలకిందులు చేస్తోంది. చిన్న పిల్లలకు, యువకులకు ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్లు, నిలబడిన వారు నిలబడిన వారు నిలబడే కూలిపోతున్న ఘటనలు రోజూ పేపర్లలో, […]
Earthquake: భూకంపం.. ఈ మాట వింటే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రజల వెన్నులో వణుకు పడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో భూకంపాలు భారీ విధ్వంసాన్ని సృష్టించాయి.. టర్కీలో సంభవించిన భూకంపంతో భారీ ఆస్తి, ప్రాణనష్టం జరిగింది. ఆ తర్వాత వరుసగా భూకంపాలు వస్తూనే ఉన్నాయి. టర్కీలో భూకంపం తర్వాత భారత్‌లోనూ పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. సోమవారమే ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో కూడా భూమి కంపించింది. జిల్లాలోని తుగ్గలి మండలం రాతనలో ఒక్కసారిగా భూ […]