Home » news
Gudivada Amarnath: పవన్ కళ్యాణ్‌ది జనసేన కాదు కమ్మసేన అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర విమర్శలు చేశారు. ఏ ఉద్దేశంతో తాజాగా సభను పెట్టారో పవన్ కే తెలియదని ఎద్దేవా చేసిన అమర్నాథ్.. జెండా పవన్ ది.. అజెండా తెలుగుదేశం పార్టీదని విమర్శించారు. 175కి 175 స్థానాల్లో పోటీ చేసే ధైర్యం పవన్ కు లేదని.. జనసేనకు రాజకీయ సిద్ధాంతమే లేదని అన్నారు. భారత్ కు స్వాతంత్రం […]
Vemula Prashanth Reddy: టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ గా మారిన అనంతరం ఏపీలో కూడా పాగా వేస్తారని.. ఏపీలో కూడా బీఆర్ఎస్ పార్టీకి భారీ వలసలు ఉంటాయని భావించిన సంగతి తెలిసిందే. అయితే, ఏమైందో ఏమో కానీ కేసీఆర్ అండ్ కో ఏపీలో పార్టీ కార్యకలాపాలపై కాస్త ఆలోచనలో పడ్డట్లు కనిపించింది. ఏపీలో బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలు కూడా కనిపించడం లేదు. తెలంగాణ బీఆర్ఎస్ నేతలు కూడా ఈ మధ్య ఏపీ గురించి వ్యాఖ్యలు కూడా చేయడం […]
AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. మంగళవారం బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా.. రెండో రోజే సభలో నిరసనలు, ఆందోళనలకు, సస్పెన్షన్స్ చోటుచేసుకున్నాయి. టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీరియస్ అయ్యారు. గవర్నర్ విషయంలో కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ.. 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశారు. సభా సమయం వృథా చేశారంటూ పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడును సభ నుంచి సస్పెండ్ చేయాలని బుగ్గన తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. స్పీకర్ […]
TCongress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గురించి.. ఆ పార్టీ నేతల గురించి.. వారి మధ్య ఏకాభిప్రాయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే.. అది పాజిటివ్ గా కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే కుమ్ములాటలు. తెలంగాణ కాంగ్రెస్ లో అయితే అది తారాస్థాయిలో ఉంటుంది. అందుకే పార్టీ పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఎలాగోలా తిరిగి పార్టీని గాడిన పెట్టాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ పాదయాత్ర చేస్తుండగా.. దానికి మిగతా నేతల నుండి ఆదరణ కరువైంది. రేవంత్ […]
Anam Ramanarayana Reddy: వైసీపీ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, నెల్లూరు జిల్లాలో కీలక నేతగా ఉన్న ఆనం రాంనారాయణ రెడ్డి కొద్ది రోజులుగా వైసీపీ అధిష్టానంపై కీలక వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆనం హాజరయ్యే బహిరంగ సభలపైనే సీఎం జగన్ మోహన్ రెడ్డితో పాటు వైసీపీ పార్టీపై విమర్శలు చేశారు. దీంతో ఆ మధ్యనే ఆయనపై అధిష్టానం వేటు వేసింది. ఆయనను వెంకటగిరి నియోజకవర్గ వైకాపా ఇంచార్జి బాధ్యతల నుంచి తొలగించి […]
Telangana BJP: సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమీషన్ కూడా బండి సంజయ్ కు నోటీసులు ఇవ్వగా.. బీఆర్ఎస్ నేతలు, రాష్ట్ర మహిళా సంఘాలు కూడా బండి వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతున్నారు. బీఆర్ఎస్ నేతలే కాదు బండి వ్యాఖ్యలు సొంత పార్టీ బీజేపీ నేతలు కూడా తప్పుబడుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ […]
Viveka Murder Case: హాజరవలేనని చెప్పినా సీబీఐ మినహాయింపు ఇవ్వకపోవడంతో వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఎంపీ వైఎస్ అవినాష్ మరోసారి సీబీఐ విచారణకు హాజరవ్వాల్సి వచ్చింది. ఈ కేసులో ఇప్పటికే ఎంపీ అవినాష్ మూడు సార్లు విచారణకి హాజరవగా ఇది నాల్గవసారి. గతంలో జనవరి 28, ఫిబ్రవరి 24, మార్చి 10న అవినాష్‌రెడ్డిని విచారించిన సీబీఐ అధికారులు.. ఈరోజు ఉదయం నుండి విచారిస్తున్నారు. ప్రస్తుతం సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్ నేతృత్వంలో అధికారులు అవినాష్‌ను విచారిస్తున్నారు. ఎంపీ అవినాష్ […]
YSRTP: వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిలను ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ‘చలో పార్లమెంట్’ ర్యాలీకి అనుమతి లేదంటూ షర్మిలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని, దీనిపై విచారణ జరపాలంటూ షర్మిల ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ఈ రోజు పార్టీ శ్రేణులతో కలిసి ధర్నా చేశారు. ముందుగా అక్కడ మీడియాతో మాట్లాడిన షర్మిల.. తర్వాత జంతర్ […]
Janasena Party: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నేడు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. ఆయన ఏపీ గవర్నర్ గా నియమితులైన తర్వాత తొలిసారి పవన్ కల్యాణ్ ఆయనను రాజ్‌భవన్ కు వెళ్లి కలిసి అభినందనలు తెలిపారు. పవన్ కల్యాణ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను మర్యాదపూర్వకంగా మాతమ్రే కలిశారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు గవర్న ర్ తో పవన్ అపాయింట్‌మెంట్ దొరకడంతో ఆయన సాయంత్రం రాజ్‌భవన్ […]
Bandi Sanjay: ఈ నెల 15వ తేదీ ఉదయం 11 గంటలకు మహిళా కమిషన్ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను బండి సంజయ్‌కుమార్‌కు రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్సీ కవితపై సంజయ్ వ్యాఖ్యలను మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. సంజయ్ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ విచారణ చేపట్టింది. ఈ నెల 8వ తేదీన […]