Home » news
Weather Update: దంచికొడుతున్న ఎండల ప్రభావంతో అల్లాడిపోతున్న ప్రజలకు చిరుజల్లులు కాస్త ఉపశమనం కలిగించాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వాతావరణం పూర్తిగా మారిపోయింది. కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు.. ఇంకా కొన్ని చోట్ల భారీ వర్షలు కురుస్తున్నాయి. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అయితే ఈ రోజు వడగళ్లవానతో భారీ నష్టం వాటిల్లింది. హైదదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవగా.. కొన్ని జిల్లాల్లో వడగళ్లవాన పడింది. కాగా, ఏపీలో కూడా మరో […]
UK bans TikTok: టిక్ టాక్.. ఈ షార్ట్ వీడియో ఎంటర్టైనింగ్ యాప్ గురించి నెటిజెన్స్ కి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా టిక్ టాక్ సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. ఒకప్పుడు భారత్ లో సెన్సేషన్ సృష్టించిన మోస్ట్ ఎంటర్టైనింగ్ యాప్ లో టిక్ టాక్ మొదటి వరుసలో ఉంటుందనే చెప్పాలి. భారత్ లోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలంలోనే నెటిజన్స్ దృష్టిని తన వైపుకు తిప్పుకొని సరికొత్త ఎంటర్టైన్మెంట్ అందించింది. […]
Telanagan MLC Elections: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో మూడు సీట్లు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం నాలుగు నామినేషన్లు దాఖలు కాగా అందులో ఇండిపెండెట్ అభ్యర్థి పాలమూరి కమల నామినేషన్ ను ఎన్నికల అధికారి తిరస్కరించారు. గురువారం సాయంత్రం 4 గంటలకు అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. అప్పట్లోగా బరిలో ముగ్గురు బీఆర్ఎస్ అభ్యర్థులు మాత్రమే ఉండటంతో ఆ ముగ్గురు […]
Shamshabad: తెలంగాణలో మరో దారుణం జరిగింది. మహిళలపై అఘాత్యాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని కఠిన చట్టాలను తీసుకువచ్చినా ఫలితం లేకుండా పోతోంది. కామంతో కళ్ళు మూసుకుపోయిన దుర్మార్గులు చిన్న, పెద్ద తేడా లేకుండా, వావి వరసలు చూడకుండా అత్యాచారాలకు పాల్పడుతూ మహిళల జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఒక రకంగా మనుషుల కంటే క్రూర మృగాలే నయం అనిపిస్తుంది. జంతువుల కంటే దారుణంగా కొంతమంది దుర్మార్గులు చెలరేగిపోతున్నారు. రెండు, మూడు ఏళ్ల చిన్నారుల నుండి 50, 60 […]
Delhi Liquor Scam: ఈ నెల 20న సోమవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాల్సిందేనని ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈనెల 11న కవితను విచారించిన ఈడీ అధికారులు 16న మళ్లీ విచారణకు హాజరవ్వాలని నోటీసులు ఇచ్చారు. అయితే అనారోగ్య కారణాల వల్ల రాలేనని కవిత ఈడీకి లేఖ రాసినా గురువారం మధ్యాహ్నం వరకు ఈడీ నుండి స్పందన లేదు. ఈ నేపథ్యంలో ఈడీ విచారణ వ్యవహారంలో కొంత […]
Weather Update: తెలంగాణ రాజధాని హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. అది కూడా ఉరుములు మెరుపులతో కూడిన వాన పడుతుంది. మరికొన్ని చోట్ల వడగళ్ల వాన కురుస్తుంది. హైదరాబాద్ లోని ఎల్బీనగర్, నాగోల్, వనస్థలిపురం, లంగర్‌హౌజ్, రాజేంద్రనగర్, అత్తాపూర్, ఆరాంఘర్‌లో వర్షం కురుస్తుండగా.. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సంగారెడ్డి, వికారాబాద్, జహీరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో వడగళ్ల వాన దంచికొడుతోంది. […]
CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఈరోజు సాయంత్రం ఆయన ఢిల్లీకి వెళ్లే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్లమెంటు సమావేశాలు జరుగుతుండటంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు మరికొందరు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశముందని తెలిసింది. గురువారం రాత్రి 7:30 గంటలకు సీఎం జగన్ హస్తినకు పయనం కానున్నారు. అయితే, ఓవైపు నేడు రాష్ట్ర […]
Myanmar Military: మయన్మార్‌లో మరోసారి మారణకాండ జరిగింది. మయన్మార్ సైన్యానికి, తిరుగుబాటుదారులకు మధ్య భీకర పోరు జరిగింది. ఈ ఘటనలో 29 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో ముగ్గురు సన్యాసులు కూడా ఉన్నారు. దక్షిణ షాన్ రాష్ట్రంలోని ఓ ఆశ్రమంలో శనివారం రోజున సైన్యం మద్దతు గల జుంటాకు, తిరుగుబాటుదారులకు మధ్య కాల్పులు జరిగిన ఘటన ఆలస్యంగా ప్రపంచం దృష్టికి వచ్చింది. శనివారం ఈ ఘటన జరిగినట్లు మయన్మార్ అధికారులు తాజాగా ప్రకటించారు. ఈ ఘటనలో అనేక […]
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇవాళ విచారణకు రాలేనని తన ప్రతినిధిని ఈడీ ఆఫీస్‌కు పంపారు కవిత. కవిత హాజరుకాకపోవడంపై న్యాయవాది సోమా భరత్ ఈడీకి వివరాలు తెలిపారు. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉందని.. ఈడీ విచారణకు హాజరుకాలేనని న్యాయవాదుల ద్వారా ఈడీకి సమాచారం పంపారు కవిత. అనారోగ్య కారణాలు కూడా ఉండడంతో మరోరోజు విచారణ తేదీ నిర్ణయించాలని కవిత అభ్యర్థన […]
AP Assembly Sessions: ఏపీలో ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే మిగిలి ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో కీలక బడ్జెట్ అసెంబ్లీ ముందుకు వస్తోంది. జగన్ ప్రభుత్వం ఈ విడతలో చివరి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెడుతోంది. ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ రోజు అసెంబ్లీలో 2023-24 బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుండగా.. వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. ఇక శాసనమండలిలో […]