Home » news
Ramdev: అల్లోపతి ఓ పనికిమాలిన వైద్యం అంటూ యోగాగురు రాందేవ్ బాబా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనా టీకా ఓ ఫెయిల్యూర్ అంటూ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాందేవ్ బాబా మళ్లీ అదే వ్యాఖ్యలు చేశారు. ఈసారి కూడా అల్లోపతి వైద్యాన్ని తీవ్రంగా విమర్శించారు. అల్లోపతిని భూమిలో పాతిపెట్టాలని వ్యాఖ్యానించారు. ఇంగ్లీష్ మెడిసిన్స్ వల్ల ప్రజలు మరింత అనారోగ్యానికి గురవుతున్నారని చెప్పుకొచ్చారు. ఉత్తరాఖండ్ హరిద్వార్‌లోని రిషికుల్ ఆయుర్వేద కాలేజీలో నిర్వహించిన ఓ సెమినార్‌లో మాట్లాడారు. […]
Hyderabad: సమాజంలో పది మందికి న్యాయం చెప్పాల్సిన ఉద్యోగంలో ఉన్న కానిస్టేబుల్ కి దుర్భుద్ధి పుట్టింది. భార్య గర్భిణీ కావడంతో పుట్టింటికి పంపి సహోద్యోగి, లేడీ కానిస్టేబుల్ తో ప్రేమాయణం మొదలు పెట్టాడు. విషయం తెలుసుకున్న భార్య పలుమార్లు భర్తను హెచ్చరించినా కానిస్టేబుల్ భర్త వినిపించుకోలేదు. చివరికి పెద్ద మనుషుల మధ్య పంచాయతీ పెట్టినా.. లేడీ కానిస్టేబుల్ నా ప్రేయసి.. మీరేం చేస్తారో చేసుకోండని తెగేసి చెప్పాడు. దీంతో కానిస్టేబుల్ భర్త ఇంటి ముందే భార్య బైఠాయించి […]
Viveka Murder Case: గత ఎన్నికలకు ముందు వైఎస్ వివేకా హత్య కేసు ఏపీలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నాలుగేళ్ల క్రితం వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరగగా.. నేటికీ ఆ కేసు విచారణ పూర్తి కాలేదు. ఎన్నికలకు ముందు ఈ హత్య జరగగా.. సీఎం జగన్ ప్రభుత్వం సమయం కూడా పూర్తి కావస్తున్నా ఆ కేసు మాత్రం ఇంకా తేలలేదు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు అంతకంతకూ ఆలస్యమవుతోంది. కొన్నాళ్ళు కరోనాతో పాటు పలు సవాళ్లను […]
Paper Leakage Case: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో తీవ్ర కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో సిట్ విచారణ కొనసాగుతుంది. 9 మంది నిందితులను సిట్ అధికారులు మూడోరోజు విచారించారు. ప్రవీణ్, రాజశేఖర్, రేణుక ఇచ్చిన సమాచారం ఆధారంగా.. మరి కొందరిని విచారణకు పిలిచినట్లు తెలుస్తుంది. అనుమానితుల విచారణను గోప్యంగా ఉంచుతున్న పోలీసులు.. గ్రూప్-1 పరీక్ష రాసి ప్రస్తుతం విదేశాల్లో ఉన్నవారిని ఫోన్‌లో విచారించారు. ప్రవీణ్, రాజశేఖర్, రేణుక కస్టడీలో […]
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ కొనసాగుతోంది. సోమవారం ఉదయం నుండి ఈ విచారణ కొనసాగుతుంది. సౌత్ గ్రూప్ లో కవిత పాత్రపై ఆరా తీస్తున్నారు. అలాగే.. సౌత్ గ్రూప్ లో ఉన్న వ్యక్తులతో వ్యాపార సంబంధాలపై ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. ఈడీ ఆఫీస్ కు కవిత న్యాయవాదుల బృందం చేరుకుంది. ఈడీ ఆఫీస్ కు తెలంగాణ అడిషనల్ ఏజీ రామచంద్రరావు తో పాటు.. న్యాయవాదులు […]
AP Assembly: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సోమవారం చోటుచేసుకున్న పరిణామాలు రాష్ట్ర ప్రజలను దిగ్బ్రాంతికి గురిచేశాయి. అధికార, విపక్ష సభ్యుల వాదోపవాదనల నడుమ సభా కార్యక్రమాలు పూర్తిగా స్తంభించాయి. తమ పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యేలపై దాడులకు పాల్పడ్డారని అధికార, ప్రతిపక్షాలు పరస్పర ఆరోపణలకు దిగాయి. సభలో లేని వామపక్షాలు, జనసేన పార్టీలు కూడా సభలో జరిగిన పరిణామాలపై స్పందించడంతో రాజకీయం వేడెక్కింది. తమ ఎమ్మెల్యేలు డోలా బాలవీరాంజనేయస్వామి, గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారని […]
సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ తనకు సంబంధించిన నగలు, బంగారపు వస్తువులు, వజ్రాలు, చెవి కమ్మలు, గాజులు, కొంత నగదు రజినీకాంత్ ఇంట్లోని లాకర్ లో భధ్రపరిచింది. ఆ లాకర్ కి సంబంధించిన కీ మాత్రం......................
K.A.Paul: ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో తాము, తమ పార్టీ పోటీ చేయకపోవడం వలనే టీడీపీ ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వ్యాఖ్యానించారు. వైసీపీ, టీడీపీ, జనసేన, బీఆర్ఎస్ పార్టీలు ప్రధాని మోడీకి బీ-పార్టీలని కేఏ పాల్ ఆరోపించారు. చంద్రబాబు, జగన్, కేసీఆర్, పవన్ కల్యాణ్ అన్ని విధాలుగా మోడీకి మద్దతు ఇస్తున్నారని పాల్ తెలిపారు. మోడీ ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చారా? వీళ్లను నమ్మి మనం ఎందుకు మోసపోవాలని ప్రశ్నించారు. […]
Death of an elephant: పొలాల్లోకి వెళ్తున్న ఏనుగు అక్కడ ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ తగిలి సంఘటన స్ధలంలోనే కుప్ప కూలింది. అక్కడిక్కడే మరణించింది. ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన చిత్తూరు జిల్లా ధర్మపురిలో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. పంట పొలాల్లో వెళ్తున్న ఏనుగుకు విద్యుత్ వైర్లు తగిలడంతో ఏనుగు అక్కడికక్కడే మృతి చెందింది. ఈ వీడియోను అక్కడున్నవాళ్లు షూట్ చేయడంతో ఇప్పుడది వైరల్‌గా మారింది. అయితే, వేటగాళ్లు ఏనుగుల కోసం విద్యుత్ తీగలను […]
Weather Update: తెలుగు రాష్ట్రాలను అకాల వర్షాలు వీడలేదు. ఇప్పటికే పలు జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. వడగళ్ల వాన, గాలి బీభత్సం సృష్టించాయి. పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున వడగళ్లు కురవడంతో రోడ్లన్నీ తెల్లని తివాచీ పరిచినట్లు కనిపించాయి. పెద్దఎత్తున కురిసిన వడగళ్ల వానకు పంటలు దెబ్బతిన్నాయి. గాలి బీభత్సానికి అరటి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. మామిడి తోటలలో పూత, పిందె రాలిపడ్డాయి. ఇప్పటికే రైతన్నలు దిగాలు పడిపోయారు. ఇదిలా ఉండగానే మరో 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో […]