Home » news
YSRCP: ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, నెల్లూరు కీలక సీనియర్ నేత, వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డిపై వైసీపీ అధిష్టానం వేటు వేసింది. ఆయనను వెంకటగిరి నియోజకవర్గ వైకాపా ఇంచార్జి బాధ్యతల నుంచి తొలగించి వెంకటగిరి ఇంచార్జిగా ఆయన స్థానంలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డిని ప్రకటించారు. ఇది కేవలం ఇంచార్జి బాధ్యతల నుండి తొలగించడం మాత్రమే కాదు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఆనం ఛరిస్మాను తగ్గించేందుకే […]
CM Jagan: ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండగా.. రాజకీయ పార్టీలలో ఆ సందడి మాత్రం మొదలైంది. ప్రతిపక్ష నేతలు ఏదో ఒక పేరు పెట్టుకొని ప్రజల మధ్యకి వెళ్తుంటే.. అధికారంలో ఉన్న పార్టీ నేతలు ఏదో ఒక కార్యక్రమం పేరుతో ప్రజల వద్దకు వెళ్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ మధ్య కాలంలో పలు కార్యక్రమాల జోరు పెంచినట్లుగా కనిపిస్తుంది. కొత్త సంవత్సరంలో వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ఇచ్చే పెన్షన్ మరో […]
TDP: ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉంది. కానీ.. ఇక్కడ రాజకీయం మాత్రం ఇప్పటికే పీక్స్ కు చేరింది. ఒకపక్క ప్రతిపక్ష పార్టీలు యాత్రలకు సిద్ధమవుతుంటే.. ప్రభుత్వం ఇంకేం చేస్తే మళ్ళీ అధికారం వస్తుందా అని వేటలో పడింది. ఇదిలా సాగుతుండగానే అధికార, ప్రతిపక్ష పార్టీలలో ఎవరికి వారు సీట్ల వ్యవహారంపై విన్నపాలు.. అలకలు కూడా మొదలు పెట్టేస్తున్నారు. అధికారంలో ఉన్నారు కనుక వైసీపీలో ఇప్పుడు ఈ సీట్ల గోల బయటపడదు కానీ.. టీడీపీలో మాత్రం […]
Green Challenge: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం చేపట్టిన కార్యక్రమాలలో హరిత హారం కూడా ఒకటి. సీఎం కేసీఆర్ 3 జూలై 2015న చిలుకూరు బాలాజీ దేవాలయంలో రూ.550 కోట్లతో ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించగా.. అప్పటి నుంచి ఊరు ఊరునా.. వాడ వాడనా విడతల వారీగా రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. పల్లెల నుండి నగరాల వరకు కొంతమేర ఈ కార్యక్రమం తర్వాత పచ్చదనం పెరిగింది. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్ కు […]
V.V.Lakshmi Narayana: వీవీ లక్ష్మి నారాయణ.. ఇలా చెప్తే ఈ పేరు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అంటే మాత్రం తెలుగు ప్రజలు ఈజీగా గుర్తు పట్టేస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో వెలుగులోకి వచ్చిన ఈ సీబీఐ అధికారి రిటైర్మెంట్ తర్వాత ప్రజా సమస్యలు.. రాజకీయాలపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయినా ఈయన ఇప్పుడు మరోసారి […]
Fans War: స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం అంటూ మన హీరోలేమో గీతాలు పాడుకుంటున్నారు. బావా బామ్మర్ది అంటూ వరుసలు పెట్టి పిలుచుకుంటూ ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఉంటున్నారు. ఒకరి సినిమా వేడుకలకు మరొకరు అతిధులుగా వెళ్తున్నారు.. ఒకరి షోలకు మరొకరు వెళ్తూ రక్తి కట్టిస్తున్నారు. సినిమా అంతా ఒక్కటే.. మేమంతా ఎప్పుడూ ఒకరికోసం ఒకరం అండగా ఉంటామని చెప్తూ మద్దతు ప్రకటించుకుంటున్నారు. కానీ, అభిమానులేమో ఈ హీరోల కోసం చొక్కాలు చింపి బ్యానర్లు కడతారు.. వాళ్ళ […]
ఇటీవల డిసెంబర్ 31 న నయని పావని తండ్రి మరణించారు. తన తండ్రి పార్థివదేహం వద్ద ఆయన పాదాలు పట్టుకొని ఏడుస్తూ ఉన్న ఫొటోని తాజాగా తన సోషల్ మీడియాలో షేర్ చేసి...........
AP Govt: రాష్ట్రంలో రాజకీయ సభలు, ర్యాలీలలో వరస ప్రమాదాలు.. ప్రాణ నష్టంతో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు చేసింది. ఇకపై రాష్ట్రంలో రోడ్ షోలు, సభలు, ర్యాలీలను నియంత్రించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం మున్సిపల్, పంచాయతీ రహదారులు, రోడ్డు మార్జిన్ల వద్ద పోలీసు యాక్ట్ నిబంధనలను అమలు చేయనున్నారు. ఆయా ప్రాంతాల్లో రోడ్డు షోలు నిర్వహించకుండా చూడాలని హోం శాఖ తన ఆదేశాల్లో పేర్కొంది. అంతేకాదు ఇకపై రోడ్డుకు దూరంగా ప్రజలకు ఇబ్బందిలేని […]
YSRCP: ఇప్పటి రాజకీయాల్లో వారసత్వం అనేది చాలా కామన్ వ్యవహారం అయిపొయింది. ఒకప్పుడు ఓ తరం నాయకుల అనంతరం గత్యంతరం లేని పక్షంలో అదే కుటుంబంలోని మరో తరం నేతలుగా తయారయ్యేవారు. అది కూడా సీనియర్ల కనుమరుగైన తర్వాతే జూనియర్లు రంగంలోకి వచ్చేవాళ్ళు. కానీ, ఇప్పుడు వ్యవహారం పూర్తిగా వేరే. సీనియర్లు ఉండగానే వారసులను రాజకీయాలలో దింపి లీడర్లుగా తయారు చేసి వాళ్ళని ఓ పదవిలో కూర్చోబెడుతున్నారు. ఇక్కడా.. అక్కడా అని లేకుండా.. దేశవ్యాప్తంగా అదే పరిస్థితి […]
TCongress: వచ్చే ఎన్నికల్లో కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో 50 వేల మెజారిటీకి ఒక్క ఓటు తగ్గినా తాను రాజకీయాలను వదిలేస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చెప్పిన మెజారిటీకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని రాజకీయ సన్యాసం శపథం చేశారు. కోదాడలో ఉత్తమ్ తో పాటు ఆయన భార్య మాజీ, ఎమ్మెల్యే పద్మావతితో కలిసి నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల […]