Home » news
Powerball Lottery: ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో అదృష్టం తలుపు తడుతుందని పెద్దల నమ్మకం. అలాంటి సందర్భాల్లో కటిక పేదరికంలో ఉన్నవాళ్లు కూడా అపర కుబేరులుగా మారిపోతుంటారు. చేతిలో చిల్లిగవ్వలేని వారు అదృష్టం వరించి కోటేశ్వర్లు అవుతుంటారు. సుడి వుండాలి కానీ అదృష్టం సముద్రాల ఆవల వున్నా పరుగెత్తుకుని వచ్చేస్తుంది. అలాంటి జాక్ పాటే ఇదీ. సాధారణంగా లాటరీ అంటే నూటికో కోటికో ఒక్కడికి వస్తుంది.. మనకెందుకు వస్తుందిలే ఏం కొనుక్కుంటాం అనుకుంటారు కొందరు. […]
YSRCP: ఏపీలో ఎన్నికలు ఎప్పుడు అంటే.. ఏడాది తర్వాత కదా ఈ ప్రశ్న అడగాల్సింది అని సమాధానం వస్తుంది. కానీ.. రాజకీయాలు చూస్తే రేపే ఎన్నికలు అనేలా ఉంది పరిస్థితి. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ టీడీపీ నేత నారా లోకేష్ 400 వందల రోజులు 4 వేల కిమీ పాదయాత్ర మొదలు పెట్టగా.. త్వరలోనే తన వారాహీ వేసుకొని పవన్ కళ్యాణ్ యాత్ర మొదలు పెట్టేందుకు సిద్ధమయ్యారు. మరి ప్రతిపక్షాలే ప్రజలలోకి వెళ్తుంటే.. మనం ఎందుకు ఊరికే […]
MLA’s Purchase Case: తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు మరో కీలక మలుపు తిరిగింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారంటూ తెలంగాణ ప్రభుత్వం నాటి ఆడియోలు, వీడియోలను అన్ని పార్టీల అధ్యక్షులు, న్యాయమూర్తులకు పంపింది. ఇందులో బీజేపీ నేతల ప్రోత్సహం ఉందంటూ.. కొందరు బీజేపీ నేతల పేర్లు తెరపైకి రాగా.. ఈ […]
AP High Court: కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మాజీ మంత్రి హరిరామజోగయ్య ఈ నెల 6న ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టు మంగళవారం నాడు విచారణ నిర్వహించింది. కాపులు ఆర్ధికంగా నేటికి వెనుకబడి ఉన్నారని పిటిషనర్ తరపు న్యాయవాది పొలిశెట్టి రాధాకృష్ణ […]
AP BJP: ఉమ్మడి రాష్ట్రాన్ని విడదీసి రెండు రాష్ట్రాలుగా ప్రకటించే సమయంలో ఢిల్లీ పెద్దలు ఇచ్చిన హామీలలో కీలకమైనది ఏపీకి ప్రత్యేక హోదా. విభజన కారణంగా రాజధాని నగరాన్ని కోల్పోయి భారీ ఆదాయాన్ని వదులుకున్న కారణంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అప్పటి కేంద్రప్రభుత్వం హామీ ఇచ్చింది. దానికి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కూడా సుముఖుత వ్యక్తం చేసింది. అయితే.. ఆ తర్వాత ఆ అంశాన్ని బీజేపీ పక్కనపెట్టేసింది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయంలో ప్రత్యేక […]
Kotam Reddy Sridhar Reddy: గత ఎన్నికల్లో జిల్లా మొత్తాన్ని క్లీన్ స్వీప్ చేసిన వైసీపీలో ఇప్పుడు ఇప్పుడు వర్గ పోరు, నేతల అసంతృప్తి తీవ్రంగా ఇబ్బందులు పెడుతుంది. ఇప్పటికే ఇక్కడ ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం రాజకీయంగా కలకలం రేపుతోంది. వివాదాస్పద వ్యాఖ్యలు, వ్యంగ్యాస్త్రాలు సంధించడంలో పేరున్న కోటంరెడ్డి ఇప్పుడు అదే వ్యాఖ్యలను ప్రభుత్వంపైనా, సొంత పార్టీ నేతలపైనా ఉపయోగించారు. పార్టీ పదవుల నుండి తప్పించి.. భద్రతా సిబ్బందిని కూడా తగ్గించగా.. కోటంరెడ్డి […]
Hyderabad: భార్యాభర్తల మధ్య చిన్న గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. చిన్నగా మొదలైన గొడవ చిలికి చిలికి గాలి వానగా మారి చివరికి భర్త బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. క్షణికావేశంలో భర్త తీసుకున్న నిర్ణయంతో భార్య ఇప్పుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగర శివారు అయిన నార్సింగిలో భార్యతో గొడవపడి ఓ భర్త ఆత్మహత్యకు ప్రయత్నించాడు. భార్య కళ్లెదుటే బిల్డింగ్ పై నుంచి దూకేయగా.. […]
Babu Mohan: తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతుంటే రాజకీయం రసవత్తరంగా మారుతుంది. ఈసారి ఎలాగైనా బీజేపీ అధికార పీఠాన్ని దక్కించుకోవాలని అన్ని ప్రయత్నాలు చేస్తుంది. బీజేపీ నేతలు ఈసారి చావో రేవో అనేలా సిద్దపడుతున్నారు. ఇలాంటి తరుణంలో మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు బాబూ మోహన్ ఓ బీజేపీ కార్యకర్తపై కోపంతో ఊగిపోతూ బూతు పురాణంతో రెచ్చిపోయిన ఆడియో ఒకటి వైరల్ అవుతుంది. జోగిపేటకు చెందిన బీజేపీ కార్యకర్త వెంకటరమణ బాబుమోహన్‌కు ఫోన్ చేశారు. ”చెప్పు […]
CM Jagan: త్వరలోనే రాజధాని నుండి పరిపాలన మొదలు పెడతాం.. నేను కూడా అక్కడికే షిఫ్ట్ అవుతున్నా.. ఏపీ రాజధాని విశాఖనే. ఇదీ ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సులో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట. ఈ ఒక్క మాటతో రాజధాని విశాఖ తరలింపులో ఇటు అధికారులతో పాటు వైసీపీ నేతలలో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అమరావతి రాజధాని అంశం సుప్రీంకోర్టులో ఉండగా.. అక్కడ తీర్పు ఎలా ఉండబోతుందన్నది ఉత్కంఠగానే ఉంది. తీర్పు ఎలా ఉన్నా […]
Bihar: బీహార్ లో దొంగల గురించి.. అక్కడ దొంగతనాల గురించి వినే ఉంటారు. మన తెలుగు సినిమాలో కూడా చాలాసార్లు చూసే ఉంటారు. బీహార్ రాష్ట్రంలో బందిపోట్ల నుండి రక్షించుకోవడానికి గ్రామంలో రక్షక్ దళ్ పేరిట యువకుల గ్రూప్స్ కూడా పనిచేస్తుంటాయి. అయినప్పటికీ ఇక్కడ దొంగతనాలు, నేరాలు ఏ మాత్రం ఆగడం లేదు. ఇక్కడ దొంగలు ఎంత ముదుర్లంటే ఏకంగా రెండు కిమీ దూరం రైల్వేట్రాక్ ను కూడా లేపేశారంటే అర్ధం చేసుకోవచ్చు. కొంతకాలంగా మూతపడ్డ రైల్వే […]