Home » news
Nellore City: నెల్లూరు జిల్లాలో ఒకవైపు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. కాగా, మరోవైపు వైసీపీ అధిష్టానం కూడా అసంతృప్తులను బుజ్జగించే పని కన్నా.. వారిపై చర్యలు తీసుకొనేందుకు సుముఖత వ్యక్తం చేస్తుంది. నెల్లూరు జిల్లాలోనే తాజాగా ముగ్గురు ఎమ్మెల్యేపై వైసీపీ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పట్టభద్రుల, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఇలాంటి సమయంలో ఎమ్మెల్యేలు మరికాస్త […]
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ తనకు సమన్లు జారీ చేయడాన్ని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీం కోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. సోమవారం ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ కొనసాగింది. కవిత తరపున సీనియర్ లాయర్ కపిల్ సిబల్ వాదించారు. చట్టం ప్రకారం దర్యాప్తు సంస్థలు మహిళను ఇంటిదగ్గరే విచారణ జరపాలని, తనకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కవిత కోరారు. అంతేకాదు, వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ […]
Viveka Murder Case: సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకా హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ మధ్యనే ఈ కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు దర్యాప్తు మాత్రం అంతకంతకు ఆలస్యం అవుతుంది. ఈ నాలుగేళ్లలో కరోనాతో పాటు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న సీబీఐ.. ఇప్పటికీ దర్యాప్తును కొలిక్కి తీసుకురాలేకపోతుంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుపై […]
East Godavari TDP Leader: గోదావరి జిల్లాలలో టీడీపీ నేత, గ్రామ ఉప సర్పంచ్ దారుణ హత్య కలకలం రేపింది. మండువా లోగిళ్ల ఇంట్లో ఒంటరిగా ఉన్న టీడీపీ నేతపై దుండగులు దాడి చేసి గొంతు నులుమి తనను గోడకేసి మోది హత్య చేశారు. ఈ హత్య ఉమ్మడి గోదావరి జిల్లాల రాజకీయాలలో కలకలం రేపుతోంది. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం వేములూరులో ఈ దారుణ హత్య జరిగింది. టిడిపికి చెందిన ఉప సర్పంచ్ శివ […]
Revanth Reddy: పరువు నష్టం దావా కేసులో రెండు సంవత్సరాలు శిక్ష ఖరారైన నేపథ్యంలో రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని కూడా అనర్హతకు గురి చేస్తూ లోక్ సభ స్పీకర్ కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరిణామాలపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా ప్రధాన ప్రతిపక్షాలన్నిటిలో ఒక్క సారిగా కదలిక తీసుకొచ్చి వారందరినీ ఏకం చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీకి మద్దతుగా […]
Coimbatore: ఆమె చేసేది గౌరవప్రదమైన టీచర్ ఉద్యోగం. స్కూల్ కి వెళ్లేప్పుడు పద్ధతిగా ఒద్దికగా వెళ్తుంది. కానీ.. ఆమె బుద్ది మాత్రం కన్నింగ్ కి కేరాఫ్ అడ్రస్. వృత్తి టీచర్ అయినా ప్రవృత్తి మాత్రం అందంతో మగాళ్లని ముగ్గులోకి దింపు అందిన వరకు గుంజడం.. తేడా వస్తే బ్లాక్ మెయిల్ చేయడం.. మరీ తేడా వస్తే చంపేస్తానని బెదిరించడం. పెళ్ళై భర్త, ఇద్దరు పిల్లలు ఉండగానే ఈ మేడం ఓ బిజినెస్ మెన్ ను వలలో వేసుకొని […]
Hyderabad: రోజు రోజుకీ మన సమాజంలో పెరిగిపోతున్న అఘాయిత్యాలు ఆందోళనకరంగా మారుతున్నా..అసాంఘిక కార్యకపాలకు మాత్రం కొదువే లేకుండా పోతుంది. అమ్మాయిలతో గలీజ్ దందా చేయిస్తున్న ఘటన నగరంలో కలకలం రేపుతోంది. కేటుగాళ్లు పోలీసుల కల్లు గప్పి వారిపని వారు చేసుకుంటూ పోతున్నారు. నగ్నంగా డ్యాన్సులు, వ్యభిచారం చేయిస్తూ డబ్బులు మూటగట్టుకుంటున్నారు. గంజాయి మత్తుకు యువతను బానిసలుగా చేస్తూ తమ గల్లాలు నింపుకుంటున్నారు. ఇప్పటికే వీకెండ్ వస్తే చాలు బార్లు, పబ్బులు యువతను రారమ్మంటుంటే.. ముజ్రా పార్టీల పేరిట […]
YSRTP: తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల పేపర్ల లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే పేపర్ లీక్ అయిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. టీఎస్‌పీఎస్సీ బోర్డును రద్దు చేయటంతో పాటు నష్టపోయిన నిరుద్యోగులు ప్రతి ఒక్కరికీ రూ. లక్ష ప్రకటించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇక ఈ వ్యవహారంపై వైఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘటుగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా మంత్రి కేటీఆర్‌పై షర్మిల సెటైర్లు పేల్చారు. అన్నింటికీ పెద్ద ముత్తైదువ నేనే […]
Gold in Borewell: మన భూగర్భంలో ఏముంటుందో మనకి తెలియదు. మన తాతల కాలం నుండి మన కుటుంబం అధీనంలో ఉన్న భూమిలో కూడా ఏముంటుందో మనం అంచనా వేయలేం. అందుకే ఇంటి పునాదుల కోసం తవ్వితే లంకె బిందెలు పడడం.. పొలంలో దుక్కి దున్నుతుండగా బంగారం నిండిన పెట్టెలు పైకి రావడం చూస్తా ఉంటాం. ఈ స్టోరీ కూడా అలాంటిదే. ఓ వ్యక్తి తన పొలంలో బోరు బావి తవ్విస్తే బంగారం రంగులో ఓ పొడి […]
Tigers Death: మన దేశంలో పలు రాష్ట్రాల్లోని అడవుల్లో పులుల సంచారం మళ్ళీ పుంజుకుంది. ముఖ్యంగా తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లోని అడవుల్లో పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలోనే అవి పంట పొలాలలోకి, గ్రామాలలోకి, గూడెలలోకి వస్తున్నాయి. అయితే, స్థానిక ప్రజలు కొందరు పంట పొలాలకి రక్షణగా ఏర్పాటు చేసిన విద్యుత్ ఫెన్సింగ్ తగిలి మరణించడంతో పాటు మరికొందరు అవగాహనా లోపంతో వేటాడి చంపేస్తున్నారు. ఇలాగే మరో రెండు పులులు బలయ్యాయి. మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లాలో, […]