<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Author » M N
Rangareddy District: చెల్లి పెళ్లి కోసం ఎన్నో కలలు కన్నాడు ఆ అన్న. చెల్లిని జీవితాంతం మంచిగా చూసుకొనే భర్త కావాలని కోరుకున్నాడు. అనుకున్నట్లే ఎంతో వెతికి చివరికి పెళ్ళికి సంబంధం కుదిర్చాడు. ఆర్మీలో ఉన్న అన్న చెల్లి కోసం ఇంటికి వచ్చి పెళ్లి పనులలో నిమగ్నమయ్యాడు. ఏ లోటు లేకుండా చెల్లి పెళ్లి ఏర్పాట్లు చేయాలని ఆరాటపడ్డాడు. బంధు మిత్రులకి, స్నేహితులను స్వయంగా ఆహ్వానించాలని వెళ్లి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అప్పటి నుండి ఆసుపత్రిలో చికిత్స […]
Governor Tamilisai: తెలంగాణ ప్రభుత్వం.. గవర్నర్ తమిళిసై మధ్య వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. కాగా గత కొన్ని రోజులుగా గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ మధ్య విభేదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ బీజేపీ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వం ఆరోపిస్తుంటే.. తన పదవిని ప్రభుత్వం లెక్కచేయడం లేదని గవర్నర్ ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో ఈ పరస్పర ఆరోపణలు పతాక స్థాయికి చేరగా వ్యవహారం కోర్టుల వరకు వెళ్ళింది. అయితే, అప్పుడు ఇరు […]
Bachula Arjunudu: తెలుగుదేశం పార్టీలో మరో విషాదం నెలకొంది. టీడీపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూశారు. అనారోగ్యంతో గత కొంతకాలంగా విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. గురువారం తుది శ్వాస విడిచారు. బచ్చుల అర్జునుడు మరణంతో కృష్ణాజిల్లా గన్నవరం టీడీపీ శ్రేణులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ పార్టీ నాయకులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన గత జనవరి 28న గుండెపోటుకు గురవగా అప్పటి నుంచి విజయవాడ రమేశ్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. పరిస్థితి […]
Wedding Card Distribution: జుట్టు ఉండాలే కానీ ఏ కొప్పు అయినా పెట్టొచ్చని ఓ పాత సామెత వినే ఉంటారు కదా. జుట్టు ఉంటే ఎలాంటి హెయిర్ స్టైల్ అయినా చేసుకోవచ్చని.. జుట్టు లేకపోతే ఏమీ చేయలేమని అలా చెప్పారు. అలాగే డబ్బు ఉండాలే కానీ.. కొండ మీద కోతైనా దిగి వస్తుందని అంటుంటారు. కొండ మీద కోతి ఏమో కానీ.. ఎక్కడ మాత్రం డబ్బు కొడితే గాల్లో ఎగిరే హెలికాఫ్టర్ కూడా తన ముందు వాలిపోయింది. […]
Supreme Court: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి, ఇతర అధికారుల నియామకాల విషయం ఈమధ్య వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఎన్నికల అధికారులు కేంద్రం కనుసన్నల్లో నడుస్తున్నారనే ఆరోపణలు ప్రతిపక్షాల నుంచి వచ్చాయి. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన అధికారులు.. కేంద్రం చెప్పినట్లు వింటున్నారని ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఈ క్రమంలో సుప్రీంకోర్టు నేడు ఎన్నికల సంఘం నియామకాలపై కీలక తీర్పు వెల్లడించింది. ఒకవిధంగా ఎన్నికల కమిషన్ సభ్యుల నియామకంపై సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉండబోతుందా అని ఆసక్తి నెలకొన్న సంగతి […]
MK Stalin: ఒకపక్క తెలంగాణ సీఎం కేసీఆర్ దేశంలో బీజేపీ యేతర, కాంగ్రెస్ యేతర ప్రభుత్వాన్ని తీసుకురావాలని.. అందుకు దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి రావాలని పిలుపులిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఆయన టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి దేశవ్యాప్తంగా విస్తరించే పనిలో కూడా ఉన్నారు. అయితే, డీఎంకే అధ్యక్షులు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. తన 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని […]
Bank Employees: వారానికి ఐదు రోజుల పని విధానం అమలు కాబోతుంది. దీని ప్రకారం బ్యాంకులు ఇకపై వారానికి ఐదు రోజులే పనిచేస్తాయి. ఇది ఒకరకంగా బ్యాంక్ సిబ్బందికి, ఉద్యోగులకు శుభవార్త కాగా.. వినియోగదారులకు మాత్రం బ్యాడ్ న్యూసే. బ్యాంకు ఉద్యోగులు వారానికి ఐదు రోజులే పని చేసేలా నిబంధనలు మార్చాలని ఐబీఏ (Indian Banks Association)కు బ్యాంకు ఉద్యోగుల సంఘం (UFBE) ప్రతిపాదించింది. ప్రస్తుతం నెలలోని ప్రతి ఆదివారంతో పాటు రెండో శనివారం, నాలుగో శనివారాల్లో […]
Kurnool Murder: హైదరాబాద్ లోని అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలో నవీన్ అనే యువకుడిని స్నేహితుడు హరిహరకృష్ణ అతి దారుణంగా ముక్కలు ముక్కలుగా హత్యచేసిన ఘటన యావత్ దేశం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అది, దర్యాప్తు సాగుతూ కొత్త కొత్త నిజాలు వెలుగులోకి వస్తుండగానే తెలుగు రాష్ట్రాలలో మరో హత్య వెలుగులోకి వచ్చింది. ఈ హత్యలో కూడా స్నేహితుడే నిందితుడు కావడం విశేషం. తాలుకా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎర్రబురుజుకు చెందిన మురళీకృష్ణ జనవరిలో కనిపించకుండా పోయాడు. కాగా, […]
Konaseema District: సోషల్ మీడియా.. ఇప్పుడు ఇదో మాఫియా. ఇందులో ఒక్కసారి దిగితే ఇక మళ్ళీ బయట పడడం అనేది ఉండదు. ఈ మధ్య కాలంలో పాలు తాగే వయసు పిల్లల నుండి ముదుసలి వరకు ఎవరి నుండి విన్నా ఈ సోషల్ మీడియా ఖాతాల గురించే. అంతగా విస్తృతంగా వ్యాప్తి తర్వాత.. లైక్ లు, షేర్లు, కామెంట్లే జీవితమైపోయింది. వీటికోసం ఎలాంటి వీడియోలు చేయడానికి అయినా సిద్ధపడుతున్నారు కొంతమంది. తాజాగా, ఓ యువకుడైతే ఏకంగా తన […]
M.K.Stalin: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కు.. జమ్ముకశ్మీర్ మాజీ సీఎం నేషనల్ కాన్ఫరెన్స్ (NC) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా మద్దతిచ్చారు. ఆయన ఎందుకు ప్రధానమంత్రి కాకూడదు?, అందులో తప్పేముంది? అని ప్రశ్నించారు. దేశ ఐక్యతను కాపాడేందుకు స్టాలిన్ కృషి చేస్తున్నారని.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు ఎంతో పాటుపడుతున్నారని కితాబునిచ్చారు. చెన్నైలో జరిగిన సీఎం స్టాలిన్ 70వ పుట్టిన రోజు వేడుకల్లో ఫరూక్ అబ్దుల్లా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ప్రతిపక్షం […]