<style> tags to wp_add_inline_style(). Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Author » M N
Los Angeles Police: ఓ దొంగ తన రేస్ కార్ తో పోలీసులకు దొరకకుండా ఉండేందుకు రయ్యిమని దూసుకెళ్తాడు. మధ్యలో బ్రిడ్జ్ లు, ట్రాఫిక్ లాంటి వాటి దగ్గర జంపింగ్ లు.. ఎదుర్కొచ్చిన వాళ్ళని డాష్ కొట్టుకుంటూ దూసుకెళ్తాడు. ఆ వెనక పోలీసులు తమ వాహనాలలో అదే రేంజిలో దొంగలను వెంటాడి పట్టుకుంటారు. హాలీవుడ్ సినిమాలలో అయితే ఈ సీన్లు ఓ రేంజిలో ఉంటాయి. అలాంటి ఛేజింగ్ సీన్ అదే స్థాయిలో కళ్ళ ముందు కనబడితే ఎలా […]
Ippatam: ఇప్పటంలో మళ్ళీ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గ్రామంలో ఇళ్లు కూల్చివేసేందుకు మున్సిపల్ అధికారులు జేసీబీలతో రాగా గ్రామస్తులు వారిని అడ్డుకున్నారు. మా ఇళ్ల జోలికివస్తే మేం ఆత్మహత్య చేసుకుంటామని బాధితులు వాపోయారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇప్పటికే గ్రామంలో రోడ్డు విస్తరణ నేపథ్యంలో 90 శాతం ఇళ్లను కూల్చివేశారు. మిగిలిన కట్టడాలను కూల్చివేసేందుకు మున్సిపల్ అధికారులు సిద్ధమయ్యారు. శనివారం రెండు జేసీబీల సహాయంతో పన్నెండు ఇళ్ల ప్రహరీ గోడలను కూల్చివేశారు. ఇప్పటం జనసేన […]
Viral News: మనిషి జీవితంలో తల్లి దండ్రుల అనంతరం ఎక్కువ అనురాగం, ఆప్యాయత, ప్రేమ ఉండేది తోడపుట్టిన వారి మీదే. తోబుట్టువుల ఎడబాటు తట్టుకోలేనిది. ఒకవేళ దూరం కావాల్సి వస్తే వారిని ఎప్పుడు కలుస్తామా.. ఎప్పుడెప్పుడు మాట్లాడుతామా అని ఎదురుచూస్తుంటాం. అలాంటిది ఓ ఇద్దరు అన్నదమ్ములు ఏకంగా 74 సంవత్సరాలు విడిపోయారు. ఇన్నేళ్ల తర్వాత కలుసుకున్న ఆనందంలో సోదరులిద్దరూ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని కంటతడి పెట్టుకున్నారు. హర్యానలోని మహేంద్రనగర్ జిల్లా, గోమ్లా గ్రామంలో […]
Revanth Reddy Car Accident: టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు శనివారం ప్రమాదం జరిగింది. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా శ్రీపాదప్రాజెక్టు పరిశీలించేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కాన్వాయ్‌లోని నాలుగైదు కార్లు ఢీ కొన్నాయి. వెంటనే బెలూన్లు తెరచుకోవడంతో ప్రమాదం తప్పింది. అతివేగంగా కార్లు వెళ్లడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డిని ఫాలో అవుతున్న మీడియా ప్రతినిధుల వాహనాలు కూడా ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన కార్లలో రెండు […]
Kishan Reddy: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అమరావతి రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరగకుండానే రాష్ట్రంలో ముఖ్యమంత్రి నుండి మంత్రుల వరకు విశాఖనే పరిపాలన రాజధాని అని ప్రకటనలు చేయడం హీట్ పుట్టిస్తుంది. వైసీపీ తప్ప దాదాపుగా అన్ని ప్రతిపక్ష పార్టీలు మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతికి ఓటేస్తున్నారు. బీజేపీ కూడా ఇప్పటికీ అమరావతికి కట్టుబడి ఉన్నామని చెప్తుంది. అయితే, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నోటి వెంట విశాఖ […]
Pakistan Gold Rate: మన దాయాది శత్రుదేశం పాకిస్తాన్ ఇప్పుడు ఆర్ధికంగా ఘోరాతి ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఓవైపు ఆర్ధిక సంక్షోభం, మరోవైపు రాజకీయ అస్థిరతతో పాకిస్థాన్ సతమతమవుతోంది. ప్రభుత్వ ఖజానా మొత్తం ఖాళీ అయిపోగా.. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఏది కొనాలన్నా ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఒకవేళ ఆస్తులు అమ్మాలన్నా.. ఆర్ధిక సంక్షోభంతో కొనే నాధుడు కూడా లేడు. ఇక్కడ దరిద్రం గురించి చెప్పుకోవాలంటే బంగారం ధర ఒక్కటి చాలు. పాకిస్తాన్ లో […]
AP Volunteers: ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఏపీలో వాలంటీర్ల ప్రస్తావన వస్తూనే ఉంటుంది. 90 శాతం మంది వాలంటీర్లు మన కార్యకర్తలేనని స్వయంగా ఆ పార్టీ నేతలే చెప్పడంతో వాలంటీర్లు ఎన్నికల విధులకు దూరంగా ఉండాల్సిందేనని ప్రతిపక్షాల నుండి భారీ డిమాండ్లు వినిపించాయి. అందుకు తగ్గట్లే ఎలాంటి ప్రమాణాలను పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం నియమించుకున్న వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని గతంలోనే ఎన్నికల సంఘం ఆదేశించింది. అయితే క్షేత్రస్ధాయిలో ఆ ఆదేశాలు సంపూర్ణంగా అమలు కావడం […]
Jakarta Fire Accident: ఇండోనేషియాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాజధాని జకార్తాలోని ఓ చమురు నిల్వ కేంద్రంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 17 మంది మరణించారు. మరో 50 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సుమారు 250 అగ్నిమాపక యంత్రాలను ఉపయోగించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఉత్తర జకార్తాలోని తనహ్ మేరా పరిసర ప్రాంతంలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఓ […]
Hyderabad: పిల్లలను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. కేవలం విద్యాబుద్ధులే కాదు.. సమాజంలో నడవడిక, పెద్దల పట్ల గౌరవం.. ఇలా మనిషిని మనిషిలా మలచడంలో టీచర్లదే కీలక పాత్ర. అలాంటి టీచర్లు ఆ విద్యార్థులకు ప్రేమ పాఠాలు చెప్పడం ఇప్పుడు కలవరపరుస్తోంది. ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థితో కలిసి అదృశ్యమైన సంఘటన చందానగర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 17వ తేదీన ఒంట్లో బాగులేదని […]
Trending Marriage: గోదారోళ్లంటేనే ఓ ప్రత్యేకం. వెటకారమైనా.. మమకారమైనా.. అభిమానమైనా.. ఆప్యాయతైనా.. మర్యాదలైనా.. గోదారోళ్ల గురించి చెప్పాలంటే.. అబ్బో.. అంటూ మొదలుపెడతారు. అల్లుళ్లకు, అత్తమామలకు, వియ్యంకులకు, బంధువులకు మర్యాదలు చేయాలంటే వారి తర్వాతే. పెళ్లి భోజనం దగ్గర నుంచి.. అల్లుడికి ఆషాడం సారె పంపే వరకు కూడా ఓ ప్రత్యేకత చాటుతారు. ఇక, పెళ్లిళ్ల గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. దానికి ఉదాహరణే ఈ పెళ్లి. కోనసీమ ప్రకృతి అందాలకు హరివిల్లు ఆహ్లాదకరమైన పచ్చ పచ్చని పైర్లు, […]