Home » news
Psycho: పట్టపగలు ఓ సైకో వీరంగం సృష్టించాడు. చేతిలో ఓ రాడ్డు పట్టుకొని కనిపించిన వాహనాల అద్దాలను ధ్వంసం చేస్తూ ఎదురొచ్చిన వారిపై దాడికి ప్రయత్నిస్తూ హడలెత్తించాడు. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్ లోకి దూసుకెళ్లి ఫర్నిచర్ ను కూడా ధ్వంసం చేశాడు. ఏపీలోని కర్నూలు జిల్లాలో ఇది జరిగింది. సైకో వీరంగానికి సంబంధించి ఎవరో వీడియో రికార్డ్ చేసి పోస్ట్ చేయడంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. పూర్తి వివరాల్లోకి […]
TDP 41st Formation Day: తెలుగు దేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ సభ హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అట్టహాసంగా జరిగింది. ఈ సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు వేదికపై ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి.. జ్యోతి ప్రజ్వలనం చేసి తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. మార్చి 29 రాజకీయ చరిత్రను తిరగరాసిన రోజని అన్నారు. తనకు ఎంతో గుర్తింపునిచ్చిన తెలుగు జాతి కోసం నాడు […]
Viral Video: మనుషులకంటే నగరాల్లో, గ్రామాల్లో ఇళ్ళు ఉన్నాయి. కానీ, అడవిలో ఉండే అనేక జంతువులకు ఇల్లు ఒక్కటే.. అదే అడవి. మరి ఆ అడవిలో అవి చక్కగా జీవిస్తుంటే మనుషులు వెళ్లి డిస్టర్బ్ చేయవచ్చా? అందుకే ఒక్కోసారి అవి తిక్క లేస్తే తరుముతాయి. వాటి జోలికి వెళ్తున్నట్లు వాటికి అనిపిస్తే ఖచ్చితంగా తరుముతాయి. గతంలో ఇలాంటి ఘటనలు అనేకం చూసాం. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. దాని వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. […]
Air India flight: గన్నవరం విమానాశ్రయం ఎదుట కువైట్ వెళ్లాల్సిన 18 మంది ప్రయాణికులు ఆందోళనకు దిగారు. కువైట్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం తమను వదిలేసి వెళ్లిందని ఇరవై మంది ప్రయాణికులు ఆరోపించారు. అయితే ఎయిర్ పోర్ట్ సిబ్బంది మాత్రం మీరే ఆలస్యంగా వచ్చారని.. విమానం కరెక్ట్ టైంకి వెళ్లిపోయిందని వారిని అడ్డుకున్నారు. ప్రయాణికుల ఆందోళనతో ఒక్కసారిగా అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది. గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుండి పూర్తిస్థాయిలో అంతర్జాతీయ విమాన సర్వీసులు […]
Suicide Selfie Video: ముందు రోజు సెల్ఫీ వీడియో తీసుకుని తాము ఆత్మహత్య చేసుకుంటున్నాం అని ప్రకటించిన గాజువాక దంపతుల కథ విషాదాంతంగానే ముగిసింది. వారిని కాపాడేందుకు కుటుంబసభ్యులు, పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వారిని ప్రాణాలతో పట్టుకోలేకపోయారు. ఆ భార్యాభర్తల మృతదేహాలు ఏలేరు కాలువలో తేలారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ ఉక్కునగరం ఎస్ఎంఎస్-2 విభాగంలో పనిచేస్తున్న చిత్రాడ వరప్రసాద్, మీరా దంపతులు గాజువాక పరిధిలోని శివాజీ నగర్‌లో నివసిస్తున్నారు. వీరికి […]
K.V.P-Chandrababu: టీడీపీ అధినేత, ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు శక్తి సామర్థ్యాలపై తనకు నమ్మకం ఉందని, చంద్రబాబు జూలు విదిల్చి తన కార్యస్థానాన్ని ఢిల్లీకి మార్చాలని కేవీపీ షాకింగ్ కామెంట్స్ చేశారు. బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేపట్టిన ఉద్యమంలోకి చంద్రబాబు రావాలని కేవీపీ కోరారు. కేవీపీ రామచంద్రరావు దివంగత సీఎం వైఎస్ఆర్ కు […]
Viveka Murder Case: ఏపీలో సంచలనం రేకెత్తించిన సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సుదీర్ఘంగా కొనసాగుతున్న ఈ కేసును ఏప్రిల్ 30లోపు దర్యాప్తు ముగించాలని ఆదేశించింది. విస్తృత కుట్ర కోణాన్ని అత్యంత వేగంగా బయటపెట్టాలని సూచించింది. ఈ కేసును ఏప్రిల్ 30 లోగా దర్యాప్తు పూర్తి చేస్తామని సీబీఐ కూడా సుప్రీం కోర్టుకు చెప్పింది. ఈ కేసులో అదనపు ఛార్జ్ షీట్ […]
Toll Fee hiked: నేషనల్ హైవేలపై ప్రయాణించే వాహదారులకు టోల్ బాదుడు మరింత పెరగనుంది. ఏప్రిల్ 1 నుంచి జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ వేలపై టోల్ రేట్లను పెంచనున్నట్లు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు తెలిపారు. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనూ అధికారులు టోల్ ఛార్జ్‌లపై రివ్యూ చేసే సంగతి తెలిసిందే. కాగా, అందులో భాగంగా ఈసారి 5 నుంచి 10 శాతం మేర టోల్ రేట్లు పెంచనున్నారు. దీంతో వివిధ రాష్ట్రాలలో ఉన్న […]
Karnataka Elections 2023: కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. కాసేపటి క్రితమే.. ఎన్నికల సంఘం కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. మే 10న కర్ణాటక ఎన్నికలు జరుగనున్నాయి. అలాగే.. మే 13వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఒకే విడతలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఏప్రిల్ 13న నోటిఫికేషన్, మే 10న పోలింగ్.. మే 13న ఓట్ల లెక్కింపు ఉండనుంది. నేటి నుంచే […]
Rape In Hyderabad: బాలికా సంరక్షణ చట్టాలు ఎన్ని ఉన్నా, కామాంధులకు ఉరి శిక్ష వేసినా, నిర్భయ వంటి కఠిన చట్టాలు అమలవుతున్నా సరే అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. ఎంకౌంటర్లు చేసినా మృగాళ్ళు మాత్రం మారటం లేదు. అభం శుభం తెలియని చిన్నారుల నుండి పండు ముసలి వరకు ఎవరినీ వదలని మానవ మృగాలు రెచ్చిపోతున్నారు. అభం శుభం తెలియని పసి వాళ్ళను చిదిమేస్తున్నారు. ఇక అలాంటి ఘటనే హైదరాబాద్ మహా నగరంలో మరొకటి వెలుగు […]