<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Author » M N
Pawan-Ali: జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి పరిశ్రమలో ఉన్న అత్యంత సన్నిహితుల్లో అలీ ఒకరు. దశాబ్దాలుగా వీరి ప్రయాణం సాగుతుంది. ఆఫ్ స్క్రీన్ అండ్ ఆన్ స్క్రీన్ లో వీరి స్నేహం కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ ప్రతి సినిమాలో అలీ ఉండాల్సిందే. దర్శకులు కూడా ఆయన సినిమాల్లో అలీకి ప్రత్యేకంగా పాత్రలు రాస్తారు. తొలిప్రేమ, బద్రి, ఖుషి, గబ్బర్ సింగ్ వంటి చిత్రాల్లో పవన్-అలీ కాంబినేషన్ సీన్స్ అదుర్స్ అంతే. సినిమాలతో పాటు నిజజీవితంలో […]
Mukarram Jah: హైదరాబాద్ సంస్థానం ఎనిమిదో నిజాం నవాబ్ మీర్ బర్కత్ ఆలీఖాన్ ముకర్రం ఝా శనివారం అర్ధరాత్రి ఇస్తాంబుల్‌లోని ఆయన నివాసంలో మరణించిన సంగతి తెలిసిందే. పార్థీవ దేహం మంగళవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకుంది. ఇస్తాంబుల్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన భౌతిక కాయాన్ని శంషాబాద్‌కు తీసుకొచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ పాతబస్తీ చౌమహల్లా ప్యాలెస్కు భారీ పోలీసు బలగాల మధ్య రోడ్డు మార్గం ద్వారా నిజాం భౌతిక ఖాయాన్ని తీసుకొచ్చారు. అక్కడ్నుంచి చౌమహల్లా […]
Kesineni Nani: టీడీపీ సీనియర్ నేత.. ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని నానీ ఈ మధ్య కాలంలో హీట్ పుట్టించే కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు సొంత పార్టీపైనే నిప్పులు చెరుగుతున్న కేశినేని.. కొందరి నేతలపై బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. సొంత సోదరుడితో మొదలైన విబేధాలు పార్టీ అధిష్టానాన్ని కూడా లెక్కచేయని విధంగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో సొంత పార్టీ అధిష్టానంపై బహిరంగంగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్న నానీ.. పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు […]
Malakpet Hospital: నగరంలోని మలక్ పేట ప్రభుత్వాసుపత్రిలో దారుణం జరిగింది. నవమాసాలు మోసి తీరా ఆసుపత్రిలో ప్రసవానికి వచ్చేసరికి నిర్లక్ష్యం వారిని కాటేసింది. మలక్ పేట ప్రభుత్వాసుపత్రిలో సిజేరియన్ ఆపరేషన్ జరిగిన తర్వాత ఇద్దరు బాలింతలు మృతి చెందారు. మలక్‌పేట ప్రభుత్వ ఆస్పత్రిలో సిజేరియన్ చేయించుకున్న తర్వాత ఆరోగ్యం విషమించడంతో నాగర్‌కర్నూల్ జిల్లా వెల్లండ మండలం చెదుమపల్లికి చెందిన సిరివెన్నెల(23), హైదరాబాద్ పూసలబస్తీకి చెందిన శివాని(24) గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు 12వ తేదీన, మరొకరు […]
Bandi Sai Bageerath: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమారుడిపై కేసు నమోదయింది. బండి సాయి భగీరథ్ ఓ విద్యార్థిని చితకబాదినట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటనలో విద్యార్థికి తీవ్ర గాయాలవగా దుండిగల్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. నగరంలోని మహీంద్రా యూనివర్సిటీలో చదువుతున్న బండి సంజయ్ కొడుకు సాయి భగీరథ్ ర్యాగింగ్ పేరుతో విద్యార్థిని తీవ్రంగా కొట్టి గాయపడిచాడని వార్తలొస్తున్నాయి. ఈ మేరకు ఓ […]
AP Govt: ఏపీలో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1 మంటలు కొనసాగుతున్నాయి. నెల్లూరు జిల్లా కందుకూరు.. గుంటూరులో టీడీపీ తలపెట్టిన కార్యక్రమాలలో 11 మంది కార్యకర్తలు మృతి చెందడంతో ఏపీ ప్రభుత్వం సభలు, ర్యాలీలపై ఆంక్షలు విధిస్తూ జీవో 1 తీసుకొచ్చింది. 1861 పోలీస్ యాక్ట్‌లోని సెక్షన్ 30 ప్రకారం.. రోడ్లపై ప్రదర్శనలు, కార్యక్రమాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. టీడీపీతో పాటు జనసేన, కమ్యూనిస్టులు జీవోను తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసనలు తెలిపారు. ఆ తర్వాత టీడీపీ […]
Telangana BJP: తెలంగాణ బీజేపీకి పార్టీ అధిష్టానం కొత్త టార్గెట్ ఫిక్స్ చేసింది. తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని నిరూపించుకొనే పనిలో ఉన్న బీజేపీ ఇందుకు తగ్గ అన్ని అవకాశాలను వినియోగించుకొనే పనిలో ఉంది. గతంలో పోలిస్తే బీజేపీ తెలంగాణలో పుంజుకుంది. అయితే.. అది అధికారం దక్కించుకునే స్థాయిలో ఉందా అంటే ఆ పార్టీ నుండి అవుననే సమాధానం రావడం కష్టమే. దానికోసమే అధిష్టానం మరింతగా ప్రజలలోకి వెళ్లేందుకు సన్నాహాలు సిద్ధం చేసుకుంటుంది. ఇప్పటికే తెలంగాణ […]
Delhi Weather: దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు మరోసారి దారుణంగా పడిపోతున్నాయి. సోమవారం నుంచి ‘కోల్డ్ స్పెల్’ ఏర్పడగా.. మరో నాలుగు రోజుల పాటు దీని ప్రభావం కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) ఓ ప్రకటనలో వెల్లడించింది. కోల్డ్ స్పెల్ కారణంగా ఢిల్లీలో మూడు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ఐఎండీ తెలిపింది. సోమవారం ఉదయం ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రత 1.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవగా.. మంగళవారం కూడా అదే […]
SDSC: పూర్వపు నెల్లూరు జిల్లాలోని ప్రస్తుత తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో ఇద్దరు సీఐఎస్ఎఫ్ సిబ్బంది 24 గంటలలోనే ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న సీఐఎస్ఎఫ్ జవాన్ వికాస్ సింగ్ సోమవారం నాడు రాత్రి గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోగా అంతకు ముందు ఆదివారం సాయంత్రం చింతామణి అనే జవాన్ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వీరిద్దరూ కేంద్ర పారిశ్రామిక భద్రతా దళానికి […]
Gangasagar Pilgrims: సంక్రాంతి సందర్భంగా పుణ్యస్నానానికి వెళ్లిన యాత్రికులు సముద్రంలో చిక్కుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లో సముద్రంలో దాదాపు 600 మంది గంగాసాగర్ యాత్రికులు చిక్కుకున్నారు. వారు గత రాత్రి నుంచి సముద్రంలోనే ఉన్నారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మకర సంక్రాంతి సందర్భంగా హుగ్లీ నది బంగాళాఖాతంలో సంగమించే గంగాసాగర్‌లో పెద్ద సంఖ్యలో యాత్రికులు పవిత్ర స్నానం ఆచరిస్తుంటారు. ప్రతి ఏడాది లాగానే ఈ మకర సంక్రాంతి రోజున యాత్రికులు ఆదివారం సాయంత్రం 24 పరగణాల […]