<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Tag » Telangana
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడీగా జరుగుతున్నాయి. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, మంత్రి కేటీఆర్ మధ్య నువ్వా నేనా అన్న రీతిలో మాటల యుద్ధం చెలరేగింది. ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై అక్బరుద్దీన్ మంత్రి కేటీఆర్ ను ప్రశ్నించారు. హైదరాబాద్ లోని ఇతర ప్రాంతాల్లో వేగంగా జరుగుతున్న పనులు పాతబస్తీలో ఎందుకు జరగడం లేదని నిలదీశారు. అంతేకాదు, చార్మినార్ పాదాచారుల ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందంటే ప్రజలకు ఏం చెప్పాలి?.. పాతబస్తీ మెట్రో ఏమైంది? […]
Telangana Secretariat: తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ కొత్త సచివాలయం ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ మేరకు ముహూర్తం కూడా సిద్ధమైంది. సీఎం కేసీఆర్ పుట్టినరోజు నాడే నిర్వహించనున్న ఈ వేడుకకు జాతీయ స్థాయి నేతలు.. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరుకానున్నారు. కొత్త సచివాలయ ప్రారంభోత్సవానికి తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, […]
Telangana Congress: ఎన్నికలు దగ్గర పడడంతో రాజకీయ పార్టీల పాదయాత్రలు మొదలైపోయాయి. ఎన్నికల సీజన్ అంటే రాజకీయ యాత్రల సీజన్ అనే అర్ధం అందరికీ తెలిసిందే కదా. ఒకవైపు ఏపీలో టీడీపీ నుండి నారా లోకేష్ పాదయాత్ర మొదలు పెట్టగా.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వారాహితో యాత్ర మొదలు పెట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇప్పటికే బీజేపీ నుండి బండి సంజయ్ కొన్ని ప్రాంతాలలో యాత్రలు చేయగా మళ్ళీ […]
Union Budget: నేడు కేంద్రం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై వివిధ రాష్ట్రాల నుండి ఒక్కోరకంగా అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఏపీ ఆర్థికశాఖ మంత్రి మాట్లాడుతూ కొన్ని శాఖలలో కేటాయింపులు తగ్గాయి కానీ.. ఓవరాల్ గా చూస్తే మంచి బడ్జెట్ అని.. రాజకీయాలను పక్కనబెట్టి అందరూ కేంద్రాన్ని ప్రశంసించాలని కూడా కోరారు. అయితే, తెలంగాణ నేతలు మాత్రం ఇది రైతు వ్యతిరేక బడ్జెట్ అని విమర్శించారు. బుధవారం నాడు న్యూఢిల్లీలో కేంద్ర […]
Raja Singh: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు మంగళహాట్ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. జనవరి 29న ముంబైలోని దాదర్లో జరిగిన ఓ ర్యాలీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. హైకోర్టు విధించిన షరతులను రాజాసింగ్ ఉల్లంఘించారని.. రెండు రోజుల్లో వీటిపై సమాధానం చెప్పాలని నోటీసులో స్పష్టం చేశారు. ఈ నోటీసులపై రాజాసింగ్ మంగళవారం స్పందిస్తూ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని ఎనిమిదో నిజాం పాలిస్తున్నారని విమర్శించిన రాజాసింగ్.. నిజాం పాలనకు […]
Kavitha-Sarath Kumar: తెలంగాణ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవితతో ప్రముఖ సినీ నటుడు, ఆల్ ఇండియా సమతువ మక్కల్ కచ్చి అధ్యక్షుడు శరత్ కుమార్ కలిశారు. శనివారం ఉదయం కవితతో శరత్ కుమార్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా వారు దేశ రాజకీయాల గురించి చర్చించినట్లు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ స్థాపన ఉద్దేశాలు లక్ష్యాలు , ఎజెండా వంటి అంశాల గురించి శరత్ కుమార్ అడిగి తెలుసుకున్నారు. ఆల్ ఇండియా సమతువ మక్కల్ […]
Janasena: ఇప్పటికీ తాము బీజేపీతో పొత్తులోనే ఉన్నామని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వెల్లడించారు. అంతేకాదు, వచ్చే ఎన్నికలలో కూడా బీజేపీతో పొత్తు కొనసాగుతుందని ఆయన తెలిపారు. తన ఎన్నికల ప్రచారం రథం వారాహికి పూజా కార్యక్రమాల కోసం కొండగట్టుకు వచ్చిన పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. టీడీపీ-జనసేన-బీజేపీల పొత్తుతో 2014 కాంబినేషన్ పై కాలమే సమాధానం చెబుతుందన్నారు. ప్రస్తుతానికి బీజేపీతో కలసి ఉన్నామన్న జనసేనాని.. ఎవరు కలసి వస్తే వాళ్ళతో పొత్తుకు వెళ్తామని, […]
Pawan Kalyan: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొండగట్టుకు విచ్చేశారు. ఎన్నికల ప్రచారం కోసం పవన్ ఇప్పటికే తన వారాహి వాహనాన్ని సిద్ధం చేసుకున్నారు. వాహనానికి కొండగట్టులో నేడు పూజలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుండి కొండగట్టు ఆలయానికి కూడా చేరుకున్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం అంటే జనసేనాని పవన్ కళ్యాణ్ కు ఎంతో సెంటిమెంట్. అందుకే, ఈ ఆలయంలోని స్వామివారిని పూజించుకొని తన ఎన్నికల సమరాన్ని సాగించడానికి, తాను […]
Priyanka Gandhi: తెలంగాణ రాజకీయాల్లో వచ్చే ఎన్నికలలో సంచలనం జరగబోతుందా అనిపిస్తుంది. ఇప్పటికే తెలంగాణ గడ్డ నుంచి ప్రధాని మోదీ పోటీకి సిద్దమవుతున్నట్లు కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల్లో దక్షిణాది నుంచి పోటీ చేయాలని భావిస్తున్న ప్రధాని.. అందులో భాగంగా తెలంగాణ నుంచి రెండు లోక్ సభ స్థానాల పైన సర్వేలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అతి పెద్ద లోక్ సభ నియోజకవర్గం మల్కాజ్ గిరి.. వెనుకబడిన మహబూబ్ నగర్ లోక్ సభ స్థానాలలో ఒక […]
Cheddi Gang: తెలంగాణ రాష్ట్రంలో చెడ్డీ గ్యాంగ్ మళ్లీ హల్‌చల్ చేసింది. మహబూబ్ నగర్ జిల్లాలో భారీ చోరీకి పాల్పడ్డారు దుండగులు. జిల్లా కేంద్రంలో వరస చోరీలతో చెడ్డి గ్యాంగ్ భయాందోళనకు గురిచేశారు. స్థానిక బృందావన్ కాలనీలో వరుస దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలను హడలెత్తిస్తున్నారు. గతంలో అదే కాలనీలో చెడీ గ్యాంగ్ చోరీకి ప్రయత్నించి విఫలమై వెనుతిరిగగా.. నాలుగు రోజుల క్రితం ఓ ఇంట్లో భారీగా నగదు, బంగారం దోపిడీ చేశారు. చెడ్డీ గ్యాంగ్ అంటేనే చోరీలతో […]