<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Tag » Telangana
Heavy Rains in Telangana: అకాల వర్షం మరోసారి రైతు కంట కన్నీరు పెట్టిస్తుంది. మండుటెండల నుండి ఒక్కసారిగా మారిన వాతావరణం వడగళ్ల వాన రైతన్నను హడలెత్తించింది. గురువారం ఉదయం నుంచి వాతావరణంలో మార్పు చోటుచేసుకుని, మధ్యాహ్నం దాటిన తర్వాత ఈదురు గాలులతో ఓ మోస్తరు వర్షం పడింది. పలు ప్రాంతాలలో ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. దాంతో ఇప్పటికే మిర్చి కోతలు నిర్వహించి, కల్లాల్లో ఆరబెట్టిన మిర్చిపంట తడిసి ముద్దయింది. కొందరు రైతులు […]
Jasmine Price in Telugu States: మగువలకు మల్లె పూలకు విడదీయరాని అనుబంధం ఉంటుంది. ఇప్పుడంటే విరబోసుకున్న జుట్టుకు తోడు అని ఏవేవో హెయిర్ స్టేల్స్ రావడంతో మహిళలు మల్లెపూలు పెట్టుకోవడం తగ్గింది కానీ.. ఒకప్పుడు అలిగిన మగువను మచ్చిక చేసుకోవడం కోసం ప్రతి మగాడు మల్లె మూరనే ఆశ్రయించేవాడు. డిమాండ్ తగ్గడంతో మల్లె సాగు కూడా తగ్గిపోయింది. అయితే, పెళ్లిళ్లు, శుభకార్యాల సమయంలో మాత్రం మల్లెలకు ఎక్కడ లేని గిరాకీ వస్తుంది. ఇప్పుడు పెళ్లీల సీజన్ […]
TCongress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గురించి.. ఆ పార్టీ నేతల గురించి.. వారి మధ్య ఏకాభిప్రాయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే.. అది పాజిటివ్ గా కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే కుమ్ములాటలు. తెలంగాణ కాంగ్రెస్ లో అయితే అది తారాస్థాయిలో ఉంటుంది. అందుకే పార్టీ పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఎలాగోలా తిరిగి పార్టీని గాడిన పెట్టాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ పాదయాత్ర చేస్తుండగా.. దానికి మిగతా నేతల నుండి ఆదరణ కరువైంది. రేవంత్ […]
Bandi Sanjay: తెలంగాణలో వాహనాలపై ట్రాఫిక్ చలానాలు డెత్ పెనాల్టీగా మారాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటు విమర్శలు చేశారు. ట్రాఫిక్ చలాన్లు చెల్లించలేక సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కార్మికుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. చింతల్ బస్తీ ప్రాంతంలో నివాసం ఉండే 52 ఏళ్ల ఎల్లయ్య రోజువారి కూలీ […]
Wine Shops Close: మందుబాబులకు తెలంగాణ సర్కార్ బాడ్ న్యూస్ చెప్పింది. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది. హోలీ పండుగ నేపథ్యంలో సాధారణ ప్రజలకు ఇబ్బందులు ఏర్పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మార్చి 6న సాయంత్రం 6 గంటల నుంచి మార్చి 8వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ఈ నేపథ్యంలో జంట నగరాల పరిధిలోని మద్యం దుకాణాలు, బార్లు […]
Power consumption: తెలంగాణ రాష్ట్రంలో ఎండలు పోతున్నాయి. మండే ఎండలతో ప్రజలు కూడా భారీ స్థాయిలో విద్యుత్ వినియోగిస్తున్నారు. తెలంగాణ చరిత్రలోనే తొలిసారిగా ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో మంగళవారం డిమాండ్ ఏర్పడింది. ఈరోజు మధ్యాహ్నం సమయంలో అత్యధికంగా 14,794 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. గత ఏడాది ఇదేరోజున గరిష్టంగా 12,966 మెగావాట్ల వినియోగం నమోదవగా.. నేడు 14,794 మెగావాట్ల వినియోగం జరిగింది. గత సంవత్సరం మార్చి నెలలో 14160 మెగా వాట్ల అత్యధిక […]
NCESS Research: మరో అరుదైన.. పురాతన కాలం నాటి శిలలు బయటపడ్డాయి. అది కూడా ఎలాంటి కఠిన వాతావరణంలోనైనా చెక్కుచెదరని ఖనిజ లవణం జిర్కోన్ శిలలు కావడం దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలోని చిత్రియాల్ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో కొన్ని అత్యంత అరుదైన శిలలను వెలికితీశారు. ఇవి 410 కోట్ల సంవత్సరాల నాటివని గుర్తించారు. ఆ శిలల వయసు రీత్యా భూమి ఏర్పడిన తొలినాళ్ల నాటివని భావిస్తున్నారు. కోల్ కతాకు చెందిన ప్రెసిడెన్సీ యూనివర్సిటీ, నేషనల్ సెంటర్ […]
Telangana TDP: తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే దిశగా టీడీపీ చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో రేపటి నుంచి ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ వెల్లడించారు. ఆ మధ్య ఖమ్మంలో టీడీపీ సభ తర్వాత తెలంగాణ టీడీపీలో కాస్త జోష్ కనిపించింది. అయితే, ఖమ్మం సభ తర్వాత సైలెంట్ అయిపోవడంతో పార్టీ పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. ఈక్రమంలోనే ఇకపై ఏదొక రీతిన ప్రజలలోకి వెళ్లాలని భావిస్తున్న తెలంగాణ […]
YSRTP: తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని.. ప్రతిపక్షాలను ఉక్కుపాదంతో అణచివేసి సీఎం కేసీఆర్ ఒక నియంతలా పాలిస్తున్నారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. బీఆర్ఎస్ లో ఉన్నదంతా గూండాలేనని, ప్రతిపక్షాలపై వారు దాడులు చేస్తున్నారని షర్మిల ఆరోపించారు. దేశంలో భారత రాజ్యాంగం అమల్లో ఉంటే, తెలంగాణలో మాత్రం కేసీఆర్ రాజ్యాంగం అమలవుతోందని అన్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసైని కలిసిన అనంతరం షర్మిల మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర […]
Jagga Reddy: నేను కాంగ్రెస్ లో ఉన్నా.. కాంగ్రెస్ కంటే బీజేపీ చరిత్ర నాకు బాగా తెలుసు.. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలలో గవర్నర్ ప్రసంగంపై బీజేపీ అసంతృప్తిలో ఉంది. అందుకే త్వరలోనే గవర్నర్ ను మార్చవచ్చని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్న గవర్నర్ ప్రసంగం అనంతరం మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి గవర్నర్ బయట చాలా నరికారని.. పులి తీరుగా గాండ్రించారని.. కానీ పిల్లి తీరుగా సభలో ప్రసంగించారని ఎద్దేవా చేశారు. కాగా.. ఆదివారం మరోసారి […]