<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Tag » cm jagan
CM Jagan: ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ నేడు మరోసారి ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం సీఎం జగన్ గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈనెల 16వ తేదీన ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం జగన్ ప్రధాని మోడీతోనూ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతోనూ చర్చలు జరిపారు. అనంతరం, అక్కడి నుండి తిరిగి వచ్చారు. కాగా, రెండు వారాల వ్యవధిలోనే నేడు మరోసారి జగన్ హస్తినకు బయలుదేరారు. రెండు రోజుల క్రితం పార్లమెంట్ […]
AP Govt: ఏపీ ప్రభుత్వం సలహాదారుల నియామకంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మొత్తం 45 మంది సలహాదారులున్నట్లు అంచనా కాగా వీరందరికీ విలాసవంతమైన వాహనం, బంగ్లా, వ్యక్తిగత సిబ్బంది, ఇతర విలాసవంతమైన సౌకర్యాలు కూడా ఇస్తున్నారు. అందులో 8 మంది సలహాదారులకు కేబినెట్ హోదా కూడా కల్పించారు. మరో 12 మంది సలహాదారులకు అధికారిక నివాసం, డ్రైవర్, పిఎ, పిఎస్, కార్యాలయంతో పాటు కేటగిరీ-1 పే-స్కేల్ (నెలకు రూ. […]
AP Assembly: ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు మరోసారి సస్పెండ్ అయ్యారు. బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాక ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్ జరగడం ఇది ఐదవసారి. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలోనే సీఎం జగన్ అప్పటికప్పుడు ఢిల్లీకి పయనమై ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన సంగతి తెలిసిందే. దీనిపై అసెంబ్లీలో చర్చ జరపాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేయగా అది రసాభాసగా మారి చివరికి సస్పెండ్ వరకూ వెళ్ళింది. అసెంబ్లీ సమావేశాలలో టీడీపీ సభ్యులపై శనివారం మరోసారి […]
CM Jagan: ఏపి సీఎం వైఎస్ జగన్ నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన ప్రధాని మోడీని కలవనున్నారు. నిన్ననే ఢిల్లీ చేరుకున్న జగన్ జన్ పథ్ ఒకటిలో రాత్రి బస చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ 11 గంటలకు ఖరారు అయినట్లు తెలుస్తొంది. ఆ తర్వాత హోంశాఖ మంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులతోనూ సీఎం జగన్ భేటీ కానున్నట్లు సమాచారం. రాష్ట్రానికి సంబంధించి […]
CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఈరోజు సాయంత్రం ఆయన ఢిల్లీకి వెళ్లే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్లమెంటు సమావేశాలు జరుగుతుండటంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు మరికొందరు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశముందని తెలిసింది. గురువారం రాత్రి 7:30 గంటలకు సీఎం జగన్ హస్తినకు పయనం కానున్నారు. అయితే, ఓవైపు నేడు రాష్ట్ర […]
AP Assembly Sessions: ఏపీలో ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే మిగిలి ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో కీలక బడ్జెట్ అసెంబ్లీ ముందుకు వస్తోంది. జగన్ ప్రభుత్వం ఈ విడతలో చివరి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెడుతోంది. ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ రోజు అసెంబ్లీలో 2023-24 బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుండగా.. వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. ఇక శాసనమండలిలో […]
YSRCP: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి నడుస్తున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక సంగతి ఎలా ఉన్నా.. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక మాత్రం రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావిస్తున్నాయి రాజకీయ వర్గాలు. అధికార ప్రతిపక్ష పార్టీలు వైసీపీ, టీడీపీ హోరాహోరీ ఈ ఎన్నికల కోసం పనిచేస్తున్నాయి. కాగా, గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఏడుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులు సీఎం జగన్ ను కలిశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు […]
Ambati Rambabu: నేను పుట్టింది రేపల్లెలోనే అయినా.. చచ్చేది మాత్రం సత్తెనపల్లిలోనేనని మంత్రి అంబటి రాంబాబు భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. తనది సత్తెనపల్లి కాకపోయినా.. తనది రేపల్లె అయినా.. ఇక్కడి ప్రజలు తనకు ఎంతో గౌరవం ఇచ్చారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తాను రేపల్లెలో పుట్టానని.. కానీ, చచ్చేది మాత్రం సత్తెనపల్లిలోనే అని వ్యాఖ్యానించారు. ఇక, గత టీడీపీ ప్రభుత్వం వల్లనే పోలవరం ప్రాజెక్ట్ కు తీరని నష్టం వాటిల్లిందని మంత్రి విమర్శించారు. కాఫర్ డ్యామ్ […]
Vellampalli Srinivas: అంబానీ లాంటి వారు పవన్ కళ్యాణ్ లాంటి వారికి కనీసం అపాయింట్ మెంట్ అయినా ఇస్తారా అని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ వైజాగ్ లో చాలా ఘనంగా జరిగిందని, భారీ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కు వచ్చాయని వెల్లంపల్లి అన్నారు. పారిశ్రామికవేత్తలు తమ రాష్ట్రంలో రూ.13.41 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారని, రాష్ట్రంలో ప్రత్యక్షంగా 6 లక్షల ఉద్యోగాలు […]
AP Capital: విశాఖే పరిపాలనా రాజధాని.. త్వరలోనే విశాఖ నుంచే పరిపాలన సాగిస్తానని ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి పునరుద్ఘటించారు. విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ వేదికగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధాని విశాఖపట్నమేనని మరోసారి స్పష్టం చేశారు. త్వరలో తాను కూడా విశాఖకే షిఫ్ట్ అవుతానని, ఇక్కడి నుంచే పాలన సాగిస్తామని వెల్లడించారు. రాష్ట్రం నుంచి ఎగుమతులు గణనీయంగా పెరిగాయని చెప్పిన జగన్.. […]