<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Author » M N
TSPSC Paper Lekage Case: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ కేసులో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. ఇద్దరూ బహిరంగ క్షమాపణ చెప్పకపోతే వంద కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేస్తున్నట్లు ప్రకటించారు. టీఎస్‌పీఎస్సీ వ్యవహారంలో రాజకీయ దురుద్దేశంతోనే తన పేరును అనవసరంగా లాగుతున్నారని, వీరిద్దరికి తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులను పంపించారు. సుదీర్ఘ కాలం పాటు […]
Suicide Video: మేము వెళ్లిపోతున్నాం.. మమ్మల్ని క్షమించండి.. మేము డబ్బులు ఇవ్వలేదని మా కొడుకు, కూతురుని ఏమనకండి. పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. మా కూతురు చాలా అమాయకురాలు. మేము మీకు డబ్బులు ఇవ్వలేదని తనని ఏం అనొద్దు. మా అత్తను, అమ్మను బాగా చూసుకోండి. ఎవరూ ఏమన్న పట్టించుకోవద్దు. ఇక మేము వెళ్లిపోతున్నాం అంటూ ఓ దంపతులు ఏడుస్తూ చివరి సారిగా తీసుకున్నసెల్ఫీ వీడియోలో మాటలు ఇవి. ఇక ఇదే వీడియోను తమ కుమారుడికి పంపి ఫోన్ […]
Wine Shops Close: మందుబాబులకు మరో బ్యాడ్ న్యూస్ వచ్చింది. శ్రీరామనవమి సందర్బంగా హైదరాబాద్‌లో మద్యం షాపులు, బార్‌ల మూసీవేతపై పోలీసు ఉన్నత అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. రాములోరి కళ్యాణంసందర్బంగా మద్యం ప్రియులకు పోలీసులు షాకిచ్చారు. భాగ్యనగరంలో మద్యం దుకాణాలపై ఆంక్షలు విధించారు. గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని పోలీసులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం వైన్స్ షాపులకు ఆదేశాలు జారీచేశారు. […]
Rajanna Sirisilla: సాధారణంగా ఒక్క కాన్పులో ఒక్కరి జన్మిస్తారు. ఒక్కోసారి కవలలకు జన్మిస్తారు. రేర్ కేసుల్లో ఒకే కాన్పులో ముగ్గురికి జన్మనిస్తారు. కానీ ఓ మహిళ నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఓ మహిళ నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. వైద్యులు అరుదైన శస్త్రి చికిత్స నిర్వహించి శిశువులను బయటకు తీశారు. తల్లి, పిల్లలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని […]
Gun Fire: నిన్న మొన్నటి వరకు కడప జిల్లా అంటేనే టక్కున గుర్తొచ్చేది ఫ్యాక్షన్. పలు సినిమాల్లో కూడా సీమ ఫ్యాక్షన్ గొడవలను భూతద్దంలో చూపించిన ఘటనలు, గతంలో జరిగిన కొన్ని అనుభవాలు ఈ ముద్ర పడడానికి కారణంగా చెప్పవచ్చు. అయితే కాలం మారింది, ఫ్యాక్షన్ పూర్తిగా మాసిపోయిందని పోలీసులు పదేపదే చెబుతుంటారు. కానీ నేటికీ జిల్లాలో గన్ కల్చర్ కొనసాగుతూనే ఉంది. తాజాగా కడప జిల్లా పులివెందులలో కాల్పుల మోత మోగింది. భరత్ కుమార్ అనే […]
YSRTP: హైదరాబాద్ లోని లోటస్ పాండ్ వద్ద మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఉస్మానియా ఆసుపత్రికని బయలుదేరిన వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిలను పోలీసులు గేటు దగ్గరే అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, షర్మిలకు మధ్య వాగ్వాదం జరిగింది. కనీసం తనను ఒక్కదాన్నైనా వెళ్ళనివ్వండని షర్మిల, పోలీసులను కోరారు. పోలీసుల వాహనంలో తీసుకెళ్లినా పర్వాలేదని వేడుకున్నారు. పోలీసులు మాత్రం అనుమతి లేదని నిరాకరించారు. తాను కేవలం ఉస్మానియాలో ఉన్న రోగులను మాత్రమే పరమర్శిస్తానని షర్మిల స్పష్టం చేసినా.. వెళ్ళనివ్వద్దని […]
Thammineni Seetharam: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే కూన రవికుమార్ సంచలన ఆరోపణలు చేశారు. తమ్మినేని సీతారాం స్పీకర్ అయిన తర్వాత హైదరాబాద్ ఎల్బీ నగర్‌లోని మహాత్మాగాంధీ లా కళాశాలలో 2019-20లో నకిలీ డిగ్రీ సర్టిఫికెట్‌తో అడ్మిషన్ తీసుకున్నారని లేఖలో పేర్కొన్న ఆయన.. లా కోర్సు కోసం ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్ సృష్టించారని ఆరోపించారు. తాను డిగ్రీ చదవలేదనే విషయాన్ని ఆయనే గతంలో ‘ఐ డ్రీమ్’ యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో […]
Delhi Liquor Scam: దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తెలంగాణ సీఎం కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కవితను ఇప్పటి వరకూ మూడుసార్లు ఈడీ విచారించగా.. మూడు రోజులు మొత్తం 27 గంటలకు పైగా సుదీర్ఘ విచారణ జరిగింది. విచారణ తర్వాత మళ్లీ నోటీసులుంటాయని కానీ.. ఇంకా విచారించాల్సి ఉందనే విషయం కానీ ఎక్కడా బయటికి రాలేదు. అయితే, ఈడీ విచారణ సందర్భంగా కవిత పాత […]
20 Hajj pilgrims killed: సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 మంది హజ్ యాత్రికులు దుర్మరణం పాలయ్యారు. హజ్ యాత్రికులతో వెళుతున్న ఓ బస్సు యాసిర్ ప్రావిన్స్ ప్రాంతంలో వంతెనను ఢీకొంది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందగా.. 29 మంది గాయపడ్డారు. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. స్థానిక అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు […]
US school attack: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేపింది. టెన్నెస్సీలోని నాష్‌విల్లేలోని ఒక ప్రాథమిక పాఠశాలలో ఒక మహిళ కాల్పులు జరపడంతో ముగ్గురు పిల్లలు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనలో నిందితుడు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ప్రీ-స్కూల్ నుండి ఆరవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల కోసం ప్రైవేట్ క్రిస్టియన్ పాఠశాల అయిన నాష్‌విల్లేలోని పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. తొమ్మిదేళ్ల వయసున్న ముగ్గురు పిల్లలకు తుపాకీ గాయాలు […]