<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Author » Abhilash Myadam
శుభకార్యాలు, పండుగలు, పూజలు ఎక్కడ జరిగినా మామిడి ఆకులను కట్టి మొదలుపెట్టడం ఒక సంప్రదాయకపరమైన ఆచారంగా మనం భావిస్తాం. భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో ఏ ఆచరణ చేపట్టినా, ఏ పద్ధతి పాటించినా దాని వెనక ఏదో ఒక శాస్త్రీయపరమైన కారణం తప్పక ఉంటుంది. మరి ఈ మామిడాకులు కట్టడం వెనక ఉన్న శాస్త్రీయపరమైన, ఆధ్యాత్మికపరమైన కారణాలేమితో ఇపుడు తెలుసుకుందాం. ఆధ్యాత్మిక దృక్కోణంలో చూస్తే, మామిడి హనుమంతుడికి ఇష్టమైన పండు. ఎక్కడ చూసినా మామిడి ఆకులను పూజకు ఉపయోగిస్తారు. […]
వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు వైకుంఠ ఏకాదశినాడు నిర్వహిస్తారు. మరి ఈ వైకుంఠ ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏంటో, ఈ పర్వదినం యొక్క చరిత్ర ఏంటో ఇపుడు తెలుసుకుందాం. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. కోటి పుణ్యాలకు సాటి ఒక ముక్కోటి ఏకాదశి విశిష్టత, ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి […]
సకల సంపదలకు నిలయమైన మన భారతదేశాన్ని విశ్వగురువుగా భావిస్తూ, మన దేశాన్ని మాతృమూర్తిగా భావిస్తూ భారతమాతగా పిలుచుకుంటాం. మరి ఈ భారతమాతకు కూడా ఒక దేవాలయం ఉందని, ఆ ఆలయంలో నిత్య పూజలు జరుగుతాయని తెలుసా…? అయితే ఆలస్యం చేయకుండా ఈ వ్యాసం చదివి భారతమాత దేవాలయం ఎక్కడుందో, ఆ దేవాలయ విశిష్టత ఏమిటో తెలుసుకోండి…! భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో గల వారణాసిలోని మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠం ప్రాంగణంలో భారతమాత దేవాలయం ఉంది. సంప్రదాయ దేవతల విగ్రహాలకు […]
శ్రీవారి ఆలయంలో ఆనందనిలయం బంగారు తాపడం పనుల కోసం స్వామివారి దర్శనాన్ని ఆరు నెలల పాటు నిలిపివేస్తారని కొన్ని ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వార్తలు వాస్తవం కాదని టిటిడి స్పష్టం చేసింది. టిటిడి ఆగమ సలహామండలి సూచనల మేరకు తిరుమల శ్రీవారి ఆలయ ఆనందనిలయం బంగారు తాపడం పనులు ప్రారంభించి 6 నెలల్లో పూర్తి చేయాలని టిటిడి ధర్మకర్తల మండలి నిర్ణయించింది. ఈ మేరకు బాలాలయం ఏర్పాటుకు ఆలయ అర్చకులు 2023, మార్చి1వ తేదీన ముహూర్తంగా నిర్ణయించారు. […]
ధ్వజస్తంభాన్ని హిందూ దేవాలయాలలో ఒక ప్రధానమైన భాగంగా చెబుతారు. ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణం చేసిన తరువాత దైవదర్శనం చేసుకోవటం ఒక ఆచారం. ఒకప్పుడు అడవిలో దారి తప్పిన బాటసారులకు ఎత్తున కనిపించే ధ్వజస్తంభ దీపాలే దారి చూపించేవట. వీటి ఆధారంగా, ఏ గుడినో, పల్లెనో చేరుకొని ప్రజలు అక్కడ తలదాచుకొనేవారట. మరి ఇంతటి విశేషాలున్న ధ్వజస్తంభం చరిత్ర ఏంటో ఇపుడు తెలుసుకుందాం. ప్రస్తుతంకార్తీకమాసములో ప్రజలు ధ్వజస్తంభం మీద ఆకాశదీపం వెలిగించి, సాంప్రదాయపరంగా పూజలు చేస్తున్నారు. మూల విరాట్టు దృష్టికోణానికి ఎదురుగా దేవాలయాలలో […]
దేవాలయాలు మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు నిలయాలు. అటువంటి దేవాలయాల్లో కొన్ని మాత్రమే కొంత ప్రత్యేకతను కలిగి ఉంటాయి. అందులో ఒకటి త్రిభువనేశ్వరుడు కొలువై ఉన్న ఒడిశాలో గల లింగరాజస్వామి దేవాలయం. ఈ ఆలయం ఒడిశా రాజధాని నగరమైన భువనేశ్వర్ లో ఉంది. మరి ఈ ఆలయ విశేషాలేంటో, ఆలయ చరిత్రకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఇపుడు తెలుసుకుందాం. లింగరాజ అనగా లింగాలకు రాజు అని అర్థం. ఈ ఆలయంలోని శివలింగానికి త్రిభువనేశ్వర అనే పేరు ఉంది. […]
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహిస్తున్న వివిధ రకాల ఉత్సవాలైన న్యూ ఇయర్, వైకుంఠ ద్వార దర్శనం వంటి వాటికి సంబంధించిన కొన్ని అప్డేట్స్, సూచనలు, సలహాలు అందించారు. వీటిలో కొన్ని భక్తులు తప్పక పాటించవలసినవి కూడా ఉన్నాయి.. అవేంటో ఇపుడు తెలుసుకుందాం… రాబోయే న్యూఇయర్, వైకుంఠ ఏకాదశి దర్శనాలకు టీటీడీ పకడ్బందీ చర్యలు చేపడుతోంది. జనవరి 2 నుండి 11వ తేదీ వరకు వైకుంఠద్వార దర్శనం కోసం విస్త్రుతంగా ఏర్పాట్లు చేపట్టింది. […]
శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం జనవరి 2వ తేదీ నుండి మొదలుకాబోతున్న వేళ భక్తులు టికెట్లు, టోకెన్లు పొంది తిరుమలకు రావాలని టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమలలో సోమవారం వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను పరిశీలన చేసిన ఈవో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన కొన్ని సూచనలు చేశారు. అవేంటో ఇపుడు తెలుసుకుందాం… వైకుంఠ ద్వార దర్శనం జనవరి 2 నుండి 11వ తేదీ వరకు 10 రోజుల పాటు ఉంటుందని, ఇందుకోసం […]
ప్రతీ క్రిస్మస్ పండుగకు శాంటా క్లాజ్ అందరికి ఆశ్చర్యాన్ని కలుగజేసే విధంగా ప్రత్యక్షమై కొత్త కొత్త బహుమతులను అందజేస్తుంటాడు. చిన్నపిల్లలను అలరింపజేసేవిధంగా, వారితో ఆటలు ఆడుతూ.. పాటలు పాడుతూ గడిపే క్రిస్మస్ తాతయ్య గురించి మీలో ఎంత మందికి తెలుసు…? తెలియకుంటే ఆ క్రిస్మస్ తాతయ్యగా పిలువబడే శాంటా క్లాజ్ ఎవరో, ఎక్కడినుండి వచ్చి బహుమతులు అందిస్తుంటాడో అన్న విషయాలను, దాని వెనక ఉన్న చారిత్రాత్మక కథనాన్ని ఇపుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం… నాల్గవ శతాబ్దంలో సెయింట్ […]
ప్రజలకు ఏవైనా ఇబ్బందులు లేదా గొడవలు ఏర్పడితే ముందు వెళ్ళేది పోలీస్ స్టేషన్ లేదా కోర్టుకు కానీ కర్ణాటక రాష్ట్రంలోని దావణగిరే నగరంలోని ప్రజలు దుర్గాంబికా దేవి ఆలయానికి వెళ్ళి అక్కడి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి, ద్వీపాలను వెలిగిస్తారు. తత్ఫలితంగా వారి కష్టాలు, బాధలు తీరిపోతాయని ప్రజల నమ్మకం. మరి ఇంకా ఈ నగర విశేషాలేమిటో ఈ వ్యాసంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పట్టణంలోని ఎక్కువ మంది ప్రజలు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కరు, […]