<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Tag » Telangana govt
Sitarama Kalyanam: నేడు సీతారామ కల్యాణం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతుంది. ప్రధానంగా భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణాన్ని ప్రతి ఒక్కరూ వీక్షించాల్సిందే. వీధి వీధిన రాములోరి గుడి ఉంటుంది. ఆ గుడిలో నేడు సీతారాముల కల్యాణానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకున్నారు. కాగా, భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో కన్నులపండగగా జరిగే సీతారాముల కల్యాణాన్ని చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భద్రాద్రికి చేరుకున్నారు. ఉదయం పది గంటల నుంచి సీతారాముల కల్యాణ వేడుక ప్రారంభమైంది. భద్రాచలంలో […]
Telangana BJP: తెలంగాణలో టీఎస్పీపీస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం రాజకీయంగా కాకరేపుతుంది. మొదట టౌన్ ప్లానింగ్ పేపర్ లీకైందనే అనుమానంతో టీఎస్పీపీస్సీ పోలీసులకు కేసు నమోదు చేసింది. అయితే, పోలీసుల దర్యాప్తులో ఏఈ పేపర్ లీకైనట్లు తేల్చారు. తర్వాత ఈ కేసును సిట్ కు అప్పగించగా.. టీఎస్పీఎస్సీ నుంచి మొత్తం 5 పేపర్లు లీకైనట్లు సిట్ అధికారులు దర్యాప్తులో తేల్చారు. ఉద్యోగ పరీక్ష పత్రాలు లీక్ కావడం పట్ల విద్యార్ధులు, నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేపర్ […]
Telangana Cabinet: ఈ నెల 9న తెలంగాణ మంత్రిమండలి సమావేశం కానుంది. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ మధ్యనే తెలంగాణ బడ్జెట్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. కాగా, ఈ క్యాబినెట్ లో ప్రధానంగా బడ్జెట్‌లో ఆమోదించిన పలు పథకాలు, గతంలో ఇచ్చిన హామీలకు సంబంధించి మంత్రి మండలి చర్చించనుంది. ఈ క్యాబినెట్ […]
Mutton Canteen: హైదరాబాద్ అంటేనే బిర్యానీకి పెట్టింది పేరు. దేశంలో.. ప్రపంచంలో ఎక్కడ బిర్యానీ తిన్నా.. హైదరాబాద్ బిర్యానీ ఒక్కసారి రుచి మరిగితే ఇక అన్నీ దిగదుడుపే. ఇదే హైదరాబాద్ లో హలీం కూడా చాలా ఫేమస్. ముఖ్యంగా మటన్ హలీం కోసమైతే బారులు తీరుతుంటారు. ఇలా హైదరాబాద్ బిర్యానీ, హలీం అంటే ఇష్టపడేవారికి తెలంగాణ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెబుతోంది. నాన్వెజ్ ప్రియుల కోసం మటన్ వంటకాలతో క్యాంటీన్ తీసుకురాబోతుంది. హైదరాబాద్ మత్స్య భవన్ […]
Telangana Govt: తెలంగాణలో నీటి పారుదల శాఖకి సంబంధించి మరో కొత్త చట్టం అమల్లోకి రానుంది. దీనికోసం ఇప్పటికే ముసాయిదా బిల్లును కూడా సిద్ధం చేసిన ప్రభుత్వం ఈ బడ్జెట్ సమావేశాలలో.. లేదా వచ్చే అసెంబ్లీ సమావేశాలలో సభలో ప్రవేశపెట్టనుంది. తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదల శాఖకు సంబంధించి ఉన్న 18 వేర్వేరు చట్టాలను కలిపి ఒక కొత్త సమీకృత నీటిపారుదల చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఈ మేరకు ముసాయిదాను కూడా సిద్ధం […]
Suicide Attempt: ప్రగతిభవన్ ముందు ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం కలకలం సృష్టించింది. కుటుంబం అంతా ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా.. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. తన భూమిని తీసుకున్న ప్రభుత్వం పరిహారం చెల్లించలేదని.. ఉన్న భూమి పోయి బతుకుదెరువు లేక ఇబ్బందులు పడుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్యాయత్నం చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీం పట్నానికి చెందిన ఐలేష్ అనే వ్యక్తి భార్యతో సహా ప్రగతి భవన్ […]
Telangana Secretariat: నూతన సచివాలయ భవనాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 20 ఎకరాల విస్తీర్ణంలో రూ. 617 కోట్లతో గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ తో అధునాతనంగా ఈ భవన నిర్మాణం చేపట్టారు. లోపలికి సహజమైన గాలి, వెలుతురు వచ్చేలా డిజైన్ చేశారు. ఎనిమిది అంతస్తులతో కూడిన భవనంలో ఆరో అంతస్తులో సీఎం సచివాలయం సిద్ధం చేశారు. ఇప్పటికే నిర్మాణం ముగింపు దశకు చేరుకున్న కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 17న […]
TS Congress: కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన 12 మంది ఎమ్మెల్యేలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డీజీపీకి ఫిర్యాదు చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీ కొనుగోలు చేసిందని.. ఈ మేరకు కేసు నమోదు చేసి సీబీఐతో విచారణ జరిపించాలని రేవంత్ కోరారు. రేవంత్ వెంట మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డితో ఇతర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. అంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు.. ఈమేరకు విచారణ […]
Bandi Sanjay: శుక్రవారం సాయంత్రం నుండి కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బారికేడ్లు కట్టి పోలీసులు భారీ బందోబస్తు చేయగా బీజేపీ కార్యకర్తలు, రైతులు వందల సంఖ్యలో అక్కడకి చేరుకున్నారు. కామారెడ్డి మునిసిపాలిటీ నూతన మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్న రైతులు.. ఇండస్ట్రియల్ జోన్ కు తమ భూములు ఇచ్చే ప్రసక్తేలేదని వారు స్పష్టం చేస్తున్నారు. రైతులకు మద్దతుగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా […]