<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Tag » Delhi Liquor Scam
Delhi Liquor Scam: దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తెలంగాణ సీఎం కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కవితను ఇప్పటి వరకూ మూడుసార్లు ఈడీ విచారించగా.. మూడు రోజులు మొత్తం 27 గంటలకు పైగా సుదీర్ఘ విచారణ జరిగింది. విచారణ తర్వాత మళ్లీ నోటీసులుంటాయని కానీ.. ఇంకా విచారించాల్సి ఉందనే విషయం కానీ ఎక్కడా బయటికి రాలేదు. అయితే, ఈడీ విచారణ సందర్భంగా కవిత పాత […]
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ తనకు సమన్లు జారీ చేయడాన్ని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీం కోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. సోమవారం ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ కొనసాగింది. కవిత తరపున సీనియర్ లాయర్ కపిల్ సిబల్ వాదించారు. చట్టం ప్రకారం దర్యాప్తు సంస్థలు మహిళను ఇంటిదగ్గరే విచారణ జరపాలని, తనకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కవిత కోరారు. అంతేకాదు, వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ […]
Delhi Liquor Scam: ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కవిత మరోసారి ఈడీ విచారణకు హాజరయ్యారు. సోమవారం 10 గంటల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం రాత్రి సమయంలో ఆమెను ఇంటికి వెళ్లామన్నారు. అక్కడ నుండి ఢిల్లీలో సీఎం కేసీఆర్ నివాసానికి వెళ్లిన కవిత మంగళవారం ఉదయం కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు. భర్త వెంట రాగా ఆమె ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ఈడీ ఆఫీసులోకి వెళ్లేముందు ఆమె తన భర్తను ఆలింగనం చేసుకున్నారు. ఇక ఈడీ […]
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ కొనసాగుతోంది. సోమవారం ఉదయం నుండి ఈ విచారణ కొనసాగుతుంది. సౌత్ గ్రూప్ లో కవిత పాత్రపై ఆరా తీస్తున్నారు. అలాగే.. సౌత్ గ్రూప్ లో ఉన్న వ్యక్తులతో వ్యాపార సంబంధాలపై ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. ఈడీ ఆఫీస్ కు కవిత న్యాయవాదుల బృందం చేరుకుంది. ఈడీ ఆఫీస్ కు తెలంగాణ అడిషనల్ ఏజీ రామచంద్రరావు తో పాటు.. న్యాయవాదులు […]
BRS-BJP: హైదరాబాద్ లో పోస్టర్ల కలకలం పీక్స్ కు చేరింది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ పోస్టర్ల యుద్ధం తెలంగాణ రాజకీయాలలో కాక పుట్టిస్తుంది. ఆ మధ్య కొద్ది రోజుల క్రితం బీజేపీకి వ్యతిరేకంగా పోస్టర్లు కనిపించాయి. ఆ పోస్టర్లు బీఆర్ఎస్ నేతల పనేనని రాజకీయ వర్గాలు ఖరారు చేసుకున్నాయి. దీనిపై అప్పుడు బీజేపీ నేతలు కూడా గరంగరం అయ్యారు. అదలా ఉండగానే ఇప్పుడు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోస్టర్లు కనిపించాయి. కల్వకుంట్ల కుటుంబానికి వ్యతిరేకంగా […]
Delhi Liquor Scam: ఈ నెల 20న సోమవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాల్సిందేనని ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈనెల 11న కవితను విచారించిన ఈడీ అధికారులు 16న మళ్లీ విచారణకు హాజరవ్వాలని నోటీసులు ఇచ్చారు. అయితే అనారోగ్య కారణాల వల్ల రాలేనని కవిత ఈడీకి లేఖ రాసినా గురువారం మధ్యాహ్నం వరకు ఈడీ నుండి స్పందన లేదు. ఈ నేపథ్యంలో ఈడీ విచారణ వ్యవహారంలో కొంత […]
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇవాళ విచారణకు రాలేనని తన ప్రతినిధిని ఈడీ ఆఫీస్‌కు పంపారు కవిత. కవిత హాజరుకాకపోవడంపై న్యాయవాది సోమా భరత్ ఈడీకి వివరాలు తెలిపారు. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉందని.. ఈడీ విచారణకు హాజరుకాలేనని న్యాయవాదుల ద్వారా ఈడీకి సమాచారం పంపారు కవిత. అనారోగ్య కారణాలు కూడా ఉండడంతో మరోరోజు విచారణ తేదీ నిర్ణయించాలని కవిత అభ్యర్థన […]
Telangana BJP: సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమీషన్ కూడా బండి సంజయ్ కు నోటీసులు ఇవ్వగా.. బీఆర్ఎస్ నేతలు, రాష్ట్ర మహిళా సంఘాలు కూడా బండి వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతున్నారు. బీఆర్ఎస్ నేతలే కాదు బండి వ్యాఖ్యలు సొంత పార్టీ బీజేపీ నేతలు కూడా తప్పుబడుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ […]
Delhi Liquor Scam: లిక్కర్ స్కాంలో ఈడీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, కవితకి ఈడీ నోటీసులిస్తే తెలంగాణకి ఎలా అవమానం అవుతుందని, కవిత నోటీసులతో తెలంగాణ ప్రజలకి ఏం సంబంధమని సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క ప్రశ్నించారు. లిక్కర్ స్కాంలో అభియోగాలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. లిక్కర్ స్కాంతో తెలంగాణకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ లీడర్లంతా లిక్కర్ […]
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంచలనం రేపుతోంది. ఇప్పటికే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియాతో పాటు పలువురు ప్రముఖులు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. మొత్తం 11మందిని ఈ కేసులో ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ కేసులో కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుట్ల కవితకు ఈడీ నోటీసులు జారీచేసింది. విచారణ కోసం కవిత రేపు గురువారం ఢిల్లీ రావాలని ఈడీ నోటీసులో పేర్కొంది. అయితే చట్టసభల్లో మహిళా […]