<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Tag » cm kcr
Telangana Women’s Day Awards: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మహిళలకు కానుకలు అందిస్తున్నది. ఇప్పటికే మార్చి 8వ తేదీన సాధారణ సెలవుగా ప్రకటించిన ప్రభుత్వం.. అదే రోజు దాదాపు రూ.750 కోట్ల రుణాలు స్వయం సహాయక సంఘాలకు అందించనుంది. ఇక మహిళలను సత్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. ఈ తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాలకు 27మందిని ఎంపిక చేసింది. ఈమేరకు సీఎస్ […]
CM KCR: వసంత రుతువుకు నాందీ ప్రస్తావనగా, పచ్చని చిగురులతో కొత్తదనం సంతరించుకుని, వినూత్నంగా పున:ప్రారంభమయ్యే ప్రకృతి కాలచక్రానికి హోళీ పండుగ స్వాగతం పలుకుతుందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. చిగురించే ఆశలతో తమ జీవితాల్లోకి నూతనత్వాన్ని హోళీ రూపంలో స్వాగతం పలికే భారతీయ సాంప్రదాయం రమణీయమైనదన్నారు. రాష్ట్ర, దేశ ప్రజలందరికీ సిఎం కేసీఆర్ హోళీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. పల్లెలన్నీ వెన్నెల నవరాత్రుల్లో సాగే చిన్నారుల జాజిరి ఆటా పాటలతో, కోలాటాల చప్పుల్లతో హోళీ ఉత్తేజం […]
CM KCR: సీఎం కేసీఆర్ కామారెడ్డి జిల్లా తిమ్మాపూర్ లో పర్యటిస్తున్నారు. తిరుమలగా పేరుగాంచిన తిమ్మాపూర్వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవంలో సీఎం దంపతులు పాల్గొన్నారు. తిమ్మాపూర్ లోని శ్రీదేవీ, భూదేవీ సమేత వెంకటేశ్వర స్వామిని సీఎం కేసీఆర్ దంపతులు దర్శించుకున్నారు. అక్కడ స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. సీఎం దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ దంపతులు మొదట బాన్సు వాడకు వెళ్లగా వారికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, […]
Etela Rajender: తెలంగాణలో రైతులకు కనుక 24 గంటల మూడు ఫేజ్‌ల కరెంటు వస్తుందని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఛాలెంజ్ విసిరారు. అసలే ఎన్నికల కాలం.. పైగా రాజకీయ పార్టీలు దూకుడు పెంచాల్సిన సమయం. అందుకే ఒక్కో నేత ఒక్కోలా కామెంట్స్ చేసి రాజకీయాలలో వేడి పెంచుతున్నారు. తెలంగాణలో ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల వార్ జరుగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో ఈటల రాజేందర్ […]
Telangana Budget 2023: 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ వార్షిక బడ్జెట్‌ను మంత్రి హరీశ్ రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రతిపాదించగా.. రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లుగా.. పెట్టుబడి వ్యయం రూ.37,525 కోట్లుగా పేర్కొన్నారు. శాసనసభలో హరీశ్ రావు, శాసన మండలిలో శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. తొలిసారిగా సభ్యులందరికీ పెన్ డ్రైవ్‌ల ద్వారా బడ్జెట్ కాపీలను అందించారు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ […]
BRS Party-Bandi Sanjay: మహారాష్ట్రలోని నాందేడ్ లో బీఆర్ఎస్ నిర్వహించిన జాతీయ సభ అట్టర్ ప్లాప్ అయిందని, మహారాష్ట్ర జనం అసలు పట్టించుకోలేదన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. ఈ మేరకు బీఆర్ఎస్ సభపై బండి సంజయ్ హైదరాబాద్ లో ఓ ప్రకటన విడుదల చేశారు. 30 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఎంపీలు 25 రోజులుగా నాందేడ్ లోనే మకాం వేసి ఏర్పాట్లు చేసినా బీఆర్ఎస్ సభ తుస్సు మందన్నారు. ఈ […]
BRS Party: దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ ను విస్తరించే పనిలో ఉన్న సీఎం కేసీఆర్.. ప్రత్యేక దృష్టిసారించారు. ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, తమిళనాడు మాజీ సీఎంతో పాటు పలు రాష్ట్రాల నేతలు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపారు. ఇటీవల ఖమ్మంలో జరిగిన భారీ బహిరంగ సభలోసైతం వారు పాల్గొని ప్రసంగించారు. కాగా, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంకు ఆనుకొని ఉన్న రాష్ట్రాలపై […]
BRS Party: అనుకున్నట్లే బీఆర్ఎస్ విస్తరణలో సీఎం కేసీఆర్ స్పీడ్ పెంచారు. రేపు మహారాష్ట్ర నాందేడ్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన కేసీఆర్.. మిగతా రాష్ట్రాలలో కూడా చేరికలను ప్రోత్సహిస్తున్నారు. బీఆర్ఎస్లో చేరేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన నాయకులు కూడా రెడీగా ఉన్నారు. ఇప్పటికే ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో శాఖలు ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ రేపు మహారాష్ట్రలోని నాందేడ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ముందుగా తెలంగాణ చుట్టుపక్కల రాష్ట్రాలపై దృష్టి […]
Revanth Reddy: తెలంగాణలో ఇప్పుడు చావో రేవో అన్న పరిస్థితి. ఒకపక్క బీఆర్ఎస్ అధికారం నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తుంటే.. ఎలాగైనా జెండా పాతాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డెందుకు సిద్ధమైంది. మరోవైపు కాంగ్రెస్ రాష్ట్రం తెచ్చిన పార్టీగా ఏమైనా మళ్ళీ పుంజుకోవాలని చూస్తుంది. ఈ క్రమంలో ఎవరికి వారు రకరకాల యత్నాలు చేస్తున్నారు. ఈక్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాసినట్లుగా కనిపిస్తుంది. ఈ లేఖలో ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన హామీలు, […]
Telangana Budget 2023: తెలంగాణలో శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ మేరకు ఈ మధ్యాహ్నం 12.10 గంటలకు ప్రారంభం కాగా.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగించనుండడం రెండేళ్ల తర్వాత ఇదే తొలిసారి. అలాగే, టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్‌గా మారిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశాలు కూడా ఇవే. ఈ సమావేశాలను రెండు వారాలపాటు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. నేడు గవర్నర్ ప్రసంగం తర్వాత సభను వాయిదా […]