<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Tag » Assembly
AP Assembly: చివరి రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కూడా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆఖరి రోజు కూడా టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే సభలో గందరగోళం చెలరేగింది. జీవో 1పై చెలరేగిన వివాదంతో ఏపీ శాసనసభ నుండి టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఒక రోజు పాటు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పది మంది సభ్యులను సస్పెండ్ చేశారు. తొమ్మిదో రోజు అసెంబ్లీ […]
AP Assembly: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సోమవారం చోటుచేసుకున్న పరిణామాలు రాష్ట్ర ప్రజలను దిగ్బ్రాంతికి గురిచేశాయి. అధికార, విపక్ష సభ్యుల వాదోపవాదనల నడుమ సభా కార్యక్రమాలు పూర్తిగా స్తంభించాయి. తమ పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యేలపై దాడులకు పాల్పడ్డారని అధికార, ప్రతిపక్షాలు పరస్పర ఆరోపణలకు దిగాయి. సభలో లేని వామపక్షాలు, జనసేన పార్టీలు కూడా సభలో జరిగిన పరిణామాలపై స్పందించడంతో రాజకీయం వేడెక్కింది. తమ ఎమ్మెల్యేలు డోలా బాలవీరాంజనేయస్వామి, గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారని […]
AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. మంగళవారం బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా.. రెండో రోజే సభలో నిరసనలు, ఆందోళనలకు, సస్పెన్షన్స్ చోటుచేసుకున్నాయి. టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీరియస్ అయ్యారు. గవర్నర్ విషయంలో కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ.. 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశారు. సభా సమయం వృథా చేశారంటూ పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడును సభ నుంచి సస్పెండ్ చేయాలని బుగ్గన తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. స్పీకర్ […]
Nara Lokesh: టీడీపీ అగ్రనేత నారా లోకేష్ అసెంబ్లీకి దూరం కావాల్సి వస్తుంది. మరో నెల రోజులలోనే ఆయన పదవీ కాలం ముగియనుంది. మళ్ళీ పదవి దక్కే అవకాశం, బలం లేకపోవడంతో ఆయన అసెంబ్లీకి దూరం కావాల్సి వస్తుంది. ఒక్క లోకేష్ కు మాత్రమే కాదు.. ప్రస్తుతం ఏపీలో ఏడుగురు ఎమ్మెల్సీలు, తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ఏపీ విషయానికి వస్తే నారా లోకేశ్ తో పాటు బచ్చుల అర్జునుడు, పోతుల సునీత, […]
Telangana Budget 2023: 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ వార్షిక బడ్జెట్‌ను మంత్రి హరీశ్ రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రతిపాదించగా.. రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లుగా.. పెట్టుబడి వ్యయం రూ.37,525 కోట్లుగా పేర్కొన్నారు. శాసనసభలో హరీశ్ రావు, శాసన మండలిలో శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. తొలిసారిగా సభ్యులందరికీ పెన్ డ్రైవ్‌ల ద్వారా బడ్జెట్ కాపీలను అందించారు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ […]
KCR Grandson Ritesh Rao: సీఎం కేసీఆర్ అన్న మనవడు మిస్సింగ్ అయ్యాడని.. స్వయంగా అతని తల్లి ఆరోపణలు చేశారు. పోలీసులే తన కుమారుడిని అర్ధరాత్రి తీసుకు వెళ్లారనీ, అప్పటి నుంచీ అతడు కనిపించడం లేదనీ ఆరోపించారు. ఈ విషయాన్ని రితేష్ తల్లి, కేసీఆర్ అన్న కుమార్తె రమ్యారావు తెలిపారు. రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి పోలీసులు తన కొడుకు రితేష్ ను తీసుకెళ్లారని, ఇప్పటి వరకు ఏ పోలీస్ స్టేషన్‌లో ఉన్నాడనే […]
Assembly Sessions: తెలంగాణలో రాజకీయాలు ఏ రేంజిలో ఉన్నాయో అందరికీ తెలిసిందే. పట్టుమని పది నెలలు కూడా ఎన్నికలకు సమయం లేకపోవడంతో ఏ పార్టీకి ఆ పార్టీ అధికారమే టార్గెట్ గా రెచ్చిపోతున్నారు. ఇప్పటికే విపక్షాల మధ్య మాటల యుద్ధం ఓ స్థాయి దాటి తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో అసెంబ్లీ సమావేశాలు రావడం.. అది కూడా బడ్జెట్ సమావేశాలు కావడంతో కొంత ఆసక్తి నెలకొంది. అధికార, ప్రతిపక్షాల మధ్య వాదనలతో అసెంబ్లీ దద్దరిల్లడం ఖాయమని అంచనా […]
Telangana Govt: తెలంగాణలో నీటి పారుదల శాఖకి సంబంధించి మరో కొత్త చట్టం అమల్లోకి రానుంది. దీనికోసం ఇప్పటికే ముసాయిదా బిల్లును కూడా సిద్ధం చేసిన ప్రభుత్వం ఈ బడ్జెట్ సమావేశాలలో.. లేదా వచ్చే అసెంబ్లీ సమావేశాలలో సభలో ప్రవేశపెట్టనుంది. తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదల శాఖకు సంబంధించి ఉన్న 18 వేర్వేరు చట్టాలను కలిపి ఒక కొత్త సమీకృత నీటిపారుదల చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఈ మేరకు ముసాయిదాను కూడా సిద్ధం […]