<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » news
MK Stalin: ఒకపక్క తెలంగాణ సీఎం కేసీఆర్ దేశంలో బీజేపీ యేతర, కాంగ్రెస్ యేతర ప్రభుత్వాన్ని తీసుకురావాలని.. అందుకు దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి రావాలని పిలుపులిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఆయన టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి దేశవ్యాప్తంగా విస్తరించే పనిలో కూడా ఉన్నారు. అయితే, డీఎంకే అధ్యక్షులు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. తన 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని […]
Bank Employees: వారానికి ఐదు రోజుల పని విధానం అమలు కాబోతుంది. దీని ప్రకారం బ్యాంకులు ఇకపై వారానికి ఐదు రోజులే పనిచేస్తాయి. ఇది ఒకరకంగా బ్యాంక్ సిబ్బందికి, ఉద్యోగులకు శుభవార్త కాగా.. వినియోగదారులకు మాత్రం బ్యాడ్ న్యూసే. బ్యాంకు ఉద్యోగులు వారానికి ఐదు రోజులే పని చేసేలా నిబంధనలు మార్చాలని ఐబీఏ (Indian Banks Association)కు బ్యాంకు ఉద్యోగుల సంఘం (UFBE) ప్రతిపాదించింది. ప్రస్తుతం నెలలోని ప్రతి ఆదివారంతో పాటు రెండో శనివారం, నాలుగో శనివారాల్లో […]
Kurnool Murder: హైదరాబాద్ లోని అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలో నవీన్ అనే యువకుడిని స్నేహితుడు హరిహరకృష్ణ అతి దారుణంగా ముక్కలు ముక్కలుగా హత్యచేసిన ఘటన యావత్ దేశం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అది, దర్యాప్తు సాగుతూ కొత్త కొత్త నిజాలు వెలుగులోకి వస్తుండగానే తెలుగు రాష్ట్రాలలో మరో హత్య వెలుగులోకి వచ్చింది. ఈ హత్యలో కూడా స్నేహితుడే నిందితుడు కావడం విశేషం. తాలుకా పోలీస్స్టేషన్ పరిధిలో ఎర్రబురుజుకు చెందిన మురళీకృష్ణ జనవరిలో కనిపించకుండా పోయాడు. కాగా, […]
Konaseema District: సోషల్ మీడియా.. ఇప్పుడు ఇదో మాఫియా. ఇందులో ఒక్కసారి దిగితే ఇక మళ్ళీ బయట పడడం అనేది ఉండదు. ఈ మధ్య కాలంలో పాలు తాగే వయసు పిల్లల నుండి ముదుసలి వరకు ఎవరి నుండి విన్నా ఈ సోషల్ మీడియా ఖాతాల గురించే. అంతగా విస్తృతంగా వ్యాప్తి తర్వాత.. లైక్ లు, షేర్లు, కామెంట్లే జీవితమైపోయింది. వీటికోసం ఎలాంటి వీడియోలు చేయడానికి అయినా సిద్ధపడుతున్నారు కొంతమంది. తాజాగా, ఓ యువకుడైతే ఏకంగా తన […]
M.K.Stalin: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కు.. జమ్ముకశ్మీర్ మాజీ సీఎం నేషనల్ కాన్ఫరెన్స్ (NC) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా మద్దతిచ్చారు. ఆయన ఎందుకు ప్రధానమంత్రి కాకూడదు?, అందులో తప్పేముంది? అని ప్రశ్నించారు. దేశ ఐక్యతను కాపాడేందుకు స్టాలిన్ కృషి చేస్తున్నారని.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు ఎంతో పాటుపడుతున్నారని కితాబునిచ్చారు. చెన్నైలో జరిగిన సీఎం స్టాలిన్ 70వ పుట్టిన రోజు వేడుకల్లో ఫరూక్ అబ్దుల్లా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ప్రతిపక్షం […]
Tirumala Tirupati: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడి కరుణా కటాక్షాల కోసం తెలుగు రాష్ట్రాల నుండే కాదు ప్రపంచ నలుమూలల నుండి వేచి ఉంటారు. ఆ ఏడుకొండలు ఎక్కి వెంకన్నన్ని దర్శించుకుని పరవశించిపోతుంటారు. మన తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కన తమిళనాడు, కర్ణాటక ప్రజలైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు శ్రీవారి దర్శనానికి వస్తుంటారు. అయితే, ఇకపై అలా కుదరదు. ఎందుకంటే, నేటి నుంచి తిరుమలకు వచ్చే భక్తులను నెలకి ఒకసారి మాత్రమే అనుమతించనున్నారు. దాని కోసం ఫేస్ […]
Street Dogs: హైదరాబాద్లో వీధికుక్కల దాడిలో బాలుడు మరణించిన ఘటన అందరినీ కదిలించిన సంగతి తెలిసిందే. భాగ్యనగరంలో నాలుగేళ్ల బాలుడిపై వీధికుక్కలు మూకుమ్మడిగా దాడి చేసి ప్రాణాలు తోడేసిన దుర్ఘటన ఎందరినో నిర్ఘాంత పరచింది. అడవిలో జంతువును వేటాడినట్లు ఆకలిగొన్న అయిదు కుక్కలు అన్ని వైపులనుంచీ దాడికి తెగబడటంతో తీవ్రంగా గాయాలపాలైన చిన్నారి కడకు నిస్సహాయంగా కన్ను మూశాడు. ఈ ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించిన తెలంగాణ హైకోర్టు- వీధికుక్కల నియంత్రణకు ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని, […]
CM KCR: సీఎం కేసీఆర్ కామారెడ్డి జిల్లా తిమ్మాపూర్ లో పర్యటిస్తున్నారు. తిరుమలగా పేరుగాంచిన తిమ్మాపూర్వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవంలో సీఎం దంపతులు పాల్గొన్నారు. తిమ్మాపూర్ లోని శ్రీదేవీ, భూదేవీ సమేత వెంకటేశ్వర స్వామిని సీఎం కేసీఆర్ దంపతులు దర్శించుకున్నారు. అక్కడ స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. సీఎం దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ దంపతులు మొదట బాన్సు వాడకు వెళ్లగా వారికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, […]
Kakinada: గత ఏడాది కాకినాడలో ప్రేమోన్మాది దేవికా అనే యువతిని దారుణంగా హత్యచేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడికి తాజాగా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఏపీలోని కాకినాడ జిల్లా పెదపూడి మండలం కాండ్రేగుల సమీపంలో తన ప్రేమను నిరాకరించిందన్న కక్షతో గత ఏడాది అక్టోబర్ లో గుబ్బల వెంకటసూర్యనారాయణ అనే యువకుడు పట్టపగలు దేవికా అనే యువతిని అతి కిరాతకంగా హత్య చేశాడు. కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం గంగవరానికి చెందిన కాదా రాంబాబు […]
YS Sharmila: మీరు ఒక్క విగ్రహాన్ని కూల్చితే.. మా కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు వెయ్యి విగ్రహాలు పెడతారని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బీఆర్ఎస్ నేతలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పాలకుర్తిలో షర్మిల పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని కూల్చివేయడంపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విగ్రహాన్ని కూల్చేశారని షర్మిల ఆరోపించారు. విగ్రహం కూల్చివేతకు మూల్యం తప్పదన్నారు. అవుతాపూర్ లో వైఎస్ఆర్ విగ్రహాన్ని కూల్చడం నీచమైన చర్య అంటూ మండిపడిన షర్మిల.. […]