<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » devotional
హైదరాబాద్ కు దగ్గరలో గల ముచ్చింతల్‌లోని సమతా స్ఫూర్తి ప్రాంగణంలో శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి చినజీయర్ స్వామి సారథ్యంలో నిత్య కైంకర్యాలు, విశిష్ట వాహన సేవలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఐదో రోజు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. శ్రీరామానుజాచార్య-108 దివ్యదేశాల బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. నిత్య కార్యక్రమాలు కొనసాగాయి. ఉదయం 5 గంటల 45 నిమిషాలకు స్వామివారికి సుప్రభాత సేవ జరిగింది. అనంతరం శ్రీశ్రీశ్రీ త్రిదండి […]
సుప్రసిద్ధ బౌద్ధ దార్శనికుడు ఆచార్య నాగార్జునుడి పేర వెలసినది నాగార్జున కొండ. శాతవాహన చక్రవర్తి యజ్ఞశ్రీ శాతకర్ణి నాగార్జునుని కొరకు శ్రీపర్వతంపై మహాచైత్య విహారాలను నిర్మించాడని ఇతిహాసం తెలియజేస్తుంది. నాగార్జున సాగర్ నిర్మాణ సమయంలో బయల్పడిన, సా.శ.పూ. 2వ శతాబ్దపు బౌద్ధావశేషాలను జలాశయం మధ్య కొండపై నిర్మింపబడిన ప్రదర్శనశాలలో భద్రపరిచారు. ఈ ద్వీపపు ప్రదర్శనశాల ప్రపంచంలోని పురావస్తు ప్రదర్శనశాలలన్నిటిలోనూ అతిపెద్ద ద్వీప ప్రదర్శనశాల. బుద్ధునివిగా చెప్పబడుతున్న దంతావశేషం, కర్ణాభరణం ఇందులో చూడదగ్గవి. ఇక్ష్వాకులు ఇక్కడ శాతవాహనుల సామంతులుగా ఉండేవారు. […]
పతంజలి మహర్షి ఒక యోగశాస్త్ర రచయితగా మనందరికీ సుపరిచితం. కానీ, ఆయన గురించి తెలుసుకోవలసిన విజ్ఞాన విశేషాలు మరెన్నో ఉన్నాయి. మొట్టమొదటగా వ్యాకరణం రాసిన మేధావి పాణిని. ఆయన రాసిన వ్యాకరణ శాస్త్రానికి పతంజలి భాష్యం రాశాడు. అది ప్రపంచవ్యాప్తంగా పేరొందింది. దీంతో విదేశాల నుంచి కూడా ఎందరో శిష్యులు వ్యాకరణ భాష్యం నేర్చుకోవడానికి పతంజలి దగ్గరికి రాసాగారు. మంచి విద్య అందరికీ చెందాలి. ప్రపంచమంతా వ్యాప్తి చెందాలనే ఆశయంతో వారిని శిష్యులుగా స్వీకరించాడు పతంజలి. మొత్తంగా […]
తిరుమల శ్రీనివాసుడి హుండీ నిత్యం కానుకలతో కళకళలాడుతుంది. శ్రీమంతుల నుంచి సామాన్యుడి దాకా తమ స్థాయిని బట్టి రకరకాల కానుకలను శ్రీవారికి భక్తులు సమర్పిస్తారు. ఈ హుండీనే కొప్పెర అని కూడా అంటారు. శ్రీనివాసుడికి ఆయన మామగారు ఆకాశరాజు నుంచి వచ్చిన కానుకల నుంచి నేటి భక్తులు సమర్పించే కానుకల దాకా అన్నీ హుండీ లోనే సమర్పిస్తారు. మరి ఇలా సమర్పించిన బహుమతులను ఎక్కడ లెక్కిస్తారో తెలుసుకున్నారా…? అదే పరాకామణి మరి ఈ పరాకామణి విశేషాలేమిటో ఇపుడు […]
సంత్ రవిదాస్ క్రీ.శ. 1377లో కాశీవద్ద సీర్ గోవర్దనపురం అనే గ్రామంలో, మాఘపూర్ణిమ రోజున చర్మకార కుటుంబంలో జన్మించారు. కలసాదేవి, సంతోఖ్‌దాస్ తల్లిదండ్రులు. ఆనాటి సామాజిక పరిస్థితిలో రవిదాస్‌కు పాఠశాలకు వెళ్ళే అవకాశం ఎక్కడిది? పూర్వజన్మ సుకృతమేమో కానీ చిన్ననాటనే ప్రహ్లాదునివలే దైవభక్తి ఏర్పడింది. దేవాలయంలోకి వెళ్ళే అనుమతి లేదు. దేవాలయం బయట నిలబడి దేవాలయాలంలోని భక్తి గీతాలను శ్రద్ధగా వినేవాడు. మననం చేసుకునేవాడు. ఇలా అనేక భక్తిగీతాలు కంఠస్థమయ్యేవి. తనివితీరా గంగానదిలో ఈతకొట్టేవాడు. పధ్నాలుగో శతాబ్దం […]
పేదల తిరుపతిగా పేరొందిందిన మన్యంకొండ మహబూబ్ నగర్ పట్టణానికి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం ఉంది. పాలమూరు తిరుపతిగా బాసిల్లుచున్న మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారికి ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు ఎప్పుడు ప్రారంభం అవుతున్నాయి..? ప్రత్యేకతలు వంటి విషయాలను గురించి ఇపుడు తెలుసుకుందాం. ఎత్తయిన కొండపై, ప్రశాంత వాతావరణంలో స్వామివారు కొలువై ఉన్నారు. మన్యంకొండ అనగా మునులు తపస్సు చేసుకునే […]
నల్లొండ జిల్లా లోని చివ్వెంల మండలం దురాజ్ పల్లిలో యాదవు ల కులదైవంగా పేరొందినది లింగమంతుల జాతర. తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత రెండో అతిపెద్ద జాతరగా పెద్దగట్టు గుర్తింపు పొందింది. చరిత్ర కలిగిన ఈ లింగమంతుల స్వామి జాతరకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తుంటారు. నల్లొండ జిల్లా దురాజ్ పల్లిలో ఐదు రోజులపాటు జరిగే ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా కృష్ణా, గుంటూరు, ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకొని తమ మొక్కులను తీర్చుకుంటారు. తెలంగాణలో రెండో అతి పెద్దదిగా పేరుగాంచిన పెద్దగట్టు జాతర […]
నిర్మల్ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే ప్రఖ్యాతి చెందిన ఆలయం జ్ఞానసరస్వతి ఆలయం. ఇది నిర్మల్ జిల్లా బాసర మండలం, బాసరలో ఉంది. భారతదేశంలో ఉన్న ప్రముఖ సరస్వతీ దేవాలయాల్లో ఒకటి కాశ్మీరులో ఉండగా, రెండవది ఇదేనని చెపపుకోవచ్చు. బాసరలో జ్ఞాన సరస్వతీ అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి సమేతులై కొలువు తీరి ఉన్నారు. ఇవాళ పుష్యమి నక్షత్రం, పూర్ణిమ, ఆదివారం సెలవు కావడంతో తెల్లవారు జామునుండే భక్తులతో బాసర ఆలయ క్యూలైన్లు నిండిపోయాయి. అమ్మవారి సన్నిధిలో తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించాలని రాష్ట్ర […]
కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో మాఘమాసం పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ చేపట్టారు. ధర్మ ప్రచార రథంతో శ్రీశైలంలో మొదటిసారిగా ఆలయ సిబ్బంది గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ గిరి ప్రదక్షిణ గంగాధర మండపం నుంచి అంకాలమ్మ ఆలయం, నంది మండపం మీదుగా ఆలయ మహాద్వారం వద్దకు సాగనుంది. మల్లన్న ఆలయంలోని పురాతన మండపాలు, ఆలయాలను సందర్శించే వీలుగా గిరి ప్రదక్షిణను ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది పవిత్ర పౌర్ణమి మాఘమాసం ఆదివారం […]
కోటప్పకొండ, పల్నాడు జిల్లా, నరసరావుపేట మండలం, యల్లమంద గ్రామ పరిధిలో ఉన్న త్రికోటేశ్వరుడి పుణ్యక్షేత్రం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన మహిమాన్విత క్షేత్రం. కైలాశాధినేత అయిన ఆ మహా శివుడు త్రికోటేశ్వరుని రూపంలో కొలువైన దివ్య సన్నిధి ఈ కొండ. యల్లమంద కోటయ్యగా భక్తులకు ప్రీతి పాత్రుడైన శివుడు కోటప్పకొండలో కొలువై భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్నాడు. ప్రతి ఏటా కార్తీకమాసంలో కోటప్పకొండ తిరుణాళ్ళు, కార్తీక వన సమారాధనలు కూడా జరుగుతాయి. ఈ తిరణాళ్లలో చుట్టుప్రక్కల ఊర్లనుండి ప్రభలతో భక్తులు దేవాలయాన్ని […]